Home Cinema Shaitan: షైతాన్ వెబ్ సిరీస్ లో రెచ్చి పోయిన ఈ నటి ఎవరు..

Shaitan: షైతాన్ వెబ్ సిరీస్ లో రెచ్చి పోయిన ఈ నటి ఎవరు..

Shaitan Web Series: యాత్ర వంటి సూపర్ హిట్ సినిమాకి దర్శకత్వం వహించిన మహి వి రాఘవ్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘షైతాన్’. రీసెంట్ గానే డిస్నీ + హాట్ స్టార్ లో విడుదలైన ఈ సినిమాని మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. కానీ ఈ సినిమాని డైరెక్టర్ మహి వి రాఘవ్ ఎంత బోల్డ్ గా తెరకెక్కించాడంటే, కాస్త సున్నితమనస్తత్వం ఉన్నవాళ్లు ఈ చిత్రాన్ని చూస్తే ఆరోజు అన్నం కూడా తినలేరు. విచ్చలవిడిగా నరుక్కోవడం, దానికి తోడు చెవులు చిల్లు పడే రేంజ్ బూతులు, మితిమీరిన సీన్స్, ఇలా అన్నీ ఎక్కువే ఈ చిత్రంలో.

See also  Tamannaah : తమన్న కి ముందే అతనితో పెళ్లయిందని.. పైగా అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని..

shaitan-web-series-actress-shelly

వయోలెన్స్ సినిమాలను నచ్చేవాళ్లకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది కానీ, మామూలు మూవీ లవర్స్ కి అయితే ఈ సినిమా కడుపు తిప్పేలాగా చేస్తుంది. ఇకపోతే ఈ చిత్రం లో మెయిన్ లీడ్ గా నటించిన బాలి తల్లి సావిత్రి ని మాత్రం అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ట్రైలర్ లో చూసినప్పుడు మాత్రం చాలా పద్దతిగా కనిపించింది కానీ, సినిమాలో మాత్రం ఒక పోలీస్ ఆఫీసర్ కి ఉంపుడుగత్తెగా కనిపించి రెండు మూడు ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా నటించి చెలరేగిపోయింది. ఇంత బోల్డ్ గా నటించిన ఈమె ఎవరు అని ఇంటర్నెట్ లో నెటిజెన్స్ పరిశోధించగా, ఈమె పేరు షెల్లే నబుకుమార్ అని తెలిసింది.

See also  Allu Arjun Fans: పుష్ప 2 కోసం బన్నీ ఫ్యాన్స్ రష్మిక ని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఎక్కేస్తున్నారు గా.. అసలు కథ ఇదా..

shaitan-web-series

ఈమె మలయాళం లోని టీవీ సీరియల్స్ లో మంచి పాపులర్ నటి. కేరళలోని పాపులర్ న్యూ పేపర్ లో నటీనటులు కావలెను అని వచ్చిన ఒక ప్రకటన ని చూసి, షెల్లీ స్నేహితురాలు ఆమెకి ఈ విషయాన్నీ చెప్పిందట. ఇక ఆ తర్వాత వెంటనే ఆడిషన్స్ కి వెళ్లి సెలెక్ట్ అయ్యింది. అయితే ఫైనాన్స్ సమస్య కారణంగా ఆ చిత్రం విడుదలకు నోచుకోలేదు, ఆ సమయం లోనే ఆమెకి పురుషోత్తం అనే సీరియల్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు. ఆయన దర్శకత్వం లో వచ్చిన సులభం అనే మలయాళం సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ ని దక్కించుకున్న షెల్లీ, ఆ సీరియల్ తర్వాత మళ్ళీ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

See also  Pawan Kalyan : చనిపోవలసిన పవన్ కళ్యాణ్ ని ఎవరు కాపాడారో తెలిస్తే.. అస్సలు నమ్మలేరు!

shelly-kishore

వరుసగా టీవీ సీరియల్స్ లో నటించి కేరళ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ఇప్పుడు షైతాన్ వెబ్ సిరీస్(Shaitan Web Series) ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితం అవ్వడం తో షెల్లీ కి టాలీవుడ్ లో కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. షైతాన్ వంటి వెబ్ సిరీస్ లు బాగా క్లిక్ అవ్వటంతో, కుర్రాళ్ళు ఇలాంటి సిరీస్ లను బాగా ప్రోత్సహించటంతో మేకర్స్ కూడా ఇలాంటి సినిమాలు తీసి కాష్ చేసుకోవటానికి చూస్తున్నారు.