Home Cinema Prabhas-Chiranjeevi: చిరంజీవి ప్రభాస్ ని గేట్ బయటే నిల్చోబెట్టిన వ్యక్తి అతనేనా..

Prabhas-Chiranjeevi: చిరంజీవి ప్రభాస్ ని గేట్ బయటే నిల్చోబెట్టిన వ్యక్తి అతనేనా..

Prabhas Chiranjeevi Jagan: తెలుగు చలన చిత్ర పరిశ్రమ టికెట్ రేట్స్ విషయం లో గడ్డు కాలం ని ఎదురుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వంద కోట్ల రూపాయిలు చెయ్యాల్సిన సినిమాలు, కేవలం ప్రభుత్వం జారీ చేసిన సరికొత్త జీవో రేట్స్ వల్ల కేవలం 70 కోట్ల రూపాయిల వద్దే ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే సగటున 30 కోట్ల రూపాయిల నష్టం అన్నమాట. ‘అఖండ’, ‘పుష్ప’ మరియు ‘భీమ్లానాయక్’ వంటి సినిమాలు ఈ టికెట్ రేట్స్ వల్ల దారుణంగా దెబ్బతిన్నాయి. ఇక రాబొయ్యే రోజుల్లో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి.

prabhas-chiranjeevi-waited-outside-jagan-office

ఇదే రేంజ్ టికెట్ రేట్స్ కొనసాగితే ఇండస్ట్రీ మనుగడ సాగడం కష్టం అని కొంత మంది సినీ ప్రముఖులు గొంతెత్తి మాట్లాడారు. ఇక మెగాస్టార్ చిరంజీవి వంటి వారు సమస్య పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. అందులో భాగం గా ఆయన స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ని కలిసి ఈ విషయమై ఒకసారి ఇంటికి వెళ్లిమరీ ఏకాంతంగా చర్చించాడు. ఇండస్ట్రీ ఈ టికెట్ రేట్స్ తో మనుగడ సాగించడం కష్టం అని, దయచేసి జీవో లో సవరణలు చేసి సరికొత్త రేట్స్ ని ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. చిరంజీవి రిక్వెస్ట్ ని పరిగణించిన జగన్ కొన్ని ఆంక్షల మీద టికెట్ రేట్స్ పెంచుకునే వెసులుబాటు కలిపించాడు(Prabhas Chiranjeevi Jagan).

See also  Nagarjuna : చివరికి కొడుకుల కోసం అమల ని కూడా అడక్కుండా ఆ వ్యక్తికి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున!

prabhas-chiranjeevi

ఇక జీవో జారీ చేసే రోజు టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ సీఎం జగన్ ని కలవాల్సిందిగా పిలుపు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబెల్ స్టార్ ప్రభాస్ వంటి వారు వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అయితే వీళ్ళు సీఎం ఆఫీస్ కి రాగానే , సిబ్బంది వారి కార్లను గేట్ బయటే ఆపేశారట. పార్కింగ్ కి లోపల అనుమతి లేదని, దయచేసి కార్ దిగి నడుచుకుంటూ రావాలని అన్నారట. దీనితో చిరంజీవి , మహేష్ , ప్రభాస్ , రాజమౌళి వంటి వారు ఇబ్బందిగానే ఫీల్ అయినా ఇండస్ట్రీ కోసం తల వంచుకున్నారు.

See also  Allu Arjun: ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ జాతకంలో దోషమా.! ఒకవేళ అదే నిజమైతే ఏం జరుగుతుందో తెలుసా.?

jagan-mohan-reddy

అనంతరం ముఖ్య మంత్రితో మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి చేతులు జోడించి దండాలు పెట్టడం వంటివి అభిమానులకు చాలా బాధకలిగించింది. ఇప్పుడు వారిని గేట్ బయటే ఆపేశారని విషయం తెలుసుకొని మరింత బాధ పడుతున్నారు. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు, సీనియర్ నటుడు మురళి మోహన్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రభాస్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా సాలార్ రిలీజ్ కోసం వేచి చూస్తున్నాడు. మొన్న రిలీజ్ అయిన ఆదిపురుష్ బిస్కెట్ అవ్వటంతో అభిమానులు అన్ని ఆశలు సలార్ పైనే పెట్టుకున్నారు.