Bro Movie: పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో: ది అవతార్’. జూలై 28వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ నైజాం హక్కులు ఇప్పటికే భారీ ధరకు అమ్ముడుపోయాయి. అయితే.. ఆంధ్రాలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. అంత రేటు పెట్టేందుకు ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపడం లేనట్లు తెలుస్తోంది. దీనికి కారణం అక్కడి రాజకీయ పరిస్థితులను చూపుతున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ కు ఎదురు గాలి వీస్తోంది. ఈ నేపథ్యంలో ‘బ్రో’ విడుదలకు ఆంధ్రాలో కష్టాలు ఎదురవుతాయని ఎగ్జిబిటర్లు చెప్తున్నారు.
దీనిపై సినీ విశ్లేషకులు కూడా ఎగ్జిబిటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక్క సినిమా అయినా వేగంగా పూర్తి చేయాలని భావించిన పవన్ కళ్యాణ్ ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ సినిమాను షెడ్యూల్ మేరకు కంప్లీట్ చేశాడు. మేకర్స్ కూడా అంతే వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను దాదాపుగా పూర్తి చేశారు. ఇక రిలీజ్ కు దాదాపు 15 రోజులు గడువు మాత్రమే ఉండడంతో ఆ వేగం కనిపించడం లేదు. ఎక్కడ కూడా ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ ఓపెన్ కాలేదు. టీజర్, ఒక సాంగ్ మాత్రమే రిలీజ్ చేసిన మేకర్స్ ముందుకు వెళ్లలేకపోతున్నారు.
పవన్ వారాహి యాత్రలో బిజీగా ఉండడంతో ఆయన పోర్షన్ కు సంబంధించిన కొంత డబ్బింగ్ మిగిలి ఉంది. ఇది పూర్తయితేనే ప్రమోషన్ కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ చూస్తే మాత్రం డబ్బింగ్ ఎప్పుడు పూర్తవుతుందో మేకర్స్ కే అంతుపట్టడం లేదు. ఇదంతా పక్క నుంచితే ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించి సమాచారం ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా నిర్వహిస్తారనేది ఇప్పటి వరకు తెలియడం లేదు. మరోవైపు ఓవర్సీస్బయ్యర్స్ కూడాఈ చిత్రానికి అంత ధర పెట్టలేమని చెప్తున్నట్లు తెలిసింది. ప్రొడక్షన్ హౌస్ ‘పీపుల్స్మీడియా ఫ్యాక్టరీ’ నిర్ణయించిన ధరకు అక్కడి వారు కొనేందుకు ఎటువంటి ఇంట్రస్ట్ చూపడం లేదట. ( Bro Movie )
ఇక గత్యంతరం లేక ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’నే ఓవర్సీస్లో సొంతంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని సినిమాకు సంబంధించిన సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్మరింత వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ప్రమోషన్ కూడా నిర్వహించి ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేస్తేనే ఈ సినిమా ప్రేక్షకుల మధ్యకు వెళ్లగలుతుందని, ఇటీవల పవన్ కళ్యాణ్ కు ఏపీలో ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో ఆశించినంత కలెక్షన్లను రాబట్టకపోవచ్చని తెలుస్తోంది.