Home Cinema Adipurush : ఆ చిచ్చుతో అతలాకుతలం అవుతున్న ఆదిపురుష్.. ప్రభాస్ పరిస్థితి!

Adipurush : ఆ చిచ్చుతో అతలాకుతలం అవుతున్న ఆదిపురుష్.. ప్రభాస్ పరిస్థితి!

one-fake-news-spread-on-the-prabhas-adipursh-movie-but-the-movie-team-give-a-strong-warning

Adipurush : ప్రస్తుతం అందరి దృష్టి ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా పైనే ఉంది. ఈ సినిమాపై మొదట్లో పెద్దగా అంచనాలైతే లేవు. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలు హిట్ కాలేదు. దీనితో ప్రభాస్ సీజన్ బాహుబలితో అయిపోయింది.. ఆ తర్వాత అందరూ కూడా పెద్దపెద్ద ( Fake news on Prabhas Adipurush ) భార్య అంచనాలతోనే ఉంటారు కాబట్టి.. వాటిని రీచ్ అవ్వడం కష్టం.. అందుకని ఏ సినిమాలు బాగోవు అనే ఫీలింగ్ కి వచ్చి సైలెంట్ అయిపోయారు. కానీ ఆదిపురుష్ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అక్కడి నుంచి దానిపై అంచనాలు పెరగడం మొదలైంది. ఒక్కసారిగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సమయం దగ్గరకు వచ్చేసరికి ఆ సినిమాపై ఆడియన్స్ కి ఎంత ఇష్టం ఉందో అక్కడే తెలిసిపోయింది.

one-fake-news-spread-on-the-prabhas-adipursh-movie-but-the-movie-team-give-a-strong-warning

ఈ సినిమాపై పెద్దగా అంచనాలు మొదట్లో లేకపోవడానికి కారణం బాహుబలి తర్వాత ప్రభాస్ కి హిట్స్ లేకపోవడం ఒకటైతే.. రామాయణ గాథ ఇప్పటికే ఎన్నోసార్లు మన తెలుగులో ఎంతోమంది హీరోలతో వచ్చేసింది. పైగా రామాయణం అనగానే సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇలాంటి హీరోలతో అలవాటు పడ్డ మన తెలుగు ప్రజలకి ప్రభాస్ తో నచ్చుతుందా అనే ఒక చిన్న అనుమానం కూడా ఉండేది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ( Fake news on Prabhas Adipurush ) అర్థమైంది ఏంటంటే.. దర్శకుడు చాలా తెలివిగా రామాయణంలో రాముడు వనవాసం చేసిన పార్ట్ మరియు యుద్ధం చేసిన పార్ట్ ఎక్కువగా తీశారు. ఈ పార్ట్ లో రాముడు అవతారం రాజా కుమారుడిగా కంటే.. ఒక సామాన్యుడుగా కనిపించిందే ఎక్కువగా ఉంటది. ఇలాంటి పాత్రలనే బాహుబలి లాంటి సినిమాలతో ఆ వేషధారణతో ప్రభాస్ చేసి అదరగొట్టిన సంగతి మన అందరికి తెలిసిందే.

See also  Anushka Shetty : సడన్ గా అనుష్క ఎందుకలా చేసిందో..

one-fake-news-spread-on-the-prabhas-adipursh-movie-but-the-movie-team-give-a-strong-warning

ఎప్పుడైతే ట్రైలర్లో ప్రభాస్ ని చూసి చాలామంది ఫిదా అయిపోయారో.. ఇక సినిమా సూపర్ డూపర్ హిట్ అని ఫిక్స్ అయిపోయారు. అయితే ఆదిపురుష్ పై ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రామాయణం మీద వస్తున్న ఈ సినిమా అంటే రామాయణం పారాయణం జరుగుతున్నట్టే.. కాబట్టి ఆ థియేటర్లోకి దళితులు రావడానికి వీల్లేదు అని ఒక అని సినిమా టీం వారు పంపినట్టుగా ఒకటే ఫేక్ న్యూస్ ని సోషల్ మీడియాలో ( Fake news on Prabhas Adipurush ) వదిలారు. అది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు.. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ప్రభాస్ సినిమాకి ఇలాంటి కండిషన్ నా? ఈ రోజుల్లో ఇంకా కులం అని ఆలోచిస్తున్నారా? ఇలాంటి రూల్స్ పెడతారా సినిమా చూడడానికి? అని అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం గమనించిన చిత్ర బృందం వెంటనే గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

See also  Samantha: పుష్ప 2 ఆఫర్ వద్దనుకున్న సమంత...! అసలు విషయం అదేనా..??

one-fake-news-spread-on-the-prabhas-adipursh-movie-but-the-movie-team-give-a-strong-warning

ఆదిపురుష్ సినిమా యావత్ భారత దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిది. దీంట్లో కులం, మతం అలాంటివి లేవని.. అది ఫేక్ న్యూస్ అని.. అలాంటి వాటిని నమ్మొద్దని.. అలాంటివి చేసిన వాళ్ళకి పనిష్మెంట్ కచ్చితంగా ఇస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చి.. అందర్నీ సముదాయించింది. దీంతో అందరూ ఒక్కసారిగా చల్లబడ్డారు. ఎప్పుడైతే ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం మొదలెట్టిందో.. ఆదిపురుష్ టీం అతలాకుతలం అయిపోయింది. అంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమాపై ఇలాంటి నెగటివ్ టాక్, నెగిటివ్ మాటలు వస్తే.. సినిమా ఓపెనింగ్స్ లేకపోతే.. ఎంత అన్యాయం అయిపోతారో అందరికీ తెలుసు. పైగా ప్రభాస్.. కులం గురించి మాట్లాడే విధంగా ఉండే టీంలో పని చేశాడా అని ప్రభాస్ మీద కూడా ఎంత పరువు నష్టం ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇది కావాలని ఎవరైనా చేశారో.. సరదాగా చేశారో తెలీదు కానీ.. ఇలాంటివి సరైన పద్ధతి కాదని చిత్ర బృందం చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక జూన్ 16వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది..