Home Cinema Adipurush: ఇంత చిన్న లాజిక్ ఆదిపురుష్ టీం ఎలా మిస్ అయింది! ఇలా అయితే కష్టమే..

Adipurush: ఇంత చిన్న లాజిక్ ఆదిపురుష్ టీం ఎలా మిస్ అయింది! ఇలా అయితే కష్టమే..

why-adipurush-movie-team-missed-this-logic-and-did-a-mistake

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమా రూపొందుతున్నట్టు మనందరికీ తెలిసిందే. ఆ శ్రీరామచంద్రుడి కథతో జూన్ 16న ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం ఆది పురుష్ సినిమా టీం వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. అందులో ( Why Adipurush movie team ) భాగంగానే ఈ సినిమా టీజర్, ట్రైలర్, రెండు పాటలు కూడా విడుదల చేశారు. విడుదల చేసిన ప్రతి దానికి కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని ఎలాగైనా గ్రాండ్ సక్సెస్ చేసుకోవాలని.. భారత దేశ చరిత్రలో ఇదొక మంచి సినిమాగా మిగిలిపోవాలని.. సినిమా బడ్జెట్లో కూడా ఎటువంటి లోపం చేయకుండా ముందడుగు వేస్తుంది సినిమా టీం.

why-adipurush-movie-team-missed-this-logic-and-did-a-mistake

ఇంత బాగా ప్లాన్ చేసుకున్న ఈ సినిమా టీం ఒక విషయంలో చాలా పెద్ద మిస్టేకే చేసిందని అనిపిస్తుంది. సాధారణంగా ఏ సినిమా నైనా ప్రేక్షకులు చూడాలి అంటే అందులో ఏదో ఒక పరమైన ఒక సన్నివేశం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడం కోసం కానీ.. ఆ వచ్చే సన్నివేశం ఎలా ఉండబోతుంది అని ఆత్రుతతో గాని సినిమాని చూస్తారు. లేదా ( Why Adipurush movie team ) తెలియని కథ అయితే.. ఎప్పటికప్పుడు ఆ కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ చూస్తారు కానీ.. ఆది పురుష సినిమా అలా కాదు. ఆ శ్రీరామచంద్రుని కథని ఇప్పటికే రామాయణంగా చదువుతూ.. అలాగే శ్రీరాముడు కథపై ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క ప్రత్యేకమైన సినిమాలు ఎన్నో ఇప్పటికి రిలీజ్ అయ్యి.. వాటిలో సూపర్ సక్సెస్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.

See also  Samantha: సినిమా ఇండస్ట్రీ లోనే ఎవ్వరూ చెయ్యలేని సాహసం చేసిన సమంత.

why-adipurush-movie-team-missed-this-logic-and-did-a-mistake

సినిమాలు మాత్రమే కాదు రామాయణం పై టీవీ సీరియల్ కూడా ఎంత సూపర్ హిట్ అయిందో.. అందులో నటించే రాముడిని సీతని ఇప్పటివరకు జనం ఎంతగా గుర్తుంచుకున్నారో.. వాళ్ల పేర్లు ఇప్పటికీ కూడా రామ్, సీత అనే అనిపించుకునే అంత హిట్ అయిందా సీరియల్. అలాంటి కథను పట్టుకొని ఇప్పుడు మళ్లీ ప్రభాస్ తో సినిమా తీస్తున్నారు. అయితే రామాయణంలో ఉన్న గొప్పతనం ఏంటంటే.. ఎంతమంది ఎన్నిసార్లు తీసినా కూడా.. దాన్ని ఆడియన్స్ ఆదరిస్తారు, గ్రాండ్ సక్సెస్ కూడా చేస్తారు. కారణం ఎప్పటికప్పుడు.. ఆ గొప్ప కావ్యాల్లో ప్రతి రిలేషన్ ఎవరికి వారు ఎలా నటించారో చూస్తూ.. దాన్ని ఫీల్ ( Why Adipurush movie team ) అవుతూ సినిమాని ఆదరిస్తారు. అంటే ఆది పురుష్ సినిమాలో కూడా సినిమా కథ ప్రతి ఒక్కరికి తెలుసుగానీ.. ఈ ఘట్టాన్ని ఈ సమయంలో ఈ ఆర్టిస్టు ఎలా నటించాడు? ముఖ్యంగా రామాయణంలో చివరి ఘట్టం సీతారాములు కలయిక.. వాళ్ళిద్దరూ కలిసేటప్పుడు ఇందులో ఆ పాత్రలో ఎలా భావోద్వేగాలని చూపించాయి అనే దానిపై ఆసక్తి ఉంటది.

See also  Niharika : విడాకుల తరవాత నిహారిక అతనికోసం స్వయంగా వేసుకున్న మచ్చట..

why-adipurush-movie-team-missed-this-logic-and-did-a-mistake

అలాంటిది ఆది పురుష్ సినిమా టీం రిలీజ్ చేసిన పాటల్లో ముఖ్యంగా రాం సీతా రాం అనే పాటలో చాలా ముఖ్యమైన ఘటనలన్నీ ఓపెన్ గా చూపించేశారు. సీతారాములు చివరగా కలిసిన సీన్ కూడా ఇంచుమించుగా చూపించేశారు. ఇలా ముఖ్యమైన ఘటనలన్నీ ముందే చూపించేస్తే.. సినిమా చూసేటప్పుడు అబ్బా ఈ సీన్ చాలా బాగుంది దీని గురించి మళ్లీ చూడాలని.. లేకపోతే ఎవరికైనా చూడమని చెప్పాలని ఫీల్ అవ్వడానికి ఉన్న అవకాశాన్ని పాడు చేశారనే అనిపిస్తుంది. ప్రమోషన్ అనేది ముఖ్యమే గానీ.. దాన్ని సినిమాలో ఉన్న ప్రైవసీ మొత్తాన్ని ఓపెన్ చేసి చూపించేస్తే.. నష్టమే. ప్రమోషన్ అయితే సక్సెస్ అయ్యింది ఎందుకంటే.. ఆది పురుష్ మీద అంత ఎస్టిమేషన్ మొదట్లో లేనప్పటికీ.. వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్,పాటలు చూసి దానిమీద ఆసక్తి విపరీతంగా పెరిగింది. కానీ ఆ ఆసక్తి మీద సక్సెస్ సాధించాలంటే.. సినిమాలో కొంత ప్రైవసీ అనేది ఉండాలి. దాన్ని ముందుగానే రివీల్ చేయడం అనేది కరెక్ట్ కాదని అందరూ అనుకుంటున్నారు. ఇంత చిన్న లాజిక్ ని ఆదిపురుష్ టీమ్ ఎలా మిస్ అయింది? ఇలా అయితే కష్టమే అని వాపోతున్నారు.