Home Devotional ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా, పనిలో ఆటంకాలు ఉన్నా హనుమంతునికి మంగళవారం ఈ నాలుగు పరిహరాలు చేసిచూడండి.

ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా, పనిలో ఆటంకాలు ఉన్నా హనుమంతునికి మంగళవారం ఈ నాలుగు పరిహరాలు చేసిచూడండి.

ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా, పనిలో ఆటంకాలు ఉన్నా హనుమంతునికి మంగళవారం ఈ నాలుగు పరిహరాలు చేసిచూడండి.

మంగళవారం అంటేనే మన హిందూ సనాతన ధర్మంలో ఆంజనేయస్వామికి అంకితం చేయబడింది. మంగళవారం ఆంజనేయస్వామి దేవాలయానికి వెళుతుంటారు హిందువులందరూ.

మంగళవారం రోజున కొన్ని ప్రత్యేక పద్దతుల ద్వారా తమ తమ జీవితంలో సుఖసంతోషాలు పొంది కష్టనష్టాలు దూరమైపోతాయని హిందువుల నమ్మకం. ఇలా ఆంజనేయస్వామికి ఇష్టమైన మంగళవారం రోజున స్వామిని ప్రస్ననం చేసుకోవడానికి చేయవలసిన కొన్ని పనుల గురించి చూద్దాం పదండి.

ఆర్ధికమైన సంక్షోభం పోవడానికి :

ఆర్ధికంగా ఇబ్బంది పడేవారు ప్రతీ మంగళవారం రోజు మొత్తంలో ఏ సమయంలో అయినా కోతులు ఎక్కువ ఉండే దేవాలయానికైనా లేదా చాలా కోతులు ఉండే ప్రదేశానికైనా వెళ్ళి అక్కడ ఉన్న కోతులకు అరటిపండ్లు, శనగలు మరియు బెల్లం వాటికి వడ్డించండి. బీదవారికి ఆకలితో అలమటించేవారికి అన్నధానం చేయండి. ఇలా మంగళవారం చేయడం ద్వారా అదృష్టం ప్రకాశించి ఆర్ధిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని హిందువుల నమ్మకం.

See also  Ganesh Chaturthi 2023 : వినాయకచవితి రోజు ఏ రాశి వారు ఎలా వినాయకుడిని పూజిస్తే అదృష్టం కలుగుతుందంటే..

శని మహర్ధశ తొలగిపోవడానికి :

మీకు శనిదోషం వల్ల ఏర్పడుతున్న ఆటంకాలు లేదా మీ యొక్క జాతకంలో మహర్ధశ కొనసాగుతున్నా మంగళవారం రోజు 108 తులసి ఆకులపై పసుపుచందనంతో ఆ శ్రీరాముని యొక్క నామాన్ని రాయాలి ఆ రాసిన 108 తులసి ఆకులను మాలగా చేసి ఆంజనేయస్వామికి సమర్పించాలి. ఇలా చేస్తే రాహువు, కుజుడు, శని గ్రహలకు సంభందించిన దోషాలు అన్నీ తొలగిపోయని విశ్వసిస్తారు.

అకాల మృత్య భయం నుంచి :

అకాల మృత్య భయంతో భయపడేవారు మంగళవారం పొద్దున్నే ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి హనుమంతునికి సింధూరంతో పాటు గులాబి దండ సమర్పించాలి. ఆవు నెయ్యి తో ద్వీపాన్ని వెలిగించి సుందరకాండను పఠించాలి. ఇలా 11 వారాలు చేయడం ద్వారా మంగళవారాలు అన్ని కష్టాలు తొలగిపోయి, అకాల మృత్య మరణం ప్రమాదం నుండి విముక్తి పొందుతారు.

See also  మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈరోజు మీరు ఈ ఒక్క పని చేస్తే చాలు...

కష్టాలనుండి బయటపడటానికి :

మీరు మంగళవారం ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి ఆంజనేయ స్వామి గుడికెళ్లి స్వామివారికి పూలమాలలు సమర్పించి దీపం వెలిగించి స్వామివారికి లడ్డూలు ప్రసాదించాలి. ఆ తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం 108 సార్లు జపించాలి. నీకు కలిగిన కష్టాలన్నీ చదువుకోవాలని ఆపద్బాంధవుణ్ణి ప్రార్థించాలి. ఇలా ప్రతి మంగళవారం ప్రతి శనివారం చేయడం ద్వారా జన్మ నక్షత్రానికి సంబంధించిన కష్టాలు దోషాలన్నీ తొలిగిపోయి అన్ని శుభాలే కలుగుతాయి.

See also  Sri Rama Navami : శ్రీ రామ నవమి రోజు ప్రతి హిందువు చేయవలసిన.. చేయకూడని పనులు..