Home Devotional ఈ నాలుగు మీ దగ్గర ఉంటె.. డబ్బు విపరీతంగా వస్తుంది.. అవేమిటో తప్పకుండా తెలుసుకోండి.

ఈ నాలుగు మీ దగ్గర ఉంటె.. డబ్బు విపరీతంగా వస్తుంది.. అవేమిటో తప్పకుండా తెలుసుకోండి.

ఈరోజుల్లో మనిషి కన్నా డబ్బుకే ఎక్కువ విలువ పెరిగిపోయింది అని అందరూ నోటితో అంటారు. కానీ మనసుతో చాలామంది.. ముందు వారే వారికంటే కూడా డబ్బుకు ఎక్కువ విలువ ఇచ్చుకుంటూ ఉంటారు. అయితే డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తప్పేమి కాదు. ధనలక్ష్మి కరుణ లేనిదే మనము రోజుని కాదు కదా, గంటను గడపడం కూడా చాలా కష్టంగా ఉన్న రోజులు ఇవి. అయితే డబ్బు కావాలని కోరిక, అవసరం ఉండచ్చు గాని దానిని సంపాదించాలంటే ఏమి పాటించాలో తెలియాలి.

You need these skills to ern more money.

లక్ష్మీదేవి మనల్ని కరుణించాలి అంటే, మన దగ్గర కొన్ని అర్హతలు ఉండాలి. అవి పుట్టుకతో వచ్చేవి కాదు. మనకు మనమే తెచ్చుకోవాలి. నాలుగు రూపాల్లో లక్ష్మీదేవిని మీలో పెంచుకుంటే.. ధనలక్ష్మి మీ దగ్గరకి వచ్చి కూర్చుంటుంది. 1. పట్టుదల.. ఏ జీవికైనా పట్టుదల అనేది మొదట ఉంటేనే దేనినైనా సాధించగలరు. మన పనిని సాధించడం కోసం నిరంతర కృషి చెయ్యాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, పట్టుదలను మాత్రం వదలకూడదు.

See also  Sri Rama Navami : శ్రీ రామ నవమి రోజు ప్రతి హిందువు చేయవలసిన.. చేయకూడని పనులు..

2. విద్య.. విద్య అంటే కేవలం డిగ్రీలు చదివే చదువు మాత్రమే కాదు. ఏ పని నేర్చుకున్నా.. దానిని విద్య అనే అంటారు. అందుకని చదువుకో గలిగే తెలివి, ఇంట్రెస్ట్ ఉంటె చదువుకోవడం. లేదంటే మంచి చేతి వృత్తి అయినా నేర్చుకోవడం. ఏదో ఒక విద్య మీ చేతిలో ఉంటె, మీరు ఎవ్వరి మీదా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. విద్య.. డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం కలిగిస్తుంది. 3. జ్ఞానం… జ్ఞానం అంటే అదేదో చాలా పెద్ద విద్య అని కొందరు అనుకుంటారు.

See also  Navaratri : నవరాత్రులలో ఈ పనులు గాని చేస్తే అలాంటి దరిద్రం పట్టుకుంటాదట..

అదేమీ పెద్ద బ్రహ్మండం కాదు. ఎంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటె అంత జ్ఞానం మీ దగ్గర ఉన్నట్టు. మీకు సంబంధించిన ప్రతీ విషయం పై కాకపోయినా.. వీలైనంత ఎక్కువ వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండటం వలన మిమ్మల్ని ఎవ్వరూ మోసం చెయ్యలేరు. మోసపోవడానికి అవకాశం లేకపోతే డబ్బు పోదు. అంతే కాదు విద్యకి జ్ఞానం తోడైతే ఇంకా ఎక్కువగా సంపాదించుకోవచ్చు.

4. అణుకువ.. ఈరోజుల్లో అనుకువగా ఉంటె చేతకాని వారు అనుకుని మోసం చేసేస్తారు, నోరేసుకుని పడిపోవాలని కొందరు అనుకుంటారు గాని, అది తప్పు. పట్టుదల, విద్య, జ్ఞానం ఉన్న మిమ్మల్ని ఎవ్వరూ మోసం చెయ్యలేరు. వీటికి అణుకువ తోడు అయితే, మీకు అవకాశాలు ఎదురు వస్తాయి. మీతో జర్నీ చెయ్యడానికి అవతలవాళ్ళు ఇష్టపడతారు. నలుగురితో కలిసి ఏమైనా చేస్తేనే ఎక్కువ సంపాదించగలం తప్ప ఒంటరిగా ఏమి సాధించలేము. అందుకని ధనలక్ష్మి మిమ్మల్ని కరుణించాలంటే ఈ నాలుగు మీలో ఉండేటట్టు చూసుకోండి.