Sakshi Dhoni: మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు చెప్తే తెలియని భారతీయ క్రికెట్ అభిమాని ఐతే ఉండడు. ఒకానొకప్పుడు క్రికెట్ ప్రేమికులకు ఎంఎస్ ధోని పేరు చెప్తే చాలు అదొక ధైర్యం ఉండేది విజయానికి ప్రతి రూపంగా ఆయనను కొని ఆడేవారు. ప్రస్తుతం క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మళ్లీ మనందరికీ చేరువ అవ్వడానికి ధోని ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను ప్రారంభించి మళ్ళీ మన ముందుకి మనల్ని పలకరించడానికి రాబోతున్నారు. ఇక ఈ సంస్థను ధోని అర్ధాంగి సాక్షి మొత్తం చూసుకుంటుంది. ఇక ఈ ఎంటర్టైన్మెంట్ నుంచి విడుదలైన తొలి చిత్రం LSG – లెట్స్ గెట్ మ్యారీడ్.. తమిళ హీరో హరీష్ కళ్యాణ్ మరియు ఇవానా హీరో హీరోయిన్లుగా తిరకెక్కిన ఈ చిత్రం.
ఈ నెల 28వ తారీఖున ప్రేక్షకుల ముందు సందడి చేయనున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అవ్వబోతుంది. మొదటి చిత్రం కనుక అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. దీంతో ఈ చిత్రానికి సంబంధించి ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని సాక్షి ధోని నిన్న ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి తెలుగులో ఏర్పాటు చేయడం విశేషం. ఇక ఈ ప్రెస్ మీట్ లో భాగంగా ఎన్నో ప్రశ్నలు ఆమె చెంతకు చేరాయి. ఇక ఈ ప్రెస్ మీట్ సమావేశంలో భాగంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆమె చెప్పిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రత్యేకించి ప్రత్యేకంగా తెలుగులో ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఓ రిపోర్టర్ ఏకంగా భవిష్యత్తులో మీ బ్యానర్ నుండి ధోని గారిని హీరోగా పెట్టి ఏమైనా సినిమా తీస్తారా అని ప్రశ్నించాడు.
అప్పుడు ఆ ప్రశ్నకు సమాధానంగా సాక్షి స్పందిస్తూ ఒక వేళ అలాంటి అవకాశం వస్తే అన్ని కలిసి వేస్తే ఖచ్చితంగా సినిమా చేస్తానని ఆమె వెల్లడించింది. ఈ ప్రశ్న అయిపోగానే మరొక విలేకరి టాలీవుడ్ స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్ , ప్రభాస్ లతో మీరు సినిమాలు చేస్తారా అని అడగ్గా.. సాక్షి సదరు విలేఖరికి సమాధానం చెబుతూ వాళ్లకు రెమ్యునరేషన్ ఇవ్వాలంటే మా ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంటూ బదులిచ్చింది. నేను మొదలుపెట్టిందే ఇప్పుడు సినీ కెరియర్ ను ముందు దానికి ఓ పఠిష్టమైన పునాది పడనియ్యండి. అప్పుడే అంత పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు ఎందుకు అని తెలుపింది మహేంద్ర సింగ్ ధోనీ భార్య (Sakshi Dhoni) సాక్షి.
మరదే విధంగా ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఆకట్టుకున్నాయి. మంచి స్పందన సైతం రాబట్టుకుంది. ధోనీకి ఉన్న క్రేజ్ తో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెడుతుందని అంతా భావిస్తున్నారు. ట్రేడ్ వర్గాలు సైతం అదే ఆలోచనలో ఉన్నారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కచ్చితంగా ఈ చిత్రం 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువే కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు మరి ఇందులో నిజం అనేది ఎంతవరకు ఉందో తెలియాలంటే ఈ చిత్రం విడుదలైన తర్వాత తెలుస్తుంది.