Home Health Bad Habits: ఈ చెడు అలవాట్లు మీరు వృద్ధులు అవ్వడానికి కారణం అవుతున్నాయి ఇవాళే వదిలేయండి.

Bad Habits: ఈ చెడు అలవాట్లు మీరు వృద్ధులు అవ్వడానికి కారణం అవుతున్నాయి ఇవాళే వదిలేయండి.

ఈ చెడు అలవాట్లు మీరు వృద్ధులు అవ్వడానికి కారణం అవుతున్నాయి ఇవాళే వదిలేయండి.

Bad Habits: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చెడు అలవాట్లు విపరీతంగా పెరిగిపోయి మన జీవనశైలి సరిగా లేకపోవడమే మన వయసుపై వేటు పడి చిన్న వయసులోనే ముసలితనం వచ్చేస్తుంది.

మరి అలాంటి చెడ్డ అలవాట్లను ఈ రోజే వదిలేద్దామా. నేడు మనం ఎదుర్కొంటున్న సమస్యలతో చిన్నతనం లోనే ముసలివారిగా కనబడుతున్నాము

ముఖంపై మచ్చలు, ముడతలు ఏర్పడి మనము అందవికారంగా కనిపిస్తునాము దానివలన మన ఆత్మ విశ్వాసం దెబ్బతింటుంది అందుకోసమే కొన్ని చెడ్డ అలవాట్లు వదిలెయ్యడమే ముఖ్యం. ఇవి మీరు మీ వయసు ఎక్కువగా కనపడేలా చెయ్యడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని నష్టం కలిగిస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం.

See also  నిమ్మకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో తెలుసా.?

ఎండ: చలికాలం రాగానే ఎక్కువ సేపు ఎండలో కూర్చుంటారు అలా కూర్చోవడం మంచిదే కానీ మరీ ఎక్కువ సేపు కూర్చోకూడదు.

అలా కూర్చుంటే మీ చర్మం దెబ్బతింటుంది. సన్ క్రీమ్స్ ఉపయోగించనప్పుడు సూర్యరశ్మి ప్రభావం మన శరీరంపై ప్రభావం చూపుతుంది.

నిద్ర: రోజూ మన శరీరానికి తగినంత నిద్ర లేకపోవడం వల్ల మన శరీరం చాలా ఒత్తిడి గురయ్యి మన ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది. సోమరితనం అలవాటు అవుతుంది.

See also  అల్లం వల్ల ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలు తెలుసుకుందామా...

నీరు: మన శరీరంలో కొంత శాతం నీటి మట్టం తగ్గిందంటే డీహైడ్రేషన్ కు గురవుతాము. శరీరంలో నీరు తక్కువైతే చర్మంపై వేటు పడుతుంది.

తద్వారా మెటిమలు, నల్ల మచ్చలు, చర్మం పొడిబారటం వంటి సమస్యలు మొదలవుతాయి. మళ్ళీ పరిష్కారం అధికంగా నీరు తాగడమే.

ఆహరం : ఆహర అలవాట్లు సమయపాలన ప్రకారం సక్రమంగా ఉంటే మన శరీరం అధ్భుతంగా ఉంటుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ఆహరం ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.

See also  తినే టైమ్ లో నీళ్ళు ఎక్కువగా తాగుతున్నారా.? తెలుసుకోండి ఈ విషయాలు మీ కోసమే...

జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుట్, సోడా, షుగర్ ఫుడ్, డ్రింక్స్ తీసుకోకుంటే చాలా మంచింది.