Samantha Ruth Prabhu: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తన పేరుని ఎంతో పాపులారిటీ చేసుకుని ఇక్కడ పదిలం చేసుకుంది సమంత. అందరూ స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు సూపర్ డూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇటీవలే సమంత గురించి సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే సమంత సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్తున్నాను అనే విషయం పి ఆర్ టీం తో చెప్పించిందని అందరికీ తెలిసింది. అయితే సమంత కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే అక్కినేని నాగచైతన్య ను పెళ్లి చేసుకొని ఓ తప్పు చేసింది.
ఇక వివాహం అనంతరం సినిమా ఇండస్ట్రీలో కొన్ని పాత్రలకు మాత్రమే పరిమితం అయ్యి మరొక తప్పు చేసింది. ఇక ఆ తర్వాత విడాకులు తీసుకుని మళ్లీ బోల్డ్ గా కనిపిస్తూ రెచ్చిపోతూ కుర్రకారులను సైతం నిద్ర పట్టకుండా చేసేలా కనిపిస్తూ అలాంటి పాత్రలు ఎంపిక చేసుకుని మళ్లీ తప్పు చేసింది. ఏదో అలా ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా భగవంతుడు మాత్రం ఆమె వైపే ఉండి ప్రాణాంతకమైన వ్యాధి వచ్చినా కూడా ఆ వ్యాధి నుంచి ఆమెను తప్పించి ఆ తర్వాత మళ్లీ కెరియర్ ఒకప్పటిలా ఊపందుకోవడానికి సహాయం చేశాడు.
అయితే ఈసారి మళ్లీ సమంత (Samantha Ruth Prabhu) ఇలా చేసిన తప్పుకు ఆ భగవంతుడు కూడా ఆమెను అస్సలు క్షమించడని అంటున్నారు సమంత అభిమానులు.. మనందరికీ తెలిసిందే.. విడాకుల తర్వాత సమంత టైం అసలు మంచిగా లేదు. ఇక ఈ క్రమంలోనే ఆమె నటించిన చిత్రాలు ప్లాప్ అవుతున్నాయి. దాంతో సమంత సైతం అప్సెట్ అయ్యి ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పేసింది. దాంతో ఈ విషయం విన్న సమంతా అభిమానులు కాక తెలుగు ప్రేక్షకులకు సైతం ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు అస్సలు మింగుడు పడడం లేదు.
మళ్లీ సమంత ఇలాంటి తప్పు అప్పుడు చేసినట్టే మరొక పెద్ద తప్పు చేస్తుందని అభిమానులు అంటున్నారు. సినిమాలు అన్న తర్వాత హిట్స్ ఫ్లాఫ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. హిట్స్ ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. హిట్స్ ఫ్లాప్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అంత మాత్రం దానికి ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావు.? అసలు ఈ నిర్ణయం తీసుకోవాలా అని అంటున్నారు.. నువ్వు ఇచ్చిన ఈ గ్యాప్ లో ఒకవేళ వేరే కొత్త హీరోయిన్ ఎవరన్నా చిల్లరేగిపోతే ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి? దేవుడు కూడా నిన్ను కాపాడు లేడంటూ చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో వార్త మరొకసారి ఈ విషయం వైరల్ గా మారింది.