Home Cinema Prabhas : వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న ప్రభాస్! హైలెట్ ఏంటంటే..

Prabhas : వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న ప్రభాస్! హైలెట్ ఏంటంటే..

prabhas-visit-tirumala-venkateshwara-swamy-and-also-go-to-adipursh-pre-release-function

Prabhas : కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ గట్టి నమ్మకం. అలాగే ప్రభాస్ కూడా ఆ వెంకటేశ్వర స్వామి పాదాలను దర్శించి తన సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు వెళ్ళబోతున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదిపురుష్ సినిమా ఈరోజు తిరుమలలో ( Prabhas visit Tirumala Venkateshwara ) వెంకటేశ్వరస్వామి పాదాల కింద శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ఎంతో వైభవంగా ఈ వేడుక జరగబోతుంది. ఈ సందర్భంగా తిరుమల వెళ్ళిన ప్రభాస్ ముందుగా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పంచ కట్టుకొని సాంప్రదాయ దుస్తులతో ఆ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాడు. చక్కటి దుస్తులతో, సాంప్రదాయపరంగా ఆ దేవుడు సన్నిధిలోకి వెళ్తున్న ప్రభాస్ను చూసి అభిమానులు ఆనందంతో అరిచారు.

prabhas-visit-tirumala-venkateshwara-swamy-and-also-go-to-adipursh-pre-release-function

వెళ్తూ వెళ్తూ ప్రభాస్ అభిమానులకు చేతులు ఊపుతూ.. స్వామి సన్నిధి వైపు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అలాగే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చేటప్పుడు కూడా ప్రభాస్ ఫోటోలు సోషల్ మీడియాలో ( Prabhas visit Tirumala Venkateshwara ) వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే అక్కడ నుంచి ప్రభాస్ గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్ళగా.. అక్కడ అభిమానులు ప్రభాస్ ని చుట్టుముట్టారు. వాళ్ళ హీరో సినిమా ఈరోజు ప్రీ రిలీజ్ వేడుక అక్కడ జరగబోతుందని.. అక్కడికి ప్రభాస్ వస్తాడని తెలిసి.. అక్కడ వేచి ఉండి, ప్రభాస్ ని దూరం నుంచే చూసి ఆనందంతో పొంగిపోయారు. ఇక మరికొన్ని గంటల్లో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక ఎంతో వైభవంగా జరగబోతుంది.

See also  Nayanatara: పెళ్ళై పిల్లలున్న ఆ పొలిటీషియన్ తో నయనతార సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగిస్తుందా.? నిజమెంత..

prabhas-visit-tirumala-venkateshwara-swamy-and-also-go-to-adipursh-pre-release-function

ఈ వేడుకను ఇప్పటివరకు సినిమా రంగంలో కనీవినీ ఎరుగన్నంత రీతిలో, ఎంతో ఘనంగా చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. గెస్ట్ హౌస్ లో ఉన్న ప్రభాస్ ని చూసేందుకు అభిమానులు ఎగబడుతుంటే.. పోలీసులు వాళ్ళని ( Prabhas visit Tirumala Venkateshwara ) కంట్రోల్ చేయలేక సతమతమవుతున్నారంట. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో హైలెట్ ఏంటంటే.. దీనికి ముంబై నుంచి 200 మంది సింగర్స్ 200 మంది డాన్సర్స్ వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే సంగీతద్వయం అజయ్-అతుల్ జై శ్రీరామ్ పాటను లైవ్ గా ప్రదర్శించబోతున్నారంట. చిన్న జీయర్ స్వామి గెస్ట్ గా రాబోతున్నారంట. ఇప్పటికే ఆది పురుష ట్రైలర్ ఎంత ఘనవిజయం సాధించిందో.. ట్రైలర్ చూసిన తర్వాత ఆ సినిమాపై ఎలాంటి అంచనాలు వచ్చాయో మనందరికీ తెలిసిందే.

See also  Samantha : డబ్బు కోసం సమంత షూటింగ్ లో బట్టలిప్పి మరీ అందరిలో అవలీలగా అలా చేస్తుందట..

prabhas-visit-tirumala-venkateshwara-swamy-and-also-go-to-adipursh-pre-release-function

వదినమ్మ కంటే నీకు మర్యాద ఎక్కువ అంటే అవును రాముని ప్రాణం జానకి లోనే ఉంటుంది కానీ ప్రాణం కంటే కూడా మర్యాద ప్రథమం అని ప్రభాస్ అన్న డైలాగ్స్ ట్రైలర్లో అదిరిపోయాయి. రామాయణం ఇతిహాస నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. ఇక బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా అదరగొట్టాడు. అభిమానులకు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి సినిమా తర్వాత ఆ రేంజ్ లో కనీసం సూపర్ డూపర్ హిట్ అయిన ఒక్క సినిమా కూడా లేదు. అలాంటిది ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతుందని అంచనాలతో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా 185 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆ రేంజ్ లో బిజినెస్ చేసిన సినిమా ఆదిపురుష్ అని అంటున్నారు.