Actor Ravi Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోగా రానిస్తున్న రవితేజ ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒకానొక దశలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ ప్రస్తుతం ఈ స్థాయికి చేరాడు. మాస్ మహారాజ రవితేజ గా పిలవబడుతున్న రవితేజ అసలు పేరు ఏంటో తెలుసా.? భూపతి రాజు రవిశంకర్ రాజు ఆయన అసలు పేరు. ఇండస్ట్రీలో అడుగు పెట్టాక మంచి గుర్తింపు రావడంతో రవితేజగా మారి ఆ తర్వాత మాస్ మహారాజు బిరుదును కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ తనదైన శైలిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీద ఉంటూ దూసుకుపోతున్నాడు.
త్వరలో మన ముందుకు టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రంతో పలకరించడానికి మన ముందుకు రాబోతున్నాడు. అక్టోబర్ లో విడుదల అవుతున్న ఈ చిత్రానికి వంశీ కృష్ణ నాయుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇదే కాకుండా రవి తేజ ఈగల్ అనే మరొక చిత్రం కూడా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగా కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా మాస్ మహారాజా రవితేజ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నది. ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టి మన టాపిక్ విషయంలోకి అడుగుపెట్టినట్లయితే.. మొదట్లో రవితేజ ఎందరో డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు.
వాళ్లలో కృష్ణవంశీ, రాఘవేంద్రరావు, ఈవీవీ సత్యనారాయణ ఇలా ఎందరో స్టార్ డైరెక్టర్ల సరసన అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడన్న విషయం ప్రతి ఒక్క రవితేజ అభిమానికే గాక తెలుగు ప్రేక్షకులకు సైతం తెలుసు.. ఇక అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ చిత్రానికి కూడా రవితేజ భాగమయ్యాడట. మరి ఇంతకు రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఆ చిత్రం మరేదో కాదు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డెబ్యూ చిత్రమిది.. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించినటువంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వారు ఇవివి సత్యనారాయణ.
ఇక ఈ చిత్రంలో నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ హీరోయిన్ గా నటించినది. 1996 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం అయితే కైవసం చేసుకోలేదు కానీ ఓ మోస్తరులో విజయాన్ని మాత్రం అందుకుంది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారనే చెప్పాలి. ఇటు మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ అయినప్పటికీ అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అయితేనే ఎవరికి తెలియని విషయం ఏంటంటే.. ఈ చిత్రానికి రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలోనే రవితేజ పవన్ కళ్యాణ్ కి ప్రతి సన్నివేశాన్ని వివరంగా వివరించేవాడట.. ఇక ఆ తర్వాత రవితేజ (Actor Ravi Teja) చిన్న చిన్న అవకాశాలతో రాణిస్తూ స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత దర్శకత్వంపై మక్కువ ఎక్కువ ఉన్నప్పటికీ స్టార్ హీరోగా మారిన తర్వాత అటువైపు చూడలేదట.