Lavanya Tripathi : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ తర్వాత వీళ్ళిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే వీళ్ళ పెళ్లి డేట్ ఫిక్స్ అవుతుందని.. ఆగస్టులో ఉండొచ్చని అనేక వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ గా ఇంతవరకు పెళ్లి డేట్ ఫిక్స్ చేసి ఇవ్వలేదు గాని వార్తలు అయితే మాత్రం చాలా ( Lavanya Tripathi after marriage ) తెలుస్తున్నాయి. జూన్ 9వ తేదీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నాగబాబు ఇంట్లో ఘనంగా వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి విదేశాలకు వెళ్లి.. కొన్ని రోజులు ట్రిప్ కూడా ఎంజాయ్ చేశారు. ఇటీవల లావణ్య త్రిపాఠి జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ.. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు చూసిన కుర్రాళ్ళు లావణ్య త్రిపాటి అదిరిపోయింది అంటూ కామెంట్లు కూడా చేశారు.
సాధారణంగా హీరోయిన్స్ కి మెయిల్ ట్రైనర్ కూడా ఉంటారు. కానీ లావణ్య త్రిపాఠి జిమ్ లో లేడీ ట్రైలర్ తో ఆమె ఫోటోలను షేర్ చేసింది. అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుకునేది ఆలోచించేది ఒక్క ( Lavanya Tripathi after marriage ) పాయింట్ మీదే అదేంటంటే.. లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలు నటిస్తుందా లేదా ఒకవేళ మెగా కుటుంబం సినిమాల్లో నటించకూడదని రూల్ పెడితే.. అలాగే అని చెప్పి, ఇప్పుడు పెళ్లి చేసుకుని.. పెళ్లి తర్వాత ఆ రూల్ వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా అని కొందరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నిహారిక లైఫ్ లో కూడా ఇదే జరిగింది. పెళ్లి తర్వాత సినిమాలో నటించకూడదని ఆమె భర్త, అత్త వారు చెప్పగా ఆమె దానికి అంగీకరించడం జరిగింది.
ఆ తర్వాత కొంతకాలానికి ఆ జీవితం నచ్చకో.. లేకపోతే భర్తతో మనస్పర్ధలో తెలీదు గానీ విడాకులు ఇచ్చింది. అలాగే ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా సినిమాలో నటించనని చెప్పడం వలన.. ఆమె కూడా విడాకులు ఇస్తుందా అని కొందరు ఆలోచిస్తున్నారు. అయితే అందరి జీవితంలో అలాగే ఎందుకు అవుతాది? లావణ్య త్రిపాఠి మహేష్ బాబు ( Lavanya Tripathi after marriage ) భార్య నమ్రత లాగా ఇంటిపట్టునుండి.. వరుణ్ తేజ్ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకుంటూ.. లైఫ్ని సక్సెస్ ఎలా చేయాలో పాటించొచ్చు కదా.. అలాగే ఆలోచిస్తుందని కూడా అనేక వార్తలు అయితే వస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే లావణ్య త్రిపాఠి తర్వాత నటించదు అని అనడానికి ఉదాహరణ ఏంటంటే.. ఆమె కొత్తగా ఏ సినిమాలకు కూడా సైన్ చేయడం లేదు. ఇప్పటివరకు ఉన్న సినిమాలను మాత్రమే పూర్తి చేసేసుకుని ఆ తర్వాత ఏమి కూడా సైన్ చేయటం లేదని తెలుస్తుంది.
లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ.. మేకప్ కి దూరంగా ఉండాలని అనుకుంటుందని అంటున్నారు. అలాగే కేవలం నటన మాత్రమే కాకుండా ఆమె చదువుకున్న రోజుల నుంచి.. ఆమె చేతిలో ఒక విద్య ఉందంట. అదే శాస్త్రీయ నృత్యం. శాస్త్రీయ నృత్యంలో ఇప్పుడున్న హీరోయిన్స్ లో లావణ్య త్రిపాఠి ఒక ప్రత్యేకమని.. భలే భలే మగాడివోయ్ సినిమాలో చూపించింది. అందుకని ఆమె పెళ్లి తర్వాత దానికి రిలేటెడ్ కాలేజ్ పెట్టి.. మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఈమె చదువుకునే రోజుల్లోనే మిస్ ఉత్తరాఖండ్ ని గెలుచుకుంది. అలాగే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లో పెళ్లికూడా ఇటలీలో జరగబోతుందని అంటున్నారు. ఈ వార్తలన్నీ ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని హాయిగా కలిసి ఉండాలని మాత్రం మెగా అభిమానులు కోరుకుంటున్నారు.