Anchor SriMukhi: సినిమా ప్రపంచంలో ఈ చిన్న అవకాశం కావాలన్నా.. రావాలన్నా.. దక్కించుకోవాలన్నా.. కచ్చితంగా కాస్టింగ్ కౌచ్ కి బలవ్వాల్సిందే అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ఇప్పుడు సినీ ప్రపంచంలో టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న బ్యూటీ లందరూ కూడా ఒకప్పుడు ఇలాంటి క్యాస్టింగ్ కోచ్ లకి బలైయ్యి ఎన్నో రకాల ఇబ్బందులకు గురైన వాళ్లే.. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఏ స్థానంలో ఉన్నారో మనందరికీ తెలిసిన విషయమే.. వాళ్లే ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో స్వయంగా బయట పెట్టారు.
అయితే ఇండస్ట్రీలో కేవలం స్టార్ హీరోయిన్ గా కావాలి అనుకున్న వాళ్లకే కాదు.. ఇండస్ట్రీలో ఏదో ఒక పాత్ర దక్కి వెండి తెరపై కనిపిస్తే చాలు దానికి సంబంధించిన అర కొర పాత్రలు చేయాలనుకున్న ముద్దుగుమ్మలకు కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ బాధలు తప్ప లేదట. అలాంటి ఎన్నో రకాల సంఘటన ఎదురు అయ్యాయని ఇప్పటికే ఎంతో మంది నటులు కూడా వాళ్ళ ఆవేదనను వెల్లడించారు. ఇక ఇలాంటి సంఘటన కూడా ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా ఎదురైందట. దాంతో ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
ఇక బుల్లి తెరపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిలం చేసుకున్న శ్రీముఖి యాంకర్ కేవలం బుల్లి తెర షోలలో మాత్రమే కాకుండా మొదట్లో వెండి తెర పై కూడా పలు చిత్రాలలో నటించి నటించింది అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే శ్రీముఖి అప్పట్లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కెరియర్ మొదలు పెడుతున్న సమయంలో శ్రీముఖి అవకాశాల కోసం ఓ స్టార్ డైరెక్టర్ దగ్గరికి వెళితే ఆడిషన్స్ కోసం ఓ రూమ్ లోకి పిలిచారట.. అయితే ఆ డైరెక్టర్ వేరే ఇతర బిజీ షెడ్యూల్ పనుల్లో ఉండడం వల్ల మార్నింగ్ మొత్తం ఆ షూటింగ్లో పాల్గొని సమయం లేక నైట్ ఆ రోల్ కోసం చేసే అమ్మాయిలను ఆడిషన్ కోసం తన రూమ్ కి రమ్మన్నాడట.
ఇక ముందు నుండి ఇలాంటి విషయాల పట్ల ఎంతో అప్రమత్తంగా ఉన్న శ్రీముఖి.. బహుశా డైరెక్టర్ క్యాస్టింగ్ కోచ్ కోసమే రాత్రి నన్ను రూమ్ కి రమ్మన్నాడేమో? అన్న భయంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మరి రూమ్ లాక్ వేసుకుని రెండు మూడు రోజుల వరకు బయటకు రాలేదట.. దాంతో ఆ డైరెక్టర్ చేసేదేమీ లేక ఆ పాత్రకు వేరే బ్యూటీని ఎంపిక చేసుకున్నాడని తెలుసుకున్న శ్రీముఖి ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని తీరా మంచి ఛాన్స్ పోగొట్టుకున్నానని వెక్కి వెక్కి ఏడిచేసిందట.. అలా శ్రీముఖికి (Anchor SriMukhi) ఒక మంచి రోల్ మిస్సయిందని తెగ బాధపడిపోయిందట.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.