Home Cinema Bhola Shankar Trailer Review : ఆఖరికి చిరంజీవి కూడా ఆ డైలాగ్ వాడాడా?

Bhola Shankar Trailer Review : ఆఖరికి చిరంజీవి కూడా ఆ డైలాగ్ వాడాడా?

mega-star-chiranjeevi-movie-bhola-shankar-trailer-review

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్గా, కీర్తి సురేష్ ముఖ్యమైన పాత్రలో నటించగా.. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుందేమో అనిపించేలా ట్రైలర్ ఉంది. ఈరోజు ( Bhola Shankar Trailer Review ) నాలుగు గంటల ఐదు నిమిషాలకి రిలీజ్ అయిన ఈ ట్రైలర్ మెగా అభిమానులందరికీ ఎంతగానో నచ్చింది. అయితే అభిమానులకు ఎలాగో నచ్చుతుంది కానీ.. సామాన్య సినీ అభిమానులకు ట్రైలర్ ఎలా ఉంది అనేది చూడాలి. ఈ ఏడాది సంక్రాంతి పండుగలో చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య రిలీజ్ అయ్యి.. ఎంతగానో అలరించింది.

mega-star-chiranjeevi-movie-bhola-shankar-trailer-review

ఆ సినిమా బ్లాక్ పోస్టర్ గా నిలిచి విపరీతమైన కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా ఆ సినిమాలో చిరంజీవి జోష్ చూసి.. మెగా అభిమానులందరికీ విపరీతమైన హుషారు వచ్చింది. అయితే బోలా శంకర్ సినిమా ఎలా ఉంటుందో అని ఎక్కడో ఒక మూల కొంచెం అభిమానం ఉండేది కానీ.. ట్రైలర్ చూసిన తర్వాత అభిమానులకు అనుమానాలు ( Bhola Shankar Trailer Review ) పటాపంచలైపోయాయి. చిరంజీవి నడవడం, కామెడీ, ఫైట్స్, డాన్సులు ఇవన్నీ చూస్తే ఒకప్పటి చిరంజీవి మళ్ళీ వచ్చేసాడు అనిపించింది. సినిమా ట్రైలర్ చూస్తే కొన్ని చిరంజీవి పాత సినిమాలు అయితే మాత్రం గుర్తుకొస్తున్నాయి. చిరంజీవి సినిమా చూడాలని ఉంది సినిమా గుర్తుకు వస్తుంది. ఇందులో ఆ ఫైట్స్ గాని, ఆ డైలాగ్స్ ఆ వాతావరణం అన్ని చూస్తే ఆ సినిమా కొంచెం గుర్తుకొస్తుంది.

See also  Mega Heroine : మరో మెగా హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా.. నిహారికా శ్రీజా కాదుగాని ఆమైతే మాత్రం రేంజే వేరబ్బా!

mega-star-chiranjeevi-movie-bhola-shankar-trailer-review

అలాగే ఒక సామాన్యుడిలా కనిపిస్తూ చిన్న చిన్న రౌడీలతో ఫైట్ చేస్తూ పెద్ద గ్యాంగ్స్టర్ వరకు రీచ్ అవ్వడం కామెడీగా నటిస్తూ అసలైన సబ్జెక్టు మీద ఫైట్ చేయడం అంటే రీసెంట్గా వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమా కూడా గుర్తుకొస్తుంది. ఏదేమైనా ఈ సినిమా కథ ఏ సినిమాలా ఉంటుంది అని ఆలోచించాల్సిన పనిలేదు. ఈ సినిమా ( Bhola Shankar Trailer Review ) తమిళ సినిమా వేదాళం రీమేక్ అని మనందరికీ తెలిసిందే. కాకపోతే అయినప్పటికీ చిరంజీవికి తగ్గట్టుగా మసాలా అంతా జోడించి.. సినిమా తీసినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో తమన్నా లాయర్ అన్న విషయం తెలుస్తుంది. కోర్ట్ సీన్స్ లో చిరంజీవి కామెడీ బాగా పండిస్తాడని అర్థమవుతుంది. రామ్ చరణ్ బాబు లా నటిస్తున్నాడు కదా అనే డైలాగ్ సూపర్ గా ఉంది. చిరంజీవి ఫైట్ సీన్ లో స్టైల్ గా నడిచిన నడక స్టైల్ చూసి అభిమానులు అదిరిపోయింది అంటున్నారు.

See also  Gangstar: హాట్ టాపిక్ గా మారిన పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ...

mega-star-chiranjeevi-movie-bhola-shankar-trailer-review

మళ్ళీ మా బాస్ అదే జోష్తో బ్యాక్ వచ్చాడు అని అంటున్నారు. నిజంగానే చిరంజీవి ఈ జనరేషన్ హీరోలని బీట్ అవుట్ చేస్తూ.. అదరగొట్టేలాగా స్టైల్ చేస్తూ ట్రైలర్ ని బాగా చూపించాడు. అన్ని బాగున్నాయి.. కాకపోతే ఇంతకాలం చిరంజీవి మాటలను, చిరంజీవి పాటలని, చిరంజీవి సినిమా పేర్లు అన్నిటికీ చిరంజీవిని వాడుకునే చిన్న హీరోలు మాత్రమే మనకు తెలుసు. చిరంజీవి తర్వాత వచ్చిన మెగా హీరోలు అందరూ ఆయనకి సంబంధించిన వాటిని వాడుతూ సినిమాలు తీసుకున్నారు. కానీ ఈరోజు చిరంజీవి.. పవన్ కళ్యాణ్ డైలాగ్ ని ఈ ట్రైలర్ లో చూపించడం అనేది.. ఎక్కడో ఒక మూల చిరంజీవి.. అతని కంటే చిన్నోడిది డైలాగ్ వాడడం ఏమిటి? ఆఖరికి చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ డైలాగ్ వాడాడ అని సినీ అభిమానులు ఎక్కడో ఒక మూల చిన్నగా ఫీల్ అయితే అయినట్టు అనిపిస్తుంది. ఏదేమైనా అది పక్కన పెడితే ట్రైలర్ మాత్రం సూపర్ గా ఉంది.