Home Cinema Tarun – Niharika : తరుణ్ నిహారిక ల పెళ్లి పై క్లారిటీ వచ్చేసిందోచ్..

Tarun – Niharika : తరుణ్ నిహారిక ల పెళ్లి పై క్లారిటీ వచ్చేసిందోచ్..

hero-tarun-gave-clarity-about-his-marriage-with-niharika-rumors

Tarun – Niharika : తరుణ్ మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించడం జరిగింది. తర్వాత నువ్వే కావలి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై.. మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. ఆ రోజుల్లో ( Tarun and Niharika marriage clarity ) లవర్ బాయ్ గా పేరు సంపాదించుకుని అందరిలోని విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. తరుణ్ సినిమా అంటే యువత అంతా కూడా ఎంతో క్రేజ్ గా సినిమాకు వెళ్లేవారు. నువ్వే కావాలి, ప్రియమైన నీకు, అదృష్టం, నువ్వే నువ్వే ఇలాంటి సూపర్ హిట్ సినిమాలు తో తనకంటూ ఒక క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి తరుణ్ సినిమా రంగానికి దూరంగా ఉండటం మొదలుపెట్టాడు.

See also  Salaar Telugu Trailer Review : సలార్ తెలుగు ట్రైలర్ రివ్యూ..

hero-tarun-gave-clarity-about-his-marriage-with-niharika-rumors

తన వ్యాపారాలను చూసుకుంటూ బిజీగా ఉన్నాడని.. మళ్లీ సినిమాల్లో రి ఎంట్రీ ఇస్తాడని వార్తలు అయితే వస్తున్నాయి. అలాగే అతని తల్లి రోజారమణి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడు, సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుల ఫ్యామిలీ నుంచి అమ్మాయిని చేసుకుంటాడు అని చెప్పడం జరిగింది. దీనితో ( Tarun and Niharika marriage clarity ) సోషల్ మీడియాలో తరుణ్.. నిహారిక ని పెళ్లి చేసుకుంటాడని విపరీతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే నిహారిక కూడా ఇటీవలే తన భర్తకు విడాకులు ఇచ్చి.. సింగల్ గా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుల కుటుంబం నుంచి అనే మాటను పట్టుకుని.. అయితే నిహారికనే చేసుకుంటాడు అని చాలామంది అనుకుంటున్నారు.

hero-tarun-gave-clarity-about-his-marriage-with-niharika-rumors

అలాగే తరుణ్ సెకండ్ ఎంట్రీ ఇస్తాడని.. నిహారిక కూడా సెకండ్ ఎంట్రీ హీరోయిన్ గా ఇవ్వాలనుకుంటుంది కనుక.. వీళ్ళిద్దరి మనస్తత్వం కూడా సూట్ అవుతుందని.. కచ్చితంగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరగబోతుంది అనుకుంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై హీరో తరుణ్ ( Tarun and Niharika marriage clarity ) స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి. తరుణ్ ఈ వార్తని పూర్తిగా ఖండిస్తున్నాడు. ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు. నేను మెగా కుటుంబానికి అల్లుడు కావడం లేదు. నిహారిక కి నాకు ఎటువంటి మ్యారేజ్ జరగడం లేదు అని తరుణ్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసాడంట.

See also  Mahesh Babu: ధనుష్ లో ఆ కోణాన్ని పొగిడిన మహేష్ బాబు..

hero-tarun-gave-clarity-about-his-marriage-with-niharika-rumors

అంతేకాదు ఇలాంటివి ఏమైనా ఉంటే.. నా లైఫ్ లో ఏదైనా పెళ్లి గురించి శుభవార్త అనేది ఉంటే.. నేను స్వయంగా సోషల్ మీడియా ద్వారా చెప్తాను. అంతేగాని మీకు మీరు ఊహించుకుని ఇటువంటి వార్తలని అసలు క్రియేట్ చేయొద్దని.. పైగా దాన్ని ఎవరు నమ్మద్దు అని తరుణ్ చెప్పాడంట. ఇది ఇలా ఉంటే.. ఇక ఈ వార్త తెలిసిన దగ్గరనుంచి నెటిజనులు.. తరుణ్ ఇంతవరకు ఆర్తి అగర్వాల్ ని మర్చిపోలేదని.. అందుకే అతనికి వేరే పెళ్లి అనే ధ్యాసే రావడంలేదని.. ఆర్తి అగర్వాల్ ని ధైర్యం చేసి పెళ్లి చేసుకుంటే జీవితం బాగుండును అని.. మళ్ళీ ఒకసారి తరుణ్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి అందరూ చాలా బాధపడుతున్నారు. ఎవరి తలరాతలో ఎవరిని రాస్తాడో.. ఏ జంట కలిసి ఉంటుందో, విడిపోతుందో.. అదంతా మనుషుల చేతుల్లో ఉంటే ఇంకేమీ.. దైవాదినం అని మరికొందరు నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.