త్వరలో శృతిహాసన్ పెళ్లి పీటలు ఎక్కనుందా.?
Shruti Hassan: శృతిహాసన్ అంటే కమల్ హాసన్ కూతురు అని మనందరికీ తెలుసు ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోయిన్లలో పెళ్లి కానీ హీరోయిన్ వారు శృతిహాసన్.
శృతిహాసన్ ఏ ఏ విషయాన్నైనా తన సోషల్ మీడియా ద్వారా అందరికీ చెప్పుకుంటుంది అలానే తను రిలేషన్ షిప్ లో ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.
ప్రముఖ చిత్రకారుడు ర్యాపర్ సంతు హజారికా తో ఎప్పటినుంచో రిలేషన్ షిప్ లో ఉంది ఆ విషయం తానే అధికారికంగా పోస్ట్ చేసింది. ఇక అప్పుడప్పుడు ఫెస్టివల్స్ లేదా ఎంజాయ్ చేసే ఫోటోలు, టూరింగ్ ప్లేస్ కి వెళ్ళిన ఫోటోలు, పార్టీ ఫోటోలు అన్నీ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
ముంబైలో శృతి శాంత ఒకే ఇంట్లో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటున్నారు.
శాంత అంటే శృతిహాసన్ కు చాలా ఇష్టమట శాంతతో ఉంటే సంతోషంగా ఉంటానని శృతిహాసన్ చాలా సందర్భాల్లో చెప్పింది. చాలా కాలంగా శాంత హజారికతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు శృతిహాసన్ అతన్ని పెళ్లి చేసుకోవడానికి తయారైనట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరంలోనే శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతాను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే శృతిహాసన్ ఈ వార్తలను పుకార్లుగా కొట్టి పారేయనుందా.? పెళ్లి చేసుకోబోతుందా.? వేచి చూడాలి.
మరొకవైపు కెరియర్ లో శృతిహాసన్ చాలా బిజీగా ఉంటుంది ఈ మధ్యనే విడుదలైన రెండు సీనియర్ హీరోల సినిమాలతో శృతిహాసన్ మంచి హిట్టు కొట్టింది. వాల్తేరు వీరయ్, వీర సింహ రెడ్డి. అలాగే తాజాగా శృతిహాసన్ ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమాలో కూడా నటిస్తుంది.
కాగా శృతిహాసన్ గతంలో మైఖేల్ కోర్సుల్ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది కొన్ని కారణాల చేత అతడితో శృతిహాసన్ విడిపోయింది.