Home Cinema Mahesh Babu : మేకప్ లేకుండా మహేష్ బాబు నటించిన ఏకైక సినిమా ఇదే..

Mahesh Babu : మేకప్ లేకుండా మహేష్ బాబు నటించిన ఏకైక సినిమా ఇదే..

mahesh-babu-acted-without-makeup-in-only-one-of-his-movies-that-is-nijam

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అమ్మాయిలకు విపరీతమైన క్రేజ్. ఎందుకంటే.. మహేష్ బాబు ఎంత ఏజ్ వస్తున్నా ఆయన అందానికి ఎక్కడ కొదవలేదు. సినిమా రంగం అంటేనే సినీ నటులు ఎప్పుడు మేకప్ వేసుకుంటూ ఉంటారు. ఇక హీరో, హీరోయిన్స్ అయితే మేకప్ లేకుండా బయటకు రారు. అలాగే మహేష్ బాబు ( Mahesh Babu acted without makeup ) కూడా ఎంత అందంగా ఉన్నప్పటికీ.. మేకప్ కచ్చితంగా వేసుకుంటాడు. మహేష్ బాబు తన చిన్నతనం నుంచే సినిమా రంగంలో అడుగుపెట్టి నటించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ గా ఎదిగాడు. మహేష్ బాబు ఇప్పటివరకు పాతిక సినిమాలు పైగా నటించాడు.

mahesh-babu-acted-without-makeup-in-only-one-of-his-movies-that-is-nijam

మహేష్ బాబు సినిమా అంటే అందరికీ ఒక ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే.. ఆయన ఎన్నుకున్న సినిమాలు కొంత విభిన్నంగా ఉంటాయి. మరీ రొటీన్ గా కాకుండా ఒక్కొక్కసారి కొత్త కొత్త దర్శకులకు, అలాగే కొత్త కథలకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాడు. మహేష్ బాబు ముఖ్యంగా తెలుగు దర్శకులకు, తెలుగు కథలకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తాడు. అదే ( Mahesh Babu acted without makeup ) క్రమంలో ఆయన ఈ పాతిక సినిమాలలో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ అలాగే ఫ్లాప్స్ కూడా సంతరించుకున్నారు. మహేష్ బాబు ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై మహేష్ బాబు అభిమానులందరికీ విపరీతమైన అంచనాలు ఆశలు కూడా ఉన్నాయి.

See also  Yatra 2 : యాత్ర 2 నుండి మహి వి రాఘవ ఔట్.. కారణం ఆ సైతాన్.

mahesh-babu-acted-without-makeup-in-only-one-of-his-movies-that-is-nijam

మహేష్ బాబు హీరోగా.. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రీకరించబడుతుంది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా పూజా హెగ్డే ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆమెను తప్పించి మీనాక్షి చౌదరిని తీసుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ( Mahesh Babu acted without makeup ) నిర్మించబడుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సర వేగంగానే జరుగుతుంది. ఈ సినిమాని 2024 పండగల్లో సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలని అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. అందుకే మహేష్ బాబు అభిమానులు అందరూ జనవరి 13 గురించి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ సినిమాపై విపరీతమైన అంచనాలు, ఆశ, ఆసక్తి ఉన్నాయి.

See also  Jailer: జైలర్ సినిమాలో రజనీకాంత్ మనవడి బ్యాక్ గౌండ్ తెలిస్తే స్టన్ అవుతారు..

mahesh-babu-acted-without-makeup-in-only-one-of-his-movies-that-is-nijam

గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమాని వరల్డ్ వైడ్ సినిమాగా చేయాలని.. హాలీవుడ్ లెవెల్లో సినిమా తీసి మహేష్ బాబుని గ్లోబల్ స్టార్ట్ చేయాలని రాజమౌళి కంకణం కట్టుకున్న సంగతి అందరికీ అర్థం అవుతుంది. ఇవన్నీ ఇలా ఉంటే మహేష్ బాబు కెరీర్లో మేకప్ లేకుండా చేసిన సినిమా ఒకటి ఉంది. అది చాలామందికి తెలుసో తెలియదో.. అసలు మేకప్ లేకుండా మహేష్ బాబు సినిమా నటించాడా అని కొందరు ఆశ్చర్యపోవచ్చు కూడా.. నిజమే నటించాడు. ఆ సినిమా ఏదో కాదు నిజం. తేజ దర్శకత్వంలో.. మహేష్ బాబు హీరోగా, రక్షిత హీరోయిన్ గా నటించిన సినిమా నిజం. ఈ సినిమాలో హీరో గోపీచంద్ విలన్ గా నటించాడు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు కానీ సినిమాకి అయితే మంచి పేరు వచ్చింది. నిజం కోసం పోరాడే ఒక యువకుడి కథ ఇది. ఈ సినిమాలో మేకప్ వేసుకోకుండా మహేష్ బాబు నటించాడు. సినిమాలో నేచురల్ గా కనిపించాలని మేకప్ జోలికి వెళ్ళకుండా మహేష్ బాబు నటించని ఏకైక సినిమా నిజం.