Home Cinema Adipurush : ఆదిపురుష్ లో ఆ సీన్స్ తీసేయకపోతే.. సినిమా బ్యాన్ చేస్తారట..

Adipurush : ఆదిపురుష్ లో ఆ సీన్స్ తీసేయకపోతే.. సినిమా బ్యాన్ చేస్తారట..

if-those-scenes-do-not-remove-from-the-adipurush-movie-opposition-party-will-fight-to-ban-that-movie

Adipurush : జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆదిపురుష్ సినిమాపై అనేకమంది అనేక రకాల కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది సినిమా బానే ఉంది కుటుంబంతో ఒకసారి చూడొచ్చు అని అంటే.. మరికొందరు సినిమా చెత్తలా ఉందంటే.. ఇంకొందరు శాకుంతలం లా డిజిటల్ ఎఫెక్ట్స్ అసలు బాలేదు అంటుంటే.. ఇంకొందరు ( Adipurush Movie wants to ban ) రామాయణాన్ని చాలా ఎగతాళిగా తీశారు, అసలు రామాయణమే మార్చేశారు అని ఇంకొందరు అంటుంటే.. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్లు చేస్తూ సినిమాని చూస్తున్నారు కానీ అంటూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఒక వార్త సినిమా గురించి సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది.

if-those-scenes-do-not-remove-from-the-adipurush-movie-opposition-party-will-fight-to-ban-that-movie

అది ఇప్పుడు సినిమాలో కొన్ని సీన్స్ తీసేయకపోతే సినిమాని క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. ‘ఆదిపురుష్’ సినిమా ప్రదర్శనపై జాతీయ స్థాయిలో నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ.. ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్‌పూర్ జిల్లాలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సనాతన ( Adipurush Movie wants to ban ) ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన ఈ కుట్రని కచ్చితంగా ఆపుతామని అంటున్నారు. ఆదిపురుష్ సినిమా ప్రదర్శన పై జాతీయ స్థాయిలో నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ.. థియేటర్ల ముందు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమా హిందూ సంప్రదాయాలను ఎగతాళి చేసినట్టు ఉందని.. శ్రీరాముడిని కూడా ఎగతాళి చేసినట్టు ఉందని.. అందువల్ల ఈ సినిమాని బ్యాన్ చేయాలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

See also  Tollywood heroes : మన స్టార్ హీరోల్లో హైయెస్ట్ రెమ్యునిరేషన్ తీసుకుంటున్న హీరోలు ఎవరో.. ఎంతో మీకు తెలుసా?

if-those-scenes-do-not-remove-from-the-adipurush-movie-opposition-party-will-fight-to-ban-that-movie

వాల్మీకి మహర్షి, తులసీదాస్ వంటి గొప్ప రచయితలు రచనలో ఇంతవరకు మనం చదివిన రామాయణాన్ని.. ఓం రౌత్ ఈ సినిమాని చాలా దారుణంగా ఎగతాళిగా తీశాడని వ్యాఖ్యానిస్తున్నారు. రామాయణానికి ఈ సినిమాకి ఎటువంటి పోలిక లేదంటూ ఈ సినిమాలో రాముడు – సీత , రాముడు – ఆంజనేయ స్వామి మధ్య ఉన్న కొన్ని ( Adipurush Movie wants to ban ) సన్నివేశాలను తీసేయకపోతే సినిమాని బ్యాన్ చేయమని కోరుతామని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ప్రజల కోరితే ఈ సినిమాపై వ్యతిరేకంగా కోర్టుకెళ్లి పోరాడుతామని అంటున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాని భారీ బడ్జెట్ తో తీసి ఆ బడ్జెట్ ఎలా వసూలు అవుతుందని ఎదురుచూస్తున్న తరుణంలో..

See also  Keerthy Suresh Birthday : కీర్తి సురేష్ పుట్టినరోజు నాడు ఆమె లవర్ ఎవరో తెలిసిపోయింది..

if-those-scenes-do-not-remove-from-the-adipurush-movie-opposition-party-will-fight-to-ban-that-movie

ఇలా ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ ఒక్కొక్కచోట ఒక్కొక్కరు పోరాడుతుంటే.. సినిమాను కొనుగోలు చేసిన వాళ్ళందరూ గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. సినిమా కొనుక్కున్న వాళ్లు అన్యాయం అయిపోతారని ఒకపక్క ఆలోచన వస్తున్నప్పటికీ.. ఈ తరం వాళ్లు రామాయణం అంటే ఇంతేనేమో అని అర్థం చేసుకుంటారు ఏమో అని భయంతో ఇంకొందరు పోరాడుతున్నారు. ఏదేమైనా ఈ సమస్యలన్నీ ఎక్కడికి తీసుకెళ్తాయో తెలీదు కానీ.. ఆదిపురుష్ సినిమా ఎన్ని రోజులు వరకు థియేటర్లో ఉంటుందో.. ఒకవేళ ఉన్నా అందులో ఎన్ని సీన్లు నెమ్మదిగా ముందు ముందు కట్ చేస్తారో తెలియదు కనుక.. గబగబా సినిమా చూడాలనుకున్నవాళ్ళు చూసేయాలని అనుకుంటున్నారు.