
Baby : తెలుగు సినీ అభిమానులు.. ఎప్పుడు ఏ సినిమాని ఎలా ఆదరిస్తున్నారో ఎవరు చెప్పలేకపోతున్నారు. భారీ బడ్జెట్లో సినిమాలను తీయాలని, విపరీతమైన ప్రమోషన్ చేయాలని, హై కాస్టింగ్ ఉన్న వాళ్లతో సినిమా చేయాలనే ( youth watching Baby movie ) అపోహల నుంచి బయటకు వచ్చేలాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు ఆడియన్స్. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు మేం కనెక్ట్ అవుతా అంటున్నారు. వేసవి సెలవులు పూర్తయిపోయి అందరూ స్కూల్స్, కాలేజీలకు వెళ్తున్న సమయంలో బేబీ సినిమా హౌస్ ఫుల్ తో నిండుతుంది అంటే.. అందరికీ ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది.
ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలో అటెండెన్స్ విపరీతంగా తగ్గుతుంది. ఏమిటా కారణమని చూస్తే.. అందరూ పొలోమని బేబీ సినిమాకి వెళ్ళిపోతున్నారు. యూత్ విపరీతంగా ఈ సినిమాని చూస్తున్నారు. ప్రేమించుకుంటున్న వాళ్ళు ( youth watching Baby movie ) మాత్రమే కాకుండా, ప్రేమలో విడిపోయి బాధలో ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ప్రేమించుకోవాలని ఆలోచనలో ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. కొత్తగా ఇప్పుడే ప్రేమలో పడ్డవాళ్ళు కూడా కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ప్రతి ఒక్కరిని ఏదో రూపంలో కనెక్ట్ చేసుకుంటుంది. నేటి యువతరంలో ఉన్న సమస్యలను పూర్తిగా బాగా లోతుగా వెళ్లి చూపించడంతో యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ నటన అయితే ఎక్స్లెంట్ అని చెప్పుకోవాలి. సినిమా తీసే విధానంలో, కథలో కొన్నిచోట్ల అక్కడక్కడ దర్శకుడు తడబడినట్టు అనిపించినా కూడా.. పూర్తిగా ఒకవైపే దర్శకుడు నిలబడలేకపోయాడు అనిపించినా కూడా.. అందరిని ( youth watching Baby movie ) ఆకట్టుకున్నాడు. యూత్ అయితే ఈ సినిమాలో హీరోయిన్ ని విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఆమె పాత్ర, ఆమె నటనకు బాగా కనెక్ట్ అవుతున్నారు. అలాగే ఆనంద్ పాత్ర చూసి.. అబ్బాయిలందరూ వాళ్లు కూడా అలాగే నష్టపోతున్నట్టు ఫీలవుతున్నారు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయే సీన్తో కుర్రాళ్ళు ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు.
ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్ ని మేడ మీదకు పిలిచి తిట్టిన సీన్ అయితే అబ్బాయిలను తెగ ఆకట్టుకుంది. ప్రతి అబ్బాయి ఎప్పటినుంచో ఏదో ఒక అమ్మాయిని తిట్టాలనే ఆశ ఈ సినిమాలో, ఆ సీన్ ద్వారా తీరిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అందుకే అబ్బాయిలైతే మాత్రం రిపీట్ రిపీట్ గా.. మళ్లీ అమ్మాయిల్ని వేసుకొని మరీ.. ఈ సినిమాని తెగ చూసేస్తున్నారు. నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా సినిమాని కథ చేసుకుని.. తనదైన శైలిలో తీసి.. నిజంగా ఎటువంటి భారీ బడ్జెట్లో లేకుండా.. పెద్ద పెద్ద హీరో, హీరోయిన్స్ లేకుండా.. భారీ ప్రమోషన్ లేకుండా.. కంటెంట్ తోనే తన సక్సెస్ ని చూపించాడు దర్శకుడు సాయి రాజేష్. ఇక ఈ సినిమా ఇలాగే గాని దూసుకుపోతే.. భారీ కలెక్షన్లతో ఈ సినిమాను అనుమానించి కొనుక్కోని బయ్యర్స్ అందరూ కూడా విపరీతంగా బాధపడాల్సిన సిట్యువేషన్ అయితే ఎదురవ్వక తప్పదు.