Home Health కిడ్నీలు రాళ్ళు ఏర్పడితే ఈ ఐదు రకాల ఫ్రూట్స్ తినకూడదు

కిడ్నీలు రాళ్ళు ఏర్పడితే ఈ ఐదు రకాల ఫ్రూట్స్ తినకూడదు

కిడ్నీలు రాళ్ళు ఏర్పడితే ఈ ఐదు రకాల ఫ్రూట్స్ తినకూడదు.

ఇది మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. మన శరీరంలో చెడునంత ఫిల్టర్ చేసి, విష కణజాలాలను ఇంకా రకరకాల మన శరీరానికి హాని కలిగించే వ్యర్ధాలను మన శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. ఒక వడపోతలాగా ఇది విష పదార్థాలను తొలగిస్తుంది తద్వారా మన శరీరం వ్యాధుల బరిన పడకుండా కాపాడగలుగుతుంది.

అందుకే మనం కిడ్నీల ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే మన ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది కిడ్నీ వ్యాధి అనేది చాలా ప్రమాదకరం అందుకే కిడ్నీలో రాళ్లు చేరకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ కిడ్నీల వ్యాధి చాలా ప్రమాదకరమైనది కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉంటే చాలా పరిమణామాలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఆరోగ్యంగా లేని ఆహారం తీసుకోవడం వలన మనకు కిడ్నిలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది పదే పదే అలా అనారోగ్యకరమైన ఆహరం తింటే మరిన్ని సమస్యలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అందుకోసం కడ్నీల సమస్యలు ఉన్నప్పుడు ఏ ఆహరం తినాలి, అసలేం తినకూడదో తెలుసుకుందాం.

See also  జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో తెలుసా.?

మనకు తెల్సు ఏ పండైనా ఆరోగ్యానికి ఏదో ఒక రకంగా మంచే చేస్తాయి తప్ప చెడు చేయవు ఒకవేళ సమస్యలు తలెత్తినప్పుడు ఏ పండ్లు తినకూడదు అనేది చూద్దాం. ముఖ్యంగా కిడ్నీల సమస్య ఉన్నప్పుడు ఏ పండ్లు తినవద్దు దానికి సంబంధించిన పరిమితులు ఉన్నాయి. కిడ్నీలో రాళ్ళున్నప్పుడు నీరు ఎక్కువగా ఉండే పళ్ళను  మాత్రమే తినాలి. ఉదాహరణకు చూద్దాం పుచ్చకాయ, కొబ్బరికాయ, కర్భూజకాయ, దోసకాయలు మొదలైనవి. సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. ఇవి కిడ్నీ సమస్యలను దూరం చేయడమే కాకుండా మన ఇమ్యునిటీ లెవల్స్ ని పెంచుతాయి. ఆరెంజ్, బత్తాయి, ద్రాక్ష మొదలైనవి తినవచ్చు.

See also  Bad Habits: ఈ చెడు అలవాట్లు మీరు వృద్ధులు అవ్వడానికి కారణం అవుతున్నాయి ఇవాళే వదిలేయండి.

కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నప్పుడు ఈ ఐదు రకాల పండ్లు తినకూడదు డ్రై ఫ్రూట్స్, దానిమ్మ, జామ, స్ర్టా బెర్రీ, బ్లూ బెర్రీ లు ఉన్నాయి.