Home Cinema Sai Pallavi: ఆ బాలీవుడ్ యంగ్ హీరో సాయి పల్లవి ని చూసి ప్రేమలో మునిగిపోయాడట.....

Sai Pallavi: ఆ బాలీవుడ్ యంగ్ హీరో సాయి పల్లవి ని చూసి ప్రేమలో మునిగిపోయాడట.. ఇంతకు ఎవరో తెలుసా?

Young Bollywood Hero: తెలుగు సినిమా రంగంలోకి వరుణ్ తేజ్ హీరోగా నటించిన మొదటి చిత్రం అలాగే సాయి పల్లవికి కూడా హీరోయిన్ గా తొలి చిత్రం ఫిదా.. ఇక తన నటనతో తన సహజ సిద్ధమైన అందంతో తెలుగు ప్రేక్షకులను ఇట్టే ఒక్కసారి తన వైపుకి ఆ ఒక్క చిత్రంతోనే తిప్పేసుకుంది. నిజానికి తెలుగులో ఫిదా కంటే ముందే మలయాళం ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఇక అదే చిత్రం కూడా తెలుగులో విడుదలైంది ఆ చిత్రంలో కూడా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన కానీ పూర్తి రోలింగ్లో మాత్రం హీరోయిన్ గా ఫిదా చిత్రంలోని భానుమతిగా అందరినీ అలరించింది. కేవలం తన సహజ సిద్ధమైన నటనతో ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తూ ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా అలనాటి సౌందర్య తర్వాత తనేనని మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని..

See also  Pushpa Raj - Baahubali : పుష్ప రాజ్ కి బాహుబలి కి ఆ స్టార్ హీరోయిన్ తో ఉన్న కామన్ లింక్ ఇదా.. వామ్మో అసలు విషయం బయటపడింది..

young-bollywood-hero-fell-in-love-with-sai-pallavi-will-they-marry-soon

ప్రస్తుతం ఉన్న చాలామంది హీరోయిన్లకు ఈ ముద్దుగుమ్మ ఆదర్శంగా నిలుస్తోందంటూ నేటిసన్స్ ఆమెను కొనియాడుతున్నారు. చేసింది అతి తక్కువ చిత్రాలైనప్పటికీ అమ్మడు భారీ స్థాయిలో అభిమానులను మూటగట్టుకుంది. కాగా ఇటీవల కాలంలో సినిమాలకు చాలా దూరంగా ఉంటుందని చెప్పాలి. దానికి సంబంధించి కూడా ఒక వార్త వైరల్ గా మారింది. అదేంటంటే.. ఆమె చెన్నైలో ఆసుపత్రి కట్టిస్తుందట.. ఆ కారణం చేతనే సినిమాలకు గ్యాప్ ఇచ్చిందని పలు రకాలైనటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెట్టి మన టాపిక్ విషయానికి వచ్చినట్లయితే.. ఓ బాలీవుడ్ యంగ్ హీరో సాయి పల్లవి అంటే పడి చచ్చిపోతున్నాడట. ఆమెను తెగ ప్రేమించేస్తున్నాడట.. మరి సాయి పల్లవిని అంత పిచ్చిగా ప్రేమించే ఆ యంగ్ హీరో ఎవరంటే..

young-bollywood-hero-fell-in-love-with-sai-pallavi-will-they-marry-soon

దాని గురించి మనం తెలుసుకుందాం. కేవలం సాయి పల్లవి దక్షిణాది సినీ ప్రియులకే కాకుండా ఉత్తరాది సినీప్రియ కూడా చాలా ఇష్టమట. మరి ముఖ్యంగా ఈ హీరోయిన్ అంటే మామూలు అభిమానులకే గాక సెలబ్రిటీలకు కూడా చెప్పనక్కర్లేని ఇష్టమని.. ఆమెకి ఆ విధంగా క్రేజ్ ఉందని తెలిసింది. ఇక సాయి పల్లవిని అంత ఘాడంగా అంత ఇష్టంగా ప్రేమిస్తున్నది మరెవరో కాదు యంగ్ నటుడు గుల్హన్ దేవయ్య. ఇంకా ఈయనకి సాయి పల్లవి అంటే చాలా ఇష్టమట.. స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది కూడా ఆయనే.. ఓ ప్రైవేట్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఆ ఇంటర్వ్యూలో గుల్హన్ దేవయ్య మాట్లాడుతూ.. నాకు సాయి పల్లవి అంటే వఎనలేని పిచ్చి ఆమెపై ఏదో తెలియని ఒక రకమైన క్రష్ ఉంది. ఆమె ప్రతి సినిమాను తప్పకుండా చూస్తాను.

See also  Pawan Kalyan: చివరి క్షణంలో షాకిచ్చిన క్రేజీ హీరోయిన్..!! పవన్ సినిమాలో శ్రీలీల ఉంటే నేను నటించను..

young-bollywood-hero-fell-in-love-with-sai-pallavi-will-they-marry-soon

నాకు ఆమెపై ఎంతగా పిచ్చి ఉందంటే ఒక్కసారైనా సరే ఆమెతో కలిసి సినిమాలో నటించాలని ఆశ ఉందంటూ.. ఇక ఆశ మరి నెరవేరుతుందో లేదో తెలియదు గాని కచ్చితంగా ఒక్కసారి అయితే నాకు నటించాలని ఉంది అంటూ తెలిపారు. నా దగ్గర సాయి పల్లవి ఫోన్ నెంబర్ కూడా ఉన్నప్పటికీ మాట్లాడడానికి నాకు ధైర్యం చాలడం లేదు అని వెల్లడిస్తూ.. నాకు సాయి పల్లవి పై ఉన్నది ఒకే రకమైన క్రష్ మాత్రమేనని.. అంతే తప్పితే మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదంటూ.. బాలీవుడ్ నటుడు (Young Bollywood Hero) గుల్హన్ దేవయ్య సాయి పల్లవికి సంబంధించిన వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో నెటేజన్లు ఆశ్చర్యపోతూ ఏంటి సాయి పల్లవికి బాలీవుడ్ సెలబ్రిటీలలో కూడా ఇంత క్రేజ్ ఉందా? ఇంత పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారా? అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.