BRO : ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకరితో ఒకరు హాయ్ బ్రో ఎలా ఉంది బ్రో అంటూ మాట్లాడుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మేనమామ – మేనల్లుడు ఇద్దరు కలిసి నటిస్తున్నారు అని తెలియగానే ఈ సినిమాపై అప్పట్లో భారీ ( BRO First Day Collection ) అంచనాలను నెలకొన్నాయి. కానీ ఆ తర్వాత నెమ్మదిగా అంచనాలైతే తగ్గాయి. మళ్ళీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. పెరిగిన అంచనాలు ఎలా ఉన్నాయి అనుకుంటూ నిన్న ఎందరో ఈ సినిమాకి వెళ్లడం జరిగింది.
పవన్ కళ్యాణ్ అభిమానులకు అయితే సినిమా పిచ్చగా నచ్చేసింది. ఎందుకంటే.. ఈ సినిమాలో అసలు పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఉంటాడు? చాలా తక్కువ సమయం ఉండొచ్చు అని అందరూ అనుకున్నారు కానీ.. సినిమాలో చాలా ఎక్కువ శాతమే ఎక్కడపడితే అక్కడ పవన్ కళ్యాణ్ ( BRO First Day Collection ) కనిపిస్తూనే ఉన్నాడు. హీరో పక్కనే అంటిపెట్టుకుని ఉన్నాడు. ఇక పవన్ మార్క్ అనేది.. ఆయన మేనరిజం.. నటన అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ చాలా స్మార్ట్ గా, ఇంకా గ్లామర్ గా ఉన్నాడు. దీంతో సినిమా స్క్రీన్ మొత్తం మీద అతని గ్లామరే అలా కనిపిస్తూనే ఉంది.
ఎక్కడికక్కడ సినిమాని బోర్ కొట్టినవ్వకుండా పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన మాటల్ని చక్కగా డెలివరీ చేస్తూ.. ఆయన హావభావాలతో ఆ మాటలకి ఒక అందాన్ని తెచ్చాడు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు మా హీరో మా హీరోనే అంటూ ఆనందంతో పొంగిపోతున్నారు. సినిమాలో పేరుకి హీరో సాయిధరమ్ తేజ్ అయినప్పటికీ.. మొత్తం హీరోఇజం ( BRO First Day Collection )అంతా పవన్ కళ్యాణ్ లోనే కనిపించింది. అయితే కొన్నిచోట్ల ఈ సినిమా మీద మిక్స్డ్ టాక్ రావడంతో.. పవన్ కళ్యాణ్ అభిమానులకు విపరీతంగా నచ్చిందని.. సామాన్య ప్రేక్షకుడికి ఇది యావరేజ్ సినిమా అని అంటూ ఉన్న క్రమంలో.. పవన్ అభిమానులు గాని, బ్రో సినిమా చిత్ర బృందం గానీ ఈ టాక్ కి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లేదు. ఎవరి కారణాలు వాళ్లకు ఉండొచ్చు ఏదేమైనా సినిమా హిట్టా, పట్టా అనేది చెప్పేది కలెక్షన్స్ మాత్రమే.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1600 స్క్రీన్ లలో రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ నైజాంలో 30 కోట్లు, సీసెడ్ లో 13 కోట్లు, ఉత్తరాంధ్రలో 9.5 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 6.4 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 5.4 కోట్లు, గుంటూరు జిల్లాలో 7.3 కోట్లు, నెల్లూరు జిల్లాలో 3.5 కోట్లు, కృష్ణాజిల్లాలో 6 కోట్లు ఇలా మొత్తం 80 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇతర రాష్ట్రాల్లో కర్ణాటకలో 5 కోట్లు, ఓవర్సీస్ లో 10 కోట్లు బిజినెస్ జరిగింది. ఇకపోతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 97 కోట్ల రూపాయలు ఆదాయం రావాలి. మొదటి రోజు కలెక్షన్స్ అయితే 40 నుంచి 45 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.