Kavya Kalyan : ఇటీవల రిలీజ్ అయిన బలగం సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మనిషి రోజుకి మరిచిపోతున్న రక్తసంబంధం, బంధాలు, అనుబంధాల విలువలను మాసిపోనవకుండా.. ఇంకా ఆ బంధాలు ఉన్నాయి, ఉంటేనే మన ముందు తరం వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది ( Blagam heroine Kavya Kalyan ) అని చూపించిన ఆ సినిమా తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన కావ్య కళ్యాణ్ కి కూడా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాతోనే కావ్య కళ్యాన్కి ఒక గుర్తింపు అనేది వచ్చింది. ఎంతో కాలంగా నటిస్తున్నప్పటికీ కూడా.. ఆమెను ఎవరు పెద్దగా గుర్తించలేదు. కానీ బలగం సినిమాతో కావ్య కళ్యాణ్ కి గుర్తింపు వచ్చింది. బలగం హీరోయిన్ అని చక్కగా ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు.
కావ్య కళ్యాణ్ సినిమాల్లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. గంగోత్రి, ఠాగూర్, బన్నీ సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 2022వ సంవత్సరంలో ‘ఉస్తాద్’ అనే సినిమాతో హీరోయిన్గా మొదటిసారి చేసింది. తర్వాత మసూద, బలగం వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా ఊహించని విధంగా ( Blagam heroine Kavya Kalyan ) సూపర్ హిట్ అవడంతో.. ఈ అమ్మడికి గుడ్ లక్ హ్యాండ్ అనే పేరు కూడా వచ్చింది. దీనితో ఈవిడకి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే బలగం సినిమా హిట్ అయిందో బలగం హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుందో అక్కడ నుంచి కెరియర్లో తిరుగులేకుండా బిజీబిజీగా ఉంది. ఇలాంటి సమయంలో ఈమె మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కావ్య కళ్యాణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా సంచలంగా మారాయి. కావ్య కళ్యాణ్ మీడియాతో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక నటి అన్ని రకాల పాత్రలోనే నటించాలి. ఏ సీనైనా కూడా చేయాలి కానీ.. చేయను అని అనుకోకూడదు. మంచి కథ ఉంటే ఎలాంటి సీనులోనైనా నటించడానికి సిద్ధం అని అన్నది. అలాగే లిప్ లాక్ సీన్స్, బెడ్ సీన్స్ చేస్తే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వాలని.. అలాంటి సీన్లు ఉంటే నేను కూడా రెడీ అన్నది. మంచి ( Blagam heroine Kavya Kalyan ) రెమ్యూనిరేషన్ తీసుకొని ఖచ్చితంగా.. ఆ సీన్స్ ని కూడా బాగా నటిస్తానని బోల్డ్ గా చెప్పింది. బెడ్ సీన్ అయినా కూడా నటిస్తాను.. కాకపోతే దానికి రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వాలి అని బోల్డ్ గా చెప్పిన ఆమె మాటలు విని.. కొందరు ఈమె మరీ హద్దులు దాటి మాట్లాడుతుంది అని కామెంట్ చేస్తున్నారు.
మరికొందరైతే దాందేముంది ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. ఆమె ఏం చేయగలదో చెప్తుంది.. అలా చేయడానికి ఏం కావాలో చెప్తుంది. దాంట్లో తప్పేముంది అని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా కావ్య కళ్యాణ్ రెండు సినిమాల్లో హిట్టు కొట్టింది ఓకే. కాకపోతే తర్వాత సినిమాలు ఎలా ఉంటాయో.. ఆమె ఎప్పటికైనా స్టార్ హీరోయిన్ అవుతుందా? అలా అయ్యే క్యాపబిలిటీ, నటన సామర్థ్యం ఆమెలో ఉందా అనేది.. ముందు ముందుకు ఆమె చేసే పాత్రలను బట్టి, సినిమాలను బట్టి అర్థం అవుతుంది. ఏదేమైనా సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు ఆమె కామెంట్స్ పై ఎవరి అభిప్రాయాల్ని వాళ్ళు నిస్సందేహంగా చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇది చూసి మీ అభిప్రాయం కూడా ఏమిటో చెప్పండి.. ఆమె ధైర్యంగా అలా చెప్పడం సరైన పనే అంటారా లేదా ఇంకా మీ అభిప్రాయం ఏమైనా చెబుతారా?