Home Cinema Kalyan Ram – Devil : తనలో ఉన్న ఆ లక్షణాలను బయట పెట్టిన కళ్యాణ్...

Kalyan Ram – Devil : తనలో ఉన్న ఆ లక్షణాలను బయట పెట్టిన కళ్యాణ్ రామ్..

kalyan-ram-movie-devil-the-british-secret-agent-glimpse-review

Kalyan Ram – Devil : నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పటికప్పుడు తన సినీ కెరీర్లో సక్సెస్ కోసం సాధించడానికి పరుగులు తీస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ నిరుత్సా పడకుండా సక్సెస్ వచ్చేవరకు పోరాడే వ్యక్తిత్వం ఉన్న మనిషి కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ( Kalyan Ram movie Devil ) నందమూరి అభిమానులకు మంచి అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా ప్రొడక్షన్ లెవెల్స్ గాని, కథను ఎన్నుకున్న విధానం గాని అందరికీ ఆసక్తినే కలిగిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ నెక్స్ట్ సినిమా డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ఈ సినిమాలో కళ్యాణ్రామ్ నటన ఎలా ఉండబోతుంది? సినిమా ఎలా ఉండబోతుంది అనే దానిపై అందరికీ ఆసక్తిగానే ఉంది.

kalyan-ram-movie-devil-the-british-secret-agent-glimpse-review

డెవిల్ అనే సినిమా బ్రిటిష్ కాలంలో జరిగిన సన్నివేశం ఆధారంగా ఈ సినిమా కథను రాసుకోవడం జరిగింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా పని చేస్తాడ. ఈ సినిమా కథని శ్రీకాంత్ విస్సా రాయగా నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, సంయుక్త మిన్నన్ ( Kalyan Ram movie Devil ) హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ బ్యానర్ పై నిర్మాణం జరుగుతున్నది. డెవిల్ సినిమా ఆగస్టు 27 2023లో సినిమా హాల్స్ లో రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈరోజు నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు. అందులో మొదటగా ఒక షిప్, ఆ తర్వాత బ్రిటిష్ వారి ఆఫీస్ చూపించి ఆ తర్వాత ఒక ఆడ మనిషిని కట్టేసి బ్రిటిష్ వారు ఆరా తీయడం..

See also  100th Birthday Of ANR: ఏఎన్ఆర్ కి మాత్రమే దక్కిన రికార్డ్స్ తో పాటు ఆయన జీవితంలో ఈ పచ్చి నిజాలు మీకు తెలుసా?

kalyan-ram-movie-devil-the-british-secret-agent-glimpse-review

అలాగే ఒక వ్యక్తిని తిరగేసి కట్టి హింసించడం చూపిస్తారు. ఆ తర్వాత ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ అని ఒక బ్రిటిషర్ చెప్పగా కళ్యాణ్ రామ్ కనిపిస్తాడు. మీరు చెప్పినదానికి చేసిన దానికి ఆలోచించడానికి సంబంధం ఉండదు ఏంటి సార్ అని కళ్యాణ్ రామ్ ని ఒకతను అడగగా.. అప్పుడు కళ్యాణ్ రామ్ మనసులో ఉన్న భావన ముఖంలో ( Kalyan Ram movie Devil ) తెలియకూడదని.. మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదని.. ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం అని కళ్యాణ్ రామ్ చెపుతాడు. ఈ సినిమా భారీ బడ్జెట్లోనే తీస్తున్నారని అర్థమవుతుంది. దీనికోసం కళ్యాణ్ రామ్ విపరీతంగా కష్టపడుతున్నాడని కూడా తెలుస్తుంది. ఇక ఈ క్యారెక్టర్ కి ఒక గూఢచారిగా కళ్యాణ్ రామ్ ఎంతవరకు సూట్ అవుతాడు అనేది సినిమా చూస్తే కానీ అర్థం కాదు.

See also  Anasuya: అర్ధరాత్రి మొదలుపెడితే తెల్లవారే వరకు అదే పని. చాలా టైడ్ అయిపోయానంటున్న అనసూయ.

kalyan-ram-movie-devil-the-british-secret-agent-glimpse-review

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తుంది. సంయుక్త మినన్ చక్కటి చీర కట్టుకొని అందంగా కనిపించింది. సంయుక్త మీనన్.. కళ్యాణ్ రామ్ సరసన ఎలా ఉంటుంది.. ఎంతవరకు వీళ్ళిద్దరికీ సూట్ అవుతుందనేది చూడాలి. ఇప్పటికే భారీ బడ్జెట్లో, భారీ అంచనాలతో వస్తున్న సినిమాలు చాలా వరకు డిజాస్టర్ గా మిగులుతున్నాయి. ఈ ఏడాది చిన్న చిన్న బడ్జెట్ తో అంచనాల లేని సినిమాలు మంచి మంచి రిజల్ట్ ఇస్తున్నాయి కానీ.. మరి కళ్యాణ్ రామ్ సినిమా డెవిల్ భారీ బడ్జెట్ గానే కనిపిస్తుంది. మరి ఈ సినిమాపై అంచనాలు వద్దనుకున్నా కుదరదు. మంచి అంచనాలతోనే ఎదురు చూస్తున్నారు. మరి ఇది ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాల్సిందే..