Sruthi Haasan: విశ్వనటుడిగా పేరుపొందినటువంటి కమలహాసన్ కూతురు శృతి హాసన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం తను ఓ హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఓ సింగర్ గా కూడా తన కంటూ ఓ మంచి గుర్తింపు సాధించుకుంది. అలా శృతిహాసన్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో రకాల చిత్రాల లో నటించి తన నటనతో సత్తా చాటుకుని అందరిని మెప్పించింది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి నాళ్లలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన చాలా చిత్రాలు పెద్ద డిజాస్టర్ అవడం తో ఈ అమ్మడుకి సినిమా ఇండస్ట్రీ లోని వాళ్ళు ఐరన్ లెగ్ గా ముద్ర వేసేశారు.
ఇక పోతే ఎప్పుడైతే తనకు పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ చిత్రంలో హీరోయిన్ గా అవకాశం దక్కిందో అప్పటి నుంచి శృతి హాసన్ (Sruthi Haasan) దశ పూర్తిగా మారి పోయిందనే చెప్పవచ్చును. ఇక ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ కైవసం చేసుకుని ఎలాంటి సంచలనమైన రికార్డులు తిరగరాసిందో మన మందరం చూసాం.. ఇక ఈ చిత్రం అంత ఘన విజయం సాధించడంతో ఓ పక్క డైరెక్టర్ హరీష్ శంకర్ కి, మరి అదే విధంగా హీరో పవన్ కళ్యాణ్ హీరోయిన్ శృతి హాసన్ కు కూడా ఎంతో గొప్ప గుర్తింపు లభించింది. ఇక అలా వరుసగా ఆ తర్వాత శృతి హాసన్ బలుపు, రేసు గుర్రం, ఎవడు, శ్రీమంతుడు, ప్రేమమ్, క్రాక్ లాంటి మొదలైన హిట్ సినిమాల్లో నటించింది.
అయితే ఇలాంటి వరుస హిట్స్ తో మంచి జోరు మీదున్న శృతి హాసన్ ని గబ్బర్ సింగ్ చిత్రంలో తీసుకునే ముందు డైరెక్టర్ హరీష్ శంకర్ అలాగే నిర్మాత బండ్ల గణేష్ కూడా ఒప్పుకోవడానికి అస్సలు అంగీకరించలేదట. ఆమెను వాళ్ళ చిత్రంలో నటించడానికి ఒప్పుకోలేదంట.. ఇదే కాకుండా అప్పటికే బండ్ల గణేష్ ఆ హీరోయిన్ వద్దు వద్దు అని మొత్తుకున్నాడట.. ఎందుకంటే ఆమె మొదట్లో నటించిన వరుస సినిమాలు మొత్తం ఫ్లాప్ అయ్యాయి. ఇక మన సినిమాలో కూడా పెట్టుకుంటే మన సినిమా కూడా ప్లాఫ్ అవుతుంది. అందుకే అసలు ఆ హీరోయిన్ ను వద్దని మొత్తుకున్నాడట.
మరదే విధంగా హరిష్ శంకర్ కూడా నేను వేరే హీరోయిన్ కి అవకాశం ఇస్తానని మాట కూడా ఇచ్చాడట.. అందుకే ఈమెను తీసుకోవడం అస్సలు కుదరదని తేల్చి చెప్పాడట.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వీళ్ళ మాటలన్నీ వినకుండా నేను చెప్పిందే ఖచ్చితంగా ఫిక్స్.. నేను కూడా ఆ హీరోయిన్ కి మాట ఇచ్చాను అని చెప్పడంతో.. డైరెక్టర్ ప్రొడ్యూసర్ చేసేదేమీ లేక ఆ హీరోయిన్ ని గబ్బర్ సింగ్ చిత్రంలో పెట్టుకున్నారట.. కాగా ఈ చిత్రం విడుదలయ్యాక ఎంతటి సంచలనమైన విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి అప్పటి నుండే శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.