Baby : ఆనంద దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించగా.. సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన బేబీ సినిమా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా యువతని ( Baby movie again for that scene ) చాలా అట్రాక్ట్ చేస్తుంది. రొమాంటిక్ డ్రామా చిత్రమైన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయింది కానీ.. ఎవ్వరూ ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ వైష్ణవి చైతన్యకి విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల రేంజ్ దగ్గరికి వెళ్లేంత స్కోప్ కనిపిస్తుంది.
ఇటీవల కాలంలో.. లో బడ్జెట్ సినిమాలు మంచి రిజల్ట్ ని ఇస్తున్నాయి. అలాంటి వాటిలోనే బలగం, రంగస్థలం, సామజవరగమన, బేబీ ఇలా కొన్ని సినిమాలు బడ్జెట్ పరంగా చూసుకుంటే ఎంత కింద స్థాయిలో ఉన్నా కూడా.. కలెక్షన్ల ( Baby movie again for that scene ) పరంగా చూసుకుంటే స్టార్ హీరోల సినిమాలు దాటేశాయి. భారీ బడ్జెట్లో, విపరీతమైన హోప్స్ తో, రిలీజ్ అయిన సినిమాలు కూడా ఈ సినిమాల దాటికి తట్టుకోలేకపోయాయి. అందుకే అంటారు కంటెంట్ ఉంటే ఆ సత్తా నే వేరని.. ఆడియన్ నాడిని తెలుసుకుని.. దేనికి కనెక్ట్ అవుతాడో అర్థం చేసుకుని.. దాన్ని తీసుకోగలిగితే.. ఎంత చిన్న సినిమా అయినా కాసులు వర్షాన్ని కురిపించి తీరుతాదని ఈ సినిమాలు రుజువు చేశాయి.
బేబీ సినిమాలో కొన్ని సీన్స్ వాస్తవానికి చాలా దగ్గరగా.. యువతకు చాలా అట్రాక్షన్ గా ఉండడంతో.. ఆ సినిమాని ఒక్కసారి కాదు, రిపీట్ రిపీట్ గా చూస్తున్నారు. యువత చూసినవాళ్ళే మళ్ళీ చూస్తున్నారు.. ఒక్కరూ వెళ్లి చూస్తున్నారు, ఫ్రెండ్స్ తో వెళ్లి చూస్తున్నారు, ఫ్యామిలీతో వెళ్లి చూస్తున్నారు, ఇలా మళ్లీ మళ్లీ వెళ్లి చూడ్డానికి ఏదో ఒక ( Baby movie again for that scene ) వంక వెతుక్కుంటున్నారు. అందుకే ఆ సినిమా కలెక్షన్స్ అంతలా అదరగొడుతుంది. అయితే ఇంత బాగా బిజినెస్ జరిగిన తర్వాత బేబీ చిత్ర బృందం మళ్ళీ ఒక కొత్త ప్లాన్ వేసింది. ఆ సినిమాలో మళ్లీ కొన్ని సీన్స్ ని యాడ్ చేయాలని డిసైడ్ అయింది. ఇది నిజంగా ఒక తెలివైన పనే.. రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు కూడా కొన్ని సినిమాలకు ఇలాగ కొన్ని రోజుల తర్వాత కొన్ని సీన్స్ యాడ్ చేసి.. మళ్లీ తన ఆడియన్స్ ని రిపీట్ గా వచ్చేలా చేశాడు.
ఇప్పుడు బేబీ చిత్ర బృందం కూడా అదే చేస్తుంది. మళ్ళీ కొన్ని సీన్స్ ని యాడ్ చేసుకుని దానివలన మళ్లీ అభిమానులు రిపీట్ గా సినిమాకు రావడానికి ఛాన్సెస్ సంపాదించుకుంటుంది. ఈసారి ఆ సీన్స్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయని.. మనసుకి హత్తుకునే లవ్ రిలేటెడ్ సీన్స్, సెంటిమెంట్ డైలాగ్ సీన్స్ కూడా ఉంటాయని అంటున్నారు. ఆగస్టు మొదటివారం నుంచి ఆ సీన్స్ ని చిత్రంలో యాడ్ చేసేలాగా ప్లాన్ చేస్తుంది చిత్ర బృందం. ఈ సినిమాలో ఆ సీన్స్ ఆడ్ చేసిన తర్వాత మొత్తం 185 నిమిషాలు సినిమా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఆ సినిమా ఎలా కనెక్ట్ అయిందో ఆడియన్స్ కి అర్థమైంది. ఆ దర్శకుడు ఇంకా మళ్ళీ రిపీట్ గా చూడ్డానికి కావలసిన కొన్ని సీన్స్ ని యాడ్ చేస్తున్నాడు అంటే.. ఇంకెంత బాగా చిత్రీకరించి యాడ్ చేస్తున్నాడో మరి ఊహించుకోవచ్చు. అందుకే బేబీ చిత్రం బృందం వాళ్ళు.. బేబీ సినిమాలో అదిరిపోయే ఆ సీన్స్ మళ్లీ చూస్తారా.. రండి చూద్దాం.. అని ఆహ్వానిస్తున్నారు.