Yatra 2 : దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రపై యాత్ర అనే సినిమా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో ఆయన పాదయాత్ర గురించి, పాదయాత్రలో ఆయన చూసిన ఎన్నో విషయాలను గురించి.. నేను విన్నాను నేను ఉన్నాను అనే నినాదంతో.. ఆయన ఎలా ఎన్నికయి సీఎం అయ్యారో ప్రమాణ స్వీకారం ( Yatra 2 all shows free ) వరకు సినిమా తీసిన సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. భారీ అంచనా లేకుండా రిలీజ్ అయిన యాత్ర సినిమా విపరీతంగా ప్రజాధరణ పొందింది. ఆ సినిమాలో మమ్ముట్టి నటన నిజంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో ఇమిడిపోయి.. అందరికీ ఒక్కసారిగా కళ్ళంట నీళ్ల రప్పించిన గొప్ప నటుడిగా నటించి.. సినిమాని నిలబెట్టారు.
అలాగే ఇప్పుడు యాత్ర 2 సినిమా తీయబోతున్నారన్న సంగతి మనకు ఎప్పటినుంచో తెలుస్తూనే ఉంది. అయితే ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనేది తెలియలేదు. వారం రోజుల క్రితమే టైటిల్ రోల్ లో తమిళ హీరో జీవా చేయబోతున్నట్టు లీక్ అయింది. ఇక రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర ఎక్కడైనా కనిపిస్తే.. దానికి ( Yatra 2 all shows free ) మమ్ముట్టితోనే చేయిస్తారని.. జగన్ గారి పాత్రని హీరో జీవా చేస్తాడని అంటున్నారు. మరి ఇప్పుడు హీరో జీవా.. జగన్ గారి పాత్రలో అంతగా ఇముడుతాడా?ఎలా నటిస్తాడు?అందరిని ఎలా మెప్పిస్తాడు? అనేది చూడాలి. అలాగే మరోపక్క యాత్ర 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదానిపై విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి.
యాత్ర 2 సినిమాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం గురించి చూపిస్తారని.. అలాగే వైసిపి ఎలా మొదలైంది? రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు.. వైఎస్ఆర్సిపి ని ఎలా స్థాపించారు.. అందులో ఆయన పడ్డ కష్టాలు.. ఆయన పాదయాత్ర.. ప్రమాణస్వీకారం ( Yatra 2 all shows free ) వరకు సినిమాను తీసుకొచ్చి.. అక్కడితో యాత్ర 3 కి వదులుతారు అని కొందరు అనుకుంటున్నారు. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ డేట్ పై అందరికీ ఆసక్తిగా ఉంది. కారణమేమిటంటే.. ఎలక్షన్స్ దగ్గర పడిపోతున్నాయి. ఈ టైంలో ఈ సినిమా రిజల్ట్ చాలా గట్టిగానే ఎలక్షన్ పై ఉంటుందని చాలా మంది అంచనా..
ఇటీవల రిలీజ్ అవుతున్న వార్తలను బట్టి చూస్తే.. యాత్ర 2 సినిమా 2024 ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందని అంటున్నారు. 2024 ఫిబ్రవరిలో రిలీజ్ అంటే ఎలక్షన్స్ ముందు.. ఒకవేళ ఈ సినిమా ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయితే.. ఈ సినిమాని ఎంతమంది చూస్తారు ఎలా ఆదరిస్తారు అనే దాని గురించి పెద్దగా అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఆ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు వాళ్లందరూ కూడా.. వాళ్ల ప్రాంతంలో ఆ సినిమాని థియేటర్లో వేసుకొని.. వాళ్ళ ఖర్చుతో ఫ్రీగా అందరికీ చూపించే అవకాశం కూడా ఉంది. ఈ రకంగా సినిమాని ఫ్రీగా కూడా వైసిపి నాయకులు ఎవరు ఏరియాలో వాళ్ళు వేసుకొని చూపించుకోవచ్చు. కానీ ఒకవేళ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ఎలక్షన్ కోడ్ గాని వచ్చేస్తే.. ఈ సినిమాని ఫ్రీగా చూపించలేరు. అందుకని ప్రేక్షకులకు ఈ సినిమా ఫ్రీగా చూసే అవకాశం ఉంటే.. ఎలక్షన్ కోడ్ రాకముందే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని కొందరు అంచనాలను వేసుకుంటున్నారు.