Home Cinema Jagapathi Babu : జగపతి బాబు వలన నేను డబ్బు కోల్పోయి ఇలాంటి స్థితికి వచ్చానంటున్న...

Jagapathi Babu : జగపతి బాబు వలన నేను డబ్బు కోల్పోయి ఇలాంటి స్థితికి వచ్చానంటున్న స్టార్ హీరో..

hero-venu-comments-on-jagapathi-babu-about-his-money

Jagapathi Babu : హీరో వేణు తొట్టెంపూడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోగా మనసుకు హత్తుకుపోయే సినిమాలు తీశారు. చిరునవ్వుతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన తర్వాత మంచి మంచి మూవీస్ లో మెప్పించారు. స్వయంవరం, హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే ఇలా బ్లాక్ బస్టర్ హిట్లలో నటించి మెప్పించారు. ఆ తర్వాత ( Venu comments on Jagapathi Babu ) కొంత కాలం ఇండస్ట్రీకి దూరమైన ఆయన ఇప్పుడిప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు. హీరోగానే చేయాలని అనుకోవడం లేదని, పాత్రను బట్టి ఒకే చెప్తానని ఆయన గతంలో చెప్పారు.

hero-venu-comments-on-jagapathi-babu-about-his-money

 

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి ఆఫర్స్ వస్తున్నాయని ఆయన పేర్కొన్నాడు. ‘రామారావు ఆన్ డ్యూటీ’లో రవితేజకు సపోర్ట్ ఆర్టిస్ట్ గా చేశారు ఆయన. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మందిని వారి వారి ఇంట్రస్ట్ ను చూసి అవకాశాలు ఇచ్చారు. ఇటీవల ( Venu comments on Jagapathi Babu ) మరణించిన రాకేశ్ మాస్టర్ కు అవకాశం ఇచ్చింది వేణు తొట్టెంపూడి అని చాలా మందికి తెలియదు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన తన లైఫ్ లో జరిగిన ఒక ఇంట్రస్టింగ్ విషయాన్ని చెప్పుకచ్చారు. జగపతి బాబుతో తనకు మాటల్లేవని చెప్పిన ఆయన కారణం వివరించాడు.

See also  Janhvi kapoor: వామ్మో ఎన్టీఆర్ లో ఆ కోణాన్ని కనిపెట్టేసిన జాన్వీ కపూర్..

hero-venu-comments-on-jagapathi-babu-about-his-money

అప్పట్లో జగపతి బాబు తాను మంచి స్నేహితులం. సినిమాలలో చాలా డౌట్స్ ను షేర్ చేసుకునేవాళ్లం కలిసి తిరిగేవాళ్లం. అయితన ఆయన పూజీకత్తుతో తాను ఒకరికి రూ. 14 లక్షలు ఇచ్చాను. సదరు వ్యక్తి నాకు తిరిగి ఇవ్వలేదు. ఈ విషయాన్ని జగపతి బాబుకు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఫోన్ కూడా చేయలేదు. అప్పట్లో 14లక్షల రూపాయలంటే ( Venu comments on Jagapathi Babu ) తక్కువేమీ కాదు. అందునా నాకున్న పరిధికి మరింత ఎక్కువ. చాలా కాలం ఎదురుచూశాను సదరు వ్యక్తి డబ్బులు ఇవ్వలేదు. ఇక ఇవ్వడని అర్థమైంది. ఇటు డబ్బులు రావడం లేదు.. అటు అప్పటికి జగపతిబాబు ఫోన్ కూడా చేయడం లేదు.

See also  Manchu Manoj: మంచు మనోజ్ పెళ్లిపై నిజాలు బయటకు వచ్చేలా.. సాక్ష్యంగా మారిన మంచులక్ష్మీ ఫోటోలు వైరల్!

hero-venu-comments-on-jagapathi-babu-about-his-money

ఇక అప్పటి నుంచి ఆయనతో మాట్లాడడం బంద్ చేశానని చెప్పుకచ్చాడు వేణు. ఇద్దరూ కావాలనే చేశారా? అనుకున్నాను. కానీ జగపతిబాబు నాకు చాలా దగ్గరి ఫ్రెండ్ కాబట్టి అతని గురించి తెలిసు కాబట్టి ఊరుకున్నాను. కొంత కాలం తర్వాత తెలిసింది ఏంటంటే సదరు వ్యక్తిని జగపతి బాబు డబ్బు అడిగినా ఆయన స్పందించకపోయే వరకు తనకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఫోన్ చేయదని సన్నిహితుల ద్వారా తెలిసింది. అపార్థం చేసుకున్నాను అనుకొని బాధపడ్డాను. ఇప్పటికీ డబ్బు మాత్రం రాలేదు. అని తన లైఫ్ లో జగపతి బాబుతో కలిసి ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు వేణు.