Naga Chaitanya Fell In Love: మనందరికీ తెలుసు.! సమంత నాగచైతన్య జంట టాలీవుడ్ లో ఎంత క్యూట్ పేయిర్ గా మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా పేరు తెచ్చుకున్నారో.. అక్కినేని నాగార్జునలా అక్కినేని నాగ చైతన్య తన సహ నటి ఐన సమంతను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అలాంటి వీళ్ళిద్దరు దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమించుకుని ఆ తర్వాత ఇరు కుటుంబంలోని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కానీ పట్టుమంటే ప్రేమించుకున్నంత కాలం కూడా వీళ్ళ సంసారం నిలువలేదు. నాలుగు ఏళ్ళకే వీరి కాపురం కుప్పుకూలిపోయింది. విడాకులు తీసుకుని ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు హ్యపీగా విడి పోయారు కానీ..
ఓ పక్క సమంత అభిమానులు, మరొక పక్క అక్కినేని అభిమానులే గాక.. తెలుగు ప్రేక్షకులంతా ఎంతో బాధ పడ్డారు. ఇక సోషల్ మీడియాలో ఏదైనా వీళ్ళ గురించి టాపిక్ లేవనెత్తితే ఎవరో ఒక అభిమాని మళ్ళీ మీ ఇద్దరు కలవచ్చు కదా అని కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇక ఇదే విధంగా ఇలాంటి విషయం పై గతంలో ఓ ఇటర్వ్యూలో లో భాగంగా పాల్గొన్న చైతూ ని విలేకరి అడిగిన ఓ ప్రశ్న ప్రపంచం లో ఇంతమంది అమ్మాయిలు ఉన్నా మీరు సమంతానే (Naga Chaitanya Fell In Love) ఎందుకు ప్రేమించారు అనే ప్రశ్న చైతు కు ఎదురయ్యింది. దీనికి సమంత ఏం సమాధానం చెప్పిందో మను చూద్దాం.
నాగచైతన్య రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం. ఈ చిత్రం విడుదల కాకముందు ప్రమోషన్లో భాగంగా ఓ ఇటర్వ్యూలో పాల్గొన్నారు నాగచైతన్య రకుల్ ప్రీత్ సింగ్. ఇక ఆ ఇంటర్వూలో పాల్గొన్న చైతుకు ఎదురైన ప్రశ్ననే ఇది. ఈ షోలో చైతుకు ఎదురైన ప్రశ్న ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నప్పటికీ సమంతనే ఎందుకు ప్రేమించారని సదరు విలేకరి అడగ్గా.. దానికి సమాధానం సమంతతో చెప్పిద్దామనే, లైవ్ లోనే సమంతకు కాల్ చేసాడు చైతు. అదే ప్రశ్న.. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నా నేను నిన్నే ఎందుకు ప్రేమించానని చైతు సమంతను అడుగుతాడు. (Naga Chaitanya Fell In Love)
లైవ్ లోనే సమంత మాట్లాడుతూ ఆ ప్రశ్నకు నవ్వుతూ.. ఎందుకంటే నేను నీను వేరే ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి అని నవ్వుతుంది. దాంతో వెంటనే నాగ చైతన్య నాకు నువ్వు వేరే ఆప్షన్ ఇద్దామాన్నా అది నాకు వద్దులే అంటూ వెంటనే సమాధానం చెబుతాడు. దాంతో సమంత చైతుకు ఐ లవ్ యూ అని చెబుతుంది. అలా చైతూకి సామ్ ఐ లవ్ యూ చెప్పడంతో ఆ షో కి వచ్చిన వాళ్ళంతా ఈలలు వేస్తూ గోలలు పెడుతూ నానా హంగామా చేస్తారు. ప్రస్తుతం ఈ నాగ చైతన్య సమంతల ఓల్డ్ వీడియో ఇంస్టాగ్రామ్ వేదికగా తెగ చెక్కర్లు కొడుతుంది. దాంతో వీళ్ళిద్దరి అభిమానులు ఈ వీడియోను తెగ వైరల్ చేయడం మొదలు పెట్టారు.