Home Cinema Priyamani: నేను ముస్లిం ను పెళ్ళి చేసుకుని చాలా తప్పు చేసానంటూ ప్రియమణి సంచలన వాఖ్యలు.

Priyamani: నేను ముస్లిం ను పెళ్ళి చేసుకుని చాలా తప్పు చేసానంటూ ప్రియమణి సంచలన వాఖ్యలు.

Heroine Priyamani: తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రియమణి పరిచయమైన తొలి చిత్రం పెళ్ళైన కొత్త లో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుని మన తెలుగు సినిమా రంగలో తొలి చిత్రంతో భోణీ కొట్టింది. తన మాతృ బాష కన్నడ ఐనప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిలా తన నటనతో ఎక్కువ చిత్రాలు తెలుగులోనే నటించింది. తను నటించిన తొలి చిత్రం హిట్ అవ్వడంతో వరుస చిత్రాల్లో అవకాశాలు ఇక్కడ లభించాయి. అలా తెలుగులోనే కాకుండా తమిళం, మళయాలం, కన్నడ, తమిళ చిత్రాల్లో నటిస్తూ ప్రతీ ఇండస్ర్టీలో తనదైన శైలిలో మంచి గుర్తింపు పొందింది. అన్ని ఇండస్ర్టీలలో కంటే టాలీవుడ్ లో ఎక్కువగా స్టార్ డమ్ సంపాదించుకున్నదనే చెప్పాలి.

heroine-priyamani-sensational-comments-about-her-husband

అలా ఒకప్పుడు హీరోయిన్ గా రాణిస్తున్నప్పటికీ అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో పలు క్యారెక్టర్ ఆరిస్ట్ గా మరియు విలన్ గా మొదలైన పాత్రలలో నటిస్తుంది. ఇటీవలే తను నటించిన కస్టడీ చిత్రంలో విలన్ పాత్రలో ప్రియమణి అందరినీ మెప్పించింది. ఇక ఇటీవలే సోషల్ మీడియా పరంగా తను ఎదుర్కున్న ట్రోల్స్ గురించి మాట్లాడింది. కేవలం సినిమాల్లో ఓ నటిగా మాత్రమే కాకుండా పలు షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్న ప్రియమణి ఎన్నో రకాలుగా బాడీ షేమింగ్ ట్రోల్స్ కు గురయ్యానని అవ్వన్నీ నాకు కొత్తేమీ కాదంటూ వెల్లడించింది. వీటన్నింటికీ మించి నా పెళ్ళి నా భర్త ముస్సఫ్ఫాతో జరిగినప్పుడు నాకు గట్టిగా ఎదురు దెబ్బ తగిలిందని తెలిపింది. అలాంటి వాఖ్యలు చేస్తున్న ప్రతీ ఒక్కరికీ నేను చెప్పేది ఒక్కటే గుర్తుపెట్టుకోండి అంటూ..

See also  Anchor Vishnu Priya : ఆ హీరోతో.. శోభనం ఎంత ఇష్టమో విష్ణుప్రియ వివరించిన వీడియో వైరల్!

heroine-priyamani-sensational-comments-about-her-husband

ఇలా ఆన్లైన్ లో వచ్చే ట్రోల్స్ గురించి నేను అస్సలు పెద్దగా పట్టించుకోను. ఇప్పటికే నేను బాడీ షేమింగ్ మరియు నా ఒంటి రంగు విషయమై ఎన్నో రకాల దారుణమైన విమర్శలను ఎదుర్కోన్నాను. ఇక ఈ విషయాలన్నీ అసలు పక్కన పెడితే అసలైన విషయం నా భర్త ముస్సఫ్ఫా ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎన్నో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నాను. మొదట నా నిశ్చితార్దపు ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. నీకు వేరే ఎవ్వరూ దొరకలేదా.? ఓ ముస్లింతో పెళ్ళి చేసుకుంటున్నావు అంటూ.. మమ్మల్ని ఘోరంగా అవమానించారు. ఇలాంటి వాళ్ళను నేను తెలియజేస్తున్నది ఒక్కటే.

See also  Victory Venkatesh: ఆర్తీ అగర్వాల్ ని అంత ఇష్టపడిన వెంకటేష్.. అప్పట్లోనే ఆమె కోసం ఏం చేశాడో తెలుసా .??

heroine-priyamani-sensational-comments-about-her-husband

ఇక వీళ్ళ అందరికీ చెప్తున్నది ఒక్కటే.. ఇది నా జీవితం నా ఇష్టం. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలని, ఎవరితో కాపురం చెయ్యాలి అన్నది నా ఇష్టం. నా పై ట్రోలింగ్ చేసి నా దృష్టి లో పడడం ద్వారా నేనేమీ భాద పడడం లేదు. అసలు నేను ఇలాంటి విషయాలు పట్టించుకోనే పట్టించుకోను. కానీ కేవలం నావల్ల నా భర్త ఇబ్బంది పడడం నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. చాలాసార్లు నేను ఇలాంటి ట్రోల్స్ చూసి అసలు నేను ముస్లింని పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేదని అనిపిస్తుందంటూ ప్రేమని వెల్లడించింది. ప్రస్తుతం ప్రియమణి సినిమాల విషయానికొస్తే.. తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కున్న జవాన్ చిత్రంలో కీలక పాత్రలో నటించనుంది (Heroine Priyamani) ప్రియమణి. ఇక ఈ చిత్రంలో షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.