JR NTR: తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు ప్రేక్షకులందరీ మనసులు గెలుచుకొని మహానటుడిగా పేరు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి విశ్వ విఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు.. ఇక ఆయన తర్వాత ఆయన తర్వాతి తరం వారు ఆ ఇంటి వారసులు చాలామంది సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు. అలా ఆ కుటుంబానికి చెందిన మూడు తరాల వారు ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్నారు. అందులో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లో స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అయితే పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరో అయిపోయిన సంగతి మనందరం కి తెలిసిన విషయమే.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ శివ కొరటాల దర్శకత్వంలో దేవర అనే చిత్రంలో నటిస్తున్నారు. (Junior NTR Name)
ఇక ఈ చిత్రంలో ఆయనకు జోడిగా నటిస్తున్నది అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్. ఇక ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ ఇప్పటికే లీకై చాలా వైరల్ గా మారుతున్న విషయం నిత్యం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ గురించి మరొక ఆసక్తికరమైన వార్త కూడా నెట్టింట హల్చల్ అవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ కొడుకు నందమూరి హరికృష్ణ గతంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ఆయన కూడా రాజకీయ నాయకుడిగా తండ్రికి తగ్గ తనయుడు గారు తెచ్చుకున్నాడు హరికృష్ణ.. అయితే తన చిన్న కొడుకుకి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టడానికి గల కారణాన్ని గతంలో హరికృష్ణ నాన్నకు ప్రేమతో చిత్రం యొక్క ఆడియో లాంచ్ సందర్భంగా ప్రస్తావించాడు.
ఇక ఆ ఫంక్షన్ లో భాగంగా ఆరోజు ఆయన మాట్లాడుతూ మా నాన్నగారు మా ఏడుగురు అన్నదమ్ములకి కృష్ణ అనే పేరు కలిసొచ్చేలా పెట్టారు. అలాగే నా నలుగురు అక్కచెల్లెళ్లకు కూడా ఈశ్వరి అని వచ్చేలా కలిపి పేరు పెట్టాడు. ఆయనకు దైవభక్తి అంటే చాలా మక్కువ ఎక్కువగా మెండుగా ఉండేది. అందువల్లే ఆయన కొడుకులందరికీ భగవంతుడు పేరు కలిసి వచ్చేలా పెట్టాడు. అయితే నా పిల్లలకు పేరు పెట్టే బాధ్యత కూడా నేను నాన్నగారికే అప్పగించాను అని అన్నారు. అలా పిల్లలు పుట్టినప్పుడు పేరు పెట్టవలసిందిగా నానా దగ్గరికి వెళ్ళినప్పుడు.. నాన్నగారిని నా పిల్లలకు మీరే పేరు పెట్టాలని అడిగాను. దీంతో ఇద్దరు పిల్లలకి జానకిరామ్, కళ్యాణ్ రామ్ అనే పేరు పెట్టాడు.
కానీ ఎన్టీఆర్ కు తారక రామ్ అని నేను పేరు పెట్టానని ఆ సినిమా ఆడియో లాంచ్ సందర్భంగా హరికృష్ణ వెల్లడించారు. అయితే ఓ రోజు నాన్నగారు నన్ను పిలిచి అవున్రా నీ చిన్న కొడుకు ఎక్కడరా చూడక చాలా రోజులైంది వాడిని చూడాలనిపిస్తుంది ఒకసారి తీసుకొని రా అని అడగ్గా.. వెంటనే నేను నాన్నగారి దగ్గరికి తారక్ ను తీసుకొని వెళ్ళాను. అప్పుడు నాన్నగారు మీ పేరు ఏంట్రా అని అడగ్గా నేను వెంటనే నా పేరు తారక్ తాతగారు అని నాన్నగారే నాకు ఆ పేరు పెట్టాడని తెలిపాడు. వెంటనే లేదురా నువ్వు అచ్చం నా రూపం నా పేరే నీకు ఉండాలి అంటూ ఈ రోజు నుంచి నీ పేరు తారక్ కాదు నందమూరి తారక రామారావు అనిగా అని తారక్ పేరు మార్చారు, ఇక అప్పటినుండే తారక్ కు ఎన్టీఆర్ (Junior NTR Name) అనే పేరుతో పేరు పెట్టి పిలవడం మొదలయ్యింది.