Namrata Shirodkar : సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి మనందరికీ తెలుసు. ఆమె మహేష్ బాబుకు భార్య కాకముందే 1993లో మిస్ ఇండియాగా టైటిల్ గెలుచుకున్న ట్యాలెంటెడ్ మనిషి. అక్కడ నుంచి ఆమె సక్సెస్ కి తిరుగులేదు. నార్త్ లో ఆమెకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత ( Namrata rejected Pawan Kalyan ) 2000 సంవత్సరంలో వంశీ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. వంశీ సినిమా మహేష్ బాబుతో కలిసి నటించిన నమృత అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం జరిగింది. మహేష్ బాబు నమ్రత కొన్నేళ్లపాటు సీక్రెట్ గానే ప్రేమించుకున్నారు.
ఆ తర్వాత మహేష్ బాబు ఇంట్లో చెప్పి వాళ్ళని ఒప్పించడానికి నానా కష్టాలు పడ్డారు. చివరికి వాళ్ళ పెళ్లి చాలా సింపుల్గా జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. వంశీ సినిమా తర్వాత నమ్రుతా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చేసిన సినిమాలు తక్కువే అయినా బాలీవుడ్ చిత్రాల్లో బాగానే చేసింది. అయితే తెలుగులో కూడా ( Namrata rejected Pawan Kalyan ) చిరంజీవితో కలిసి అంజి సినిమాకి సైన్ చేసింది. ఆ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే.. మహేష్ బాబు నమ్రత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట. అయితే మహేష్ బాబు నమ్రత తో పెళ్లికి మొదట మహేష్ బాబు ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదంట. ఆ తర్వాత మహేష్ బాబు ప్రేమను అర్థం చేసుకుని వాళ్ళ పెళ్లికి ఒప్పుకోవాలంటే నమ్రత పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదు అని కండిషన్ పెట్టారంట.
ఆ కండీషన్ కి నమ్రత ఒప్పుకోగా.. పెళ్లికి సిద్ధమైన తర్వాత మహేష్, నమ్రత చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. నమ్రత పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగానే ఉంది కానీ.. అన్ని విషయాల్లో మహేష్ బాబుకు ఆమె ఎంతో సపోర్ట్ గా ఉంది.. కుటుంబాన్ని ముందుకు నడిపింది. అందుకే ఆమె అంటే మహేష్ బాబు అభిమానులందరికీ ( Namrata rejected Pawan Kalyan ) ఎంతో గౌరవం. అయితే నమిత పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సినిమా చేసే అవకాశం వచ్చిందంట. అదేదో సినిమా కాదు పవన్ కళ్యాణ్ సినిమా బాలు. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో ఒక హీరోయిన్ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర ఆ సినిమాకి. ఆ రోల్ లో నేహా ఒబెరాయ్ నటించింది. అలాగే ఆ సినిమాలో రెండో హీరోయిన్ గా శ్రీయ నటించింది.
అయితే ఈ సినిమాలో మొదట నేహా ఒబెరాయ్ హీరోయిన్గా అనుకోలేదంట. ఆ పాత్రలో నమ్రతని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారు అంట. నమ్రుతాకి స్టోరీ.. అందులో ఆమె పాత్ర కూడా చాలా నచ్చిందట కానీ.. అప్పటికే మహేష్ బాబుని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది కాబట్టి.. మహేష్ బాబుని అడిగిందంట. మహేష్ బాబు.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు సినిమాలు ఒప్పుకోవద్దని చెప్పాడంట. దాంతో ఆమె ఏమి చేసేదిలేక పవన్ కళ్యాణ్ సినిమాని రిజెక్ట్ చేసిందంట. అలా మహేష్ బాబు కారణంగా పవన్ కళ్యాణ్ ని అవమానించిందన్నమాట అని నెటిజనులు అనుకుంటున్నారు. కానీ దాంట్లో అవమానం ఏముంది? ఆ సినిమా పెద్ద అనుకున్నంత హిట్ కాకపోయినా ఆ పాత్రకైతే మంచి పేరు వచ్చింది.. ఆ విధంగా నమ్రత అంత మంచి పాత్రని మహేష్ బాబు వలన మిస్ అయింది అని కూడా అనుకోవచ్చుగా అని మరికొందరు అంటున్నారు.