YS Sharmila Son : దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే తెలుగు వాళ్ళందరికీ ఎంత ఇష్టమో, ఆయన అంటే ఎంత భక్తి భావనో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యశ్రీ అంటూ ఆయన ముందుకు నడిపించే ( YS Sharmila Son going to enter a hero ) పరిపాలన విధానాన్ని ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేరు. నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ప్రజల్లోకి నడుచుకుంటూ వెళ్లి.. ఆయన చేసిన ఎన్నో మంచి పనులు సామాన్య ప్రజలకు ఎంతో చేయూతనిచ్చాయి. అలాగే ఆయన మరణం తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి, తనయురాలు షర్మిల ఇద్దరూ కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ రాజకీయాల్లో పయనం చేస్తున్న సంగతి తెలిసిందే.
రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ లో సీఎం గా ఉంటె.. వైయస్ షర్మిల తెలంగాణలో తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆమె పాదయాత్ర చేస్తూ ప్రజలకు దగ్గరవుతుంది. ఆమె మాట తీరు ఆమె ఆలోచన విధానం చూస్తే తప్పకుండా తండ్రికి తగ్గ తనయురాలు అన్నట్టు ఎప్పటికైనా ( YS Sharmila Son going to enter a hero ) నిరూపించుకుంటదనే కొందరికి నమ్మకం కూడా ఉంది. ఇది ఇలా ఉంటే షర్మిలకు ఒక కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో షర్మిల కొడుకుని ఎయిర్పోర్ట్లో చూసి హీరోలా ఉన్నాడని అందరూ కామెంట్ చేశారు. ఇప్పుడు షర్మిల కొడుకుని హీరోగా ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా షర్మిల కొడుకు వైయస్ రాజారెడ్డి ఎయిర్పోర్ట్ లో కనిపించారు.
దీనితో రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా రాజారెడ్డి సినిమాలోకి వస్తే బాగుందని కామెంట్లు చేయడం జరిగింది. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాజారెడ్డికి యాక్షన్ డ్రామా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ( YS Sharmila Son going to enter a hero ) సాగే ఒక కథని సిద్ధం చేశారని అంటున్నారు దీనికి షర్మిల కుటుంబం కూడా ఒప్పుకున్నారని అనుకుంటున్నారు. వైస్సార్ తండ్రి అయిన రాజా రెడ్డి బయోపిక్ లా ఉండబోతోంది, అందులో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా వైస్సార్ గారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన విధానం, నాయకత్వం గురించి ఆయన ఆచరించింది, వైస్సార్ గారికి నేర్పింది చాలానే ఉన్నాయి అని తెలిసింది.
జగన్ ని రాజా రెడ్డి లాగా ఫ్యాక్షన్ లీడర్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి.. దానికి కారణం రాజా రెడ్డి ఫ్యాక్షన్ గొడవల్లో హత్యకు గురికావడం. రాజా రెడ్డి కి వైస్ జగన్ అంటే అమితమైన ప్రేమ అని అందరూ అంటుంటారు.. వైస్సార్ తో పాటు జగన్ విషయంలో కూడా రాజా రెడ్డి ఎలా ఉండేవాడో కాస్త స్టోరీ ఉంటుంది. దీని ధ్వారా జగన్ ఫామిలీ ని ఒక ఫ్యాక్షన్ కుటుంభం గా ప్రతిపక్షాల విమర్శలకు జవాబు చెప్పే ప్రయత్నం చేస్తూ.. అంత ఫ్యాక్షనిస్టులు, జనాలకి ఇబ్బంది పెట్టే కుటుంబమే అయితే కడపలోని జనాలు ఆకుటుంభాన్ని అంతలా ఎందుకు ప్రేమిస్తారు? అసలు ఆ కుటుంబానికి ఓటమి లేకుండా ఎలా గెలుస్తూ వస్తున్నారని వివరించే ప్రయత్నం చేస్తున్నారు అంట. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు మొదలయ్యి.. విడుదల అవుతుందో..