Nagachaitanya – Samantha: అతి తక్కువ సమయంలో సినీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది సమంత. దాదాపు 8 సంవత్సరాల పాటు తెలుగు సినీ రంగంతోపాటు అటు సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలేసింది. అలాంటి సమంతకు గత సంవత్సర కాలంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొనవలసి వస్తుంది. హీరో నాగచైతన్యకు ఎప్పుడైతే విడాకులు ఇచ్చేసిందో అప్పటి నుంచి సమంత జీవితంలో అద్భుతాలనేవి జరగలేదు. చేతిలో పేరుకి హాలీవుడ్ ప్రాజెక్టులు అంటున్నా వాటి గురించి ఎవ్వరూ పట్టించుకోవడమే లేదు.
యశోద సినిమాతో కొంచెం కష్టపడినప్పటికీ.. ప్రస్తుతం రిలీజ్ అవుతున్న శాకుంతల సినిమా డేట్ కన్ఫర్మ్ కాలేక పోతుంది. పైగా సమంత మార్కెట్తో పోలిస్తే ఇది ఓవర్ బడ్జెట్ అంటున్నారు. నాగచైతన్య తో తెగదింపులయ్యాక సమంత ఆరోగ్యపరంగా పడుతున్న ఇబ్బందులు ఎన్నో ఇటు తన వ్యక్తిగత జీవితం అంతా ప్రస్తుతం అల్ల కల్లోలమైపోయింది. చైతుతో విడాకులు ఒక ఎత్తు అయితే ఆమె మయోసైటిస్ లాంటి అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉడడం ఆమె జీవితానికి ఒక అడ్డంకిగా ఏర్పడింది. ఈ వ్యాధితో ఆమె విజయ్ దేవరకొండతో చేయబోయే ఖుషి ప్రాజెక్టు బ్రేక్ పడింది.
ఇదేకాక ఆమె బాలీవుడ్ – హాలీవుడ్ ప్రాజెక్టులు ఎప్పుడూ సెట్స్ మీదకు వెళతాయో అందులో ఆమె ఎప్పుడు జాయిన్ అవుతుందో కూడా తెలియడం లేదు. ప్రస్తుతం అసలు విషయానికొస్తే… సామ్ చైతు విడాకుల వెనకాల కొన్ని స్టోరీలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఆమె నటించిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో హద్దులు దాటడం అక్కినేని కుటుంబానికి నచ్చకపోవడం, దానికి తోడు అమల సమంతపై కఠినమైన ఆంక్షలు చైతు కు విడాకులు ఇవ్వడానికి కారణం అయ్యాయి అనుకున్నారు. అయితే సమంతా ఈ మనస్పర్ధల తర్వాత చైతుకు దాదాపు ఆరు నెలల పాటు దూరంగానే ఉంది.
అదే సమయంలో చైతుకు శోభిత దూల్లపాటితో వ్యవహారం నడిపేసారట… ఆమెతో హద్దులు మీది ప్రవర్తిస్తున్న విషయం సమంతతో సన్నిహితంగా ఉండే కొంతమంది ఆమె చెవిలో వేసారట. సమంత ఎప్పుడు ఆమె చుట్టుపక్కల ఉంటూ తనతో స్నేహపూర్వకంగా ఉండే వారి మాటలే ఎక్కువగా వింటుందని టాక్ ఉంది. చైతు విషయంలో కూడా ఆమె బాగా ఇగో పెంచుకోవడం వెనుక వాళ్లే ఉన్నారని గుసగుసలు కూడా ఉన్నాయి.
శోభిత – చైతు క్లోజ్ గా ఉన్న విషయం సమంత మెదడులోకి ఎక్కించడంతో చైతుకు మరింత కోపం పెరిగి విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందట. అంతకుముందు సమంత-చైతు ఎంతో అన్యోన్యంగా మురళీమోహన్ ఉంటున్న పెంట్ హౌస్ పై ప్లాట్ లోనే చాలా ఆనందంగా ఉండేవారు కానీ పక్కన ఉన్న వాళ్ళు పుల్లలు పెట్టడం వల్ల సమంత వాటిని బాగా నమ్మడం వల్ల జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది.