Malli Pelli : నరేష్ హీరోగా, పవిత్ర లోకేష్ హీరోయిన్గా, ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో, నరేష్ నిర్మాతగా రూపొందిన చిత్రం మళ్ళీ పెళ్లి. ఈ సినిమా చూసిన వాళ్ళు తక్కువ ఉన్నప్పటికీ.. దీని గురించి విన్న వాళ్ళు, మాట్లాడుకున్న ( Malli Pelli movie is in the top ) వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. మొదట్లో ఈ సినిమాపై ఎవరికి పెద్దగా అంచనాల్లేవు గాని.. తర్వాత ఈ సినిమా గురించి కంటే ముందు.. నరేష్ పర్సనల్ లైఫ్ మీద అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం వలన.. ఈ వార్తపై అనేక ట్రెండింగ్ న్యూస్ రావడం వలన.. ఈ సినిమా హిట్ కావచ్చు అని ఒక అంచనా రావడం అనేది జరిగింది. అయితే నరేష్,పవిత్ర లోకేష్ ల నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీయడం జరిగింది.
నరేష్ కు గతంలో మూడు పెళ్లిళ్లు జరిగి విడిపోవడం కూడా జరిగింది. అలాగే పవిత్ర లోకేష్ కూడా ముందుగా పెళ్ళయ్యి.. ఆమెకు కూడా ఇద్దరు పిల్లలు ఉండడం.. ఆ తర్వాత మొదటి భర్తతో కొన్ని సమస్యలు రావడం వలన ఆవిడి ( Malli Pelli movie is in the top ) విడిపోవడం జరిగింది. ఇది ఇలా ఉంటే అసలు నరేష్ పవిత్ర లోకేష్ లు ఎలా దగ్గరయ్యారు? వాళ్లు బంధం ఎలా స్టార్ట్ అయింది అనే దానితో సినిమాని తీసుకున్నాడు దర్శకుడు. అయితే ఈ సినిమా చాలా బాగా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమాని నరేష్ తన జీవితంలో జరిగిన సంఘటనలో ఏ తప్పు లేదని.. తన తీసుకున్న నిర్ణయం ఎలా తీసుకున్నాడో, ఎందుకు అలా జరిగిందో ప్రజలను ఒప్పించుకునేందుకు తీసుకున్న సినిమా అని క్లియర్గా అర్థమైంది.
అయితే ఆ నిర్ణయాన్ని, అతని ఆలోచనలని ప్రజలు ఒప్పుకున్నట్టుగా అనిపించలేదు. అందుకే ఈ సినిమాపై ఎవరూ కూడా ఆదరణ చూపించకపోవడానికి కారణం. దాన్ని అంగీకరించడానికి జనం సిద్ధంగా లేరని ఉండొచ్చు లేదా అదే కథని వాళ్లే నటించడం నచ్చి ఉండకపోవచ్చు. ఏదైనా మళ్లీ పెళ్లి సినిమా కాన్సెప్ట్ తో నరేష్ నిర్మాతగా చాలా ( Malli Pelli movie is in the top ) భారీ నష్టాన్ని పొందాడన్న విషయం అయితే కచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా రావడానికి ఒక 6 నెలల ముందు నుంచి కూడా సోషల్ మీడియాలో ప్రతి వీడియోని చిన్నచిన్న సీన్స్ నే కూడా చాలా భారీగా ప్రమోట్ చేసుకోవడం జరిగింది. అయితే దీనిని నరేష్ చాలా తెలివిగా ప్రమోట్ చేయడం అంటే డబ్బు ఖర్చు పెట్టి చేయకుండా ఆల్రెడీ వాళ్ళ అడ్జస్టింగ్ దాంట్లో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా అప్పటికే వాళ్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారారు.
ఆ ట్రెండింగ్ ని నరేష్ తన సినిమా పబ్లిసిటీ కోసం చాలా ఈజీగా వాడుకున్నాడు. ఒక పెళ్లి వీడియో రిలీజ్ చేయడంతో నిజంగా వాళ్లకి పెళ్లి జరిగిందేమో అని అనేక వార్తలు వచ్చి షేర్లు కామెంట్లు హల్చల్ చేయడం జరిగింది. రెండు మూడు రోజుల తర్వాత అది సినిమా షూటింగ్ అనే విషయాన్ని బయటపెట్టారు. ఇలా తెలివిగా సినిమాని ఎంత ప్రమోట్ చేసుకున్నప్పటికీ.. డిజాస్టర్ కాక తప్పలేదు. అయితే కొన్ని సినిమాలు బయట ఎంత డిజాస్టర్ అయినా కూడా.. ఓటీటీలో మాత్రం కొంత మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే.. థియేటర్ కి వెళ్లి.. ఎలాగో సినిమా చూడలేదు కాబట్టి.. ఓటీటీ లో చూద్దామని సగటు మనిషి అనుకోవడంలో చాలా సహజమైన గుణం. అదే రీతిలో మళ్లీ పెళ్లి సినిమా ఇప్పుడు ఆహా యాప్ లో ట్రెండింగ్లో సెకండ్ పొజిషన్లో ఉండడం సంచలనంగా మారింది. మళ్లీ పెళ్లి సినిమాని ఆహా యాప్లో ఎంతమంది చూసి దాన్ని ట్రెండింగ్ లో సెకండ్ పొజిషన్లో ఉంచడం అంటే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏదేమైనా నరేష్ కోరుకున్నట్టు అతని కంటెంట్ అయితే.. చాలా మందికి ఓటీటీ ద్వారా అయినా రీచ్ అవుతుందనే అనుకోవాలి.