Vimanam : సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసమే కానీ ఇంక దేనికి పనికిరాదనుకుంటే అది సరైన ఆలోచన కాదని చెప్పొచ్చు. సినిమా మనిషిని ఎడ్యుకేట్ చేస్తాది. మనం తీసుకునే విధానాన్ని బట్టి మంచి తీసుకుంటే మంచి.. చెడు తీసుకుంటే చెడు.. మనం చూసే కోణాన్ని బట్టి సినిమా రిజల్ట్ అనేది ఉంటాది. అలాగే ( Vimanam movie review given by ) ప్రతి సినిమా ఏదో ఒక కాన్సెప్ట్ మీద ఆధారపడి.. ఏదో ఒక నీతి చివరికి చెప్పాలని ఆలోచించి.. సినిమా కథ రాస్తారు. అలాగే కొన్ని సినిమాలు హైబడ్జెట్ తో భారీగా విడుదల చేసి.. పెద్ద పెద్ద హీరోలు, కోట్ల కొద్ది డబ్బు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు ఒక ఎత్తైతే.. అతి చిన్న సినిమాలు.. చిన్న చిన్న ఆర్టిస్టులను పెట్టుకొని లో బడ్జెట్లో సినిమా తీసే విధానం ఒక ఎత్తు. అయితే లో బడ్జెట్ సినిమాలు చాలా వరకు సక్సెస్ అవ్వడం చాలా కష్టం. కానీ సక్సెస్ అయితే ఆ సక్సెస్ రేట్ చాలా బాగుంటాది.
అలాంటి ఆశలతోనే విమానం అనే సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా జూమ్ 9వ తేదీ తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో సముద్రికని, మీరాజాస్మిన్, అనసూయ భరద్వాజ్ ముఖ్యమైన తారాగణంగా నటించారు. ఈ సినిమాని శివప్రసాద్ యానాల దర్శకత్వంలో రూపొందించారు. ఈ ( Vimanam movie review given by ) చిత్రాన్ని నిర్మించిన వారు కిరణ్ కుర్రిపాటి, జి స్టూడియోస్. ఇటీవల విమానం సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. తండ్రి కొడుకుల ప్రేమ, సెంటిమెంటు, వాళ్ళ ఆశలు, కష్టాలు వీటితో సమ్మేళనంగా తీసిన సినిమాగా అర్థం అవుతుంది. ఈ సినిమాలో అనసూయకి మంచి రోల్ దొరికినట్టుగా కనిపిస్తుంది. అలాగే మీరాజాస్మిన్ కి డీసెంట్ రోల్ దొరికిందని తెలుస్తుంది.
విమానం సినిమాని ట్రైలర్ చూసిన దర్శకుడు కే రాఘవేంద్రరావు గారు ఆయన రివ్యూ ఇచ్చారు. ట్రైలర్ చాలా బాగుంది చాలా ఎమోషన్స్ తో తీసిన సినిమా అని అనిపిస్తుంది. అలాగే దర్శకుడు శివప్రసాద్ తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ గురించి చూపిస్తూ ఉంటే.. మనసుకి హత్తుకునేలా ఉంది.. కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి. ఇలాంటి ( Vimanam movie review given by ) డిఫరెంట్ కంటెంట్ సినిమాకి.. సినిమా ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎంకరేజ్ చేయడం నిజంగా చాలా గొప్పతనం.. ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని ఇలాంటి సినిమాకు తీసుకొని వెళ్ళాలి.. అప్పుడే వాళ్లకి తల్లిదండ్రులు పిల్లలు ఆశల కోసం ఎంత కష్టపడతారు.. ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు అనేది బాగా తెలుస్తుంది అని రాఘవేంద్రరావు గారు చెప్పారు.
ఇంకా రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ.. విమానం సినిమా అందర్నీ కనెక్ట్ అయ్యేలా ఉందని, ప్రతి వర్గం వారు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని, ఎంతో సెంటిమెంటల్ గా ఫీల్ అవుతారు.. అలాగే ఎన్నో నేర్చుకుంటారు అని చెప్పారు. అలాగే విమానం సినిమా చూసిన తర్వాత ఆయన జీవితంలో జరిగిన ఒక నిజ సంఘటన గుర్తుకొచ్చిందని చెప్పారు. జిఎంఆర్ సంస్థల అధినేత మల్లికార్జున రావు గారికి పెళ్లి అయింది. ఆయన దగ్గర ఉండేది తన వెస్పాలో ఆయన భార్యని రాజాం నుంచి వైజాగ్ తీసుకెళ్ళి.. గోడ మీద నుంచి దూరంగా ఉన్న విమానాన్ని చూపించారు. అలాంటి జిఎంఆర్ గారు ఈరోజు ఎన్నో విమానా ఎయిర్పోర్ట్ లు కట్టారు. ఇలా అందరి జీవితాల్లోనూ అనేక గొప్ప గొప్ప కథలు గుర్తుకొచ్చేలా చేస్తుంది ఈ సినిమా అని రాఘవేంద్రరావు గారు చెప్పారు. ఈ సినిమాలో నటీనటులు అందరూ చాలా గొప్పగా నటించారని, మ్యూజిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుందని, వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అంటూ ఆయన మంచి రివ్యూ ఇచ్చారు.