Home Health కమ్మటి పల్లీల చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా.?

కమ్మటి పల్లీల చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా.?

కమ్మటి పల్లీల చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా.?


పల్లిల చట్నీ తయారీ విధానం:
పల్లి చట్నీ కి కావాల్సిన పదార్థాలు :
పల్లీల చట్నీని మనం చాలా సులభంగా తయీరుచేసుకోవచ్చు. ఇడ్లీ,ఊతప్ప,దోశ, వడ,బోండా,పెసరట్టు,ఉప్మా, మరియు ఏదైనా అల్పాహారమునకు రుచిగా ఉంటుంది. ఈ చట్నీ.
ముందుగా ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
పల్లీలు ఒక కప్పు
పచ్చిమిరపకాయలు 8
చింతపండు తగినంత
కొబ్బరి కొన్ని ముక్కలు
ఉప్పు తగినంత
ఎల్లిపాయలు 6
జీలకర్ర, నూనె మొదలైనవి.

See also  Apple Health Benefits: ఆపిల్ పండు యొక్క తినడం వలన కలిగే ఉపయోగాలు

చట్నీ తయారీ:
పల్లీలను ఒక గిన్నెలోకి తీసుకొని మంచి వాసన వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో వేంచాలి.
పల్లీలను ఒక బౌల్లో వేసుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి. అదే గిన్నెలో పచ్చిమిర్చిని తగినంత మరియు నూనె వేసి వేయించుకోవాలి దోరగా
మళ్లీ అదే గిన్నెలో తగినంత జీలకర్ర, కొబ్బరిని, లైట్ గా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పును కలిపి వీటన్నిటిని చల్లారాక మిక్సీలో వేసుకోవాలి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి.

See also  జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో తెలుసా.?

ఇప్పుడు కావాల్సిన తాలింపుకు పదార్థాలు :

నువ్వులు-2 స్పూన్లు. కందిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు -2, కరివేపాకు, కొత్తిమీర, పసుపు,ఇంగువపౌడర్.

తాలింపు తయారు చేసే విధానం :
ముందుగా ఒక బౌల్ తీసుకొని స్లోగా మంట మీద పెట్టి దాంట్లో 2- స్పూన్లు నూనె పోసి నూనె వేడయ్యాక తాలింపు గింజలు వెయ్యాలి. 2 ఎండు మిరపకాయలు వెయ్యాలి ఇవి ఎర్రగా అయ్యాక కరివేపాకు కొత్తిమీర వేయాలి. ఇవి కూడా ఎర్రగా అయ్యాక తగినంత పసుపు తగినంత ఇంగువ పౌడర్ వేయాలి వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ పల్లి చట్నీ పేస్ట్ ను బాగా కలుపుకోవాలి ఈ పల్లి చట్నీ ఎంతో రుచిగా ఉంటుంది.
ఈ పల్లీల చట్నీని ఇడ్లీ, దోశ, వడ, ఉతప్ప, పెసరట్టు, మొదలైన అల్పారంలోకి చట్నీగా ఎంతో రుచిగా ఉంటుంది.