Jawan Trailer Telegu review : షారుక్ ఖాన్ జవాన్ సినిమా ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ లాస్ట్ సినిమా పఠాన్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్ అయ్యి.. విపరీతమైన కలెక్షన్స్ ని కురిపించింది. అలాంటి సినిమా తర్వాత షారుక్ ఖాన్ సినిమా మీద యావత్ భారత దేశంలో సినీ అభిమానులందరికీ ( Jawan Trailer Telegu review ) భారీ అంచనాలే ఉంటాయి. ఆ తీరుగానే ఈరోజు రిలీజ్ అయిన జవాన్ ట్రైలర్ ఏమీ తీసిపోలేదు. ఈ సినిమా ట్రైలర్ మంచి ఆదరణ పొందింది. ఇందులో షారుఖ్ ఖాన్ యాక్షన్ చాలా బాగుందని అందరూ అనుకున్నారు. యాక్షన్ డ్రామాగా తీస్తున్న ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొనే లాంటి స్టార్స్ కూడా షారుక్ ఖాన్ తో పాటు నటిస్తున్నారు.
ఇక ట్రైలర్ చూస్తే ఈ సినిమా కథ ఒకరకంగా అర్థమవుతుంది. షారుక్ ఖాన్ తల్లికి చాలా అన్యాయం జరుగుతుందని.. షారుఖ్ ఖాన్ జైల్లోనే పుడతాడని.. జైల్లో పుట్టి పెరిగిన షారుఖ్ ఖాన్ తన తల్లికి జరిగిన అన్యాయం ఎదురుకోవడం కోసం పోరాడుతాడని.. ఈ క్రమంలో పోలీసులు వైపు నుంచి నయనతార.. షారుఖ్ ఖాన్ వెనుక పడుతుందని.. అలాగే ( Jawan Trailer Telegu review ) విజయ్ సేతుపతి కూడా షారుఖాన్ పట్టుకునేందుకే చూస్తాడని ఇలా ఈ సినిమా ట్రైలర్ను బట్టి నెటిజనులు కథని అల్లుకున్నారు. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది అన్న సంగతి అర్థమవుతుంది. ఇక ట్రైలర్ మొత్తం ఎలివేషన్స్ సీన్స్ తో బాగా నింపారు. అయితే ఈ జవాన్ ట్రైలర్ చూసి నెటిజనులు ఏమంటున్నారంటే..
జవాన్ ట్రైలర్ మొత్తంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. పిల్లాడిని ఒక చేత్తో ఇలా పైకెత్తి చూపించడం అనేది.. అది చూడగానే ఎవరికైనా కూడా బాహుబలి సినిమా గుర్తుకొస్తుంది. అలాగే షారుఖ్ ఖాన్ ముఖానికి సగం మాస్క్ ( Jawan Trailer Telegu review ) పెట్టి ఉంచడం అనేది అపరిచితుడు సినిమాలో విక్రమ్ గుర్తుకొస్తున్నాడు. అలాగే షారుక్ ఖాన్ చివర్లో గుండెతో కనిపించని శీను శివాజీలో రజనీకాంత్ గుర్తుకు వస్తున్నాడు. అలాగే మూన్ నైట్ వెబ్ సిరీస్ నుంచి తీసుకున్న పాయింట్ల అనిపిస్తుంది షారుక్ ఖాన్ మొత్తం క్లాత్ తో కట్టివేయడం.. ఇలా ఇంత భారీ బడ్జెట్ తో.. అంత పెద్ద స్టార్ షారుక్ ఖాన్ తో.. ఇలా ఏవేవో సినిమాల్లో పాయింట్స్ తీసుకొని వాటి రూపంలో కనిపించేలాగా సినిమా తీయడం ఏమిటో అని కొందరికి ఆశ్చర్యంగా ఉంది.
అయితే ఇవన్నీ కేవలం ట్రైలర్ చూడగానే.. ఇందులో ఈ పాయింట్స్ ఉన్నాయి, ఇలా కనిపిస్తున్నాయి అని ఎక్కువ మంది చెప్పుకోవడం.. ఎక్కువ మంది దాన్ని చూసి కాన్సన్ట్రేషన్ పెట్టడం సినిమాకి భారీ ప్రమోషన్ గా ఉంటుందని అనుకుని అలాంటి పాయింట్స్ ఏమైనా పెట్టి ఉంటే పర్వాలేదు కానీ.. సినిమా చూస్తుంటే ఆ సినిమాలే గుర్తొచ్చేలాగా.. అలాంటి సీన్లే పెట్టేసినట్టు సినిమా తీస్తే మాత్రం చాలా కష్టమే అని నిటిజన్ అంటున్నారు. భారీ భారీ బడ్జెట్లో సినిమాలు తీసేటప్పుడు ఎక్కువ సమయాన్ని ఫస్ట్ మూల కథ మీద పెట్టుకుని.. కథని జాగ్రత్తగా రాసుకొని.. బెస్ట్ రిజల్ట్ వచ్చేలాగా దానిమీద ఎక్కువ పని చేస్తే బాగుంటుందని మరికొందరు నెటిజనులు అనుకుంటున్నారు. ఏదైనా జవాన్ సినిమా రిలీజ్ అయ్యి.. అది ఎలా ఉంటుందో తెలిసే వరకు అన్ని ఊహగానాలే..