Home Cinema Prabhas : ప్రభాస్ ఇంతమంది హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపాడా..? మంచి రసికుడే..

Prabhas : ప్రభాస్ ఇంతమంది హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపాడా..? మంచి రసికుడే..

Prabhas Affairs : కృష్ణం రాజు నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రభాస్ తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకొని ఆ తర్వాత వరుసగా హిట్టు మీద హిట్ కొట్టి అతి తక్కువ సమయం లోనే టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజి ని క్రియేట్ చేసుకున్నాడు. అలా అంచలంచలుగా ఎదుగుతూ వచ్చిన ప్రభాస్, బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా అవతరించాడు. ఈ సిరీస్ తర్వాత ప్రభాస్ ని మించిన ఇండియన్ సూపర్ స్టార్ ప్రస్తుతానికి లేదు అని రీసెంట్ గా విడుదలైన ఆయన చిత్రాలు నిరూపించాయి.

See also  BalaKrishna: నటుడు రాజేంద్రప్రసాద్ అంటే బాలకృష్ణ కు అంత కోపమా.? ఎందుకు.!!

prabhas-affairs

బాహుబలి సిరీస్ తర్వాత ఆయన చేసిన మూడు చిత్రాలు ఫ్లాప్ అయ్యినప్పటికీ ఆ మూడు సినిమాలు కమర్షియల్ గా తన తోటి స్టార్ హీరోల హిట్ సినిమాలకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టాయి, ఇక ప్రభాస్ సినిమాకి హిట్ టాక్ వస్తే ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో ఒక అంచనాకి రావొచ్చు. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో ఉన్న ప్రతీ స్టార్ సెలబ్రిటీ గురించి సోషల్ మీడియా లో ఎదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. అలా ప్రభాస్ గురించి కూడా గతం లో చాలా రూమర్స్ వచ్చాయి.

See also  Sri Reddy: నాగార్జునను అందుకే భయంకరమైన బూతులు తిట్టిన శ్రీరెడ్డి..

prabhas-kajal

ప్రభాస్ అందగాడు, ఆయనకి ఏ అమ్మాయి అయినా నిమిషాల్లో పడిపోతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు (Prabhas Affairs). అందుకే ఆయనకి హీరోయిన్స్ కూడా ఫిదా అయిపోయారు అని అంటుంటారు. అప్పట్లో ప్రభాస్ త్రిష తో కలిసి మూడు సినిమాలు చేసాడు. దీనితో వీళ్లిద్దరి మధ్య ఎదో నడుస్తుంది అంటూ అప్పట్లో ఒక రూమర్ మీడియా లో హల్చల్ చేసింది. ఆ తర్వాత అనుష్క తో కూడా ఆయన మూడు సినిమాలు చేసాడు, వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని , త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు నిన్న మొన్నటి వరకు ప్రచారం అయ్యాయి.

See also  Upasana: వామ్మో ఉపాసన గురించి ఇలాంటి వార్తలు వినాల్సి వస్తాదని అస్సలు ఊహించలేదు!

prabhas-anushka

అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని ఇద్దరూ కొట్టి పారేసారు. ఈ రెండు విషయాలను పక్కన పెడితే ప్రభాస్ – కాజల్ అగర్వాల్ ఇద్దరూ కూడా ప్రేమించుకున్నారు అనే విషయం వాస్తవం. గతం లో వీళ్లిద్దరు కలిసి డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలు చేసారు, కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యింది. అప్పటి నుండి కాజల్ అగర్వాల్ ప్రభాస్ తో మాట్లాడడం మానేసింది. ఇప్పుడు రీసెంట్ గా ప్రభాస్ ‘ఆదిపురుష్’ హీరోయిన్ కృతి సనన్ తో ప్రేమలో ఉన్నాడని తెలుస్తుంది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.