NTR BP: నందమూరి నట వారసునిగా వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ గా, తారక్ గా తను ఏంటో నిరూపించుకుని తన పాపులారిటీని సంపాదించుకున్నాడు. స్వతహగా తన టాలెంట్ తో ఇండస్ట్రీలో తనేంటో నిరూపించుకున్నాడు తప్ప ఏనాడు తన బ్యాక్ గ్రౌండ్ వాడుకోవాలని ప్రయత్నించలేదు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంతరించుకుందో మనందరికీ బాగా తెలుసు. నిన్ను చూడాలని.. చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి మంచి హీరోగా గుర్తింపు పొందాడు.
ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు. అలా హిట్స్ ఫ్లాప్స్ అంటూ సంబంధం లేకుండా వరుసగా చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో హీరోగా చలామణి అవుతూ గ్లోబల్ స్థాయిలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న తారక్ గురించి నెట్టింట ఒక ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ గా అవుతుంది. మనందరికీ తెలిసిందే తారక్ చాలా కోపం ఎక్కువ.. తనకు ఎంత కోపం ఉన్నప్పటికీ దానికి రెట్టింపు ప్రేమ జాలి చూపిస్తుంటాడు. ఇక తారక్ కు చిన్న తనం నుంచి కొన్ని మాటలు అంటే అస్సలు ఇష్టం ఉండదట.
మరి అలాంటి మాటలు ఏంటి? ఎందుకు ఇష్టం ఉండదు? అనేది ఇప్పుడు చూద్దాం. తారక్ ముందు చిన్నతనం నుండే ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే వెంటనే వాళ్లతో గొడవలు పెట్టుకోవడమా లేక వారిని పూర్తిగా దూరం పెట్టడం చేస్తాడట. ఇక ఇదేకాక సడన్ గా ఆయన బిపి (NTR BP) హద్దులు దాటి 170 కి చేరిపోతుందట. మరి ఏంటి అసలు ఎందుకు అలా జరుగుతుందంటే.. తారక్ మొదటి నుంచి స్త్రీలు అన్నా స్త్రీల గురించి ఏ విషయంలోనైనా చాలా గౌరవం గౌరవిస్తుంటాడు. అలానే పెంచింది తన తల్లి షాలిని గారు.. ఇలా ఎవరన్నా తన ముందు ఆడవాళ్ళ గురించి వల్గర్ కామెంట్ చేస్తున్నా.. వాళ్ళ ముందు వల్గర్ డైలాగ్స్ చెప్పినా..
ఇదే కాకుండా అమ్మాయిల తో అసభ్యంగా ప్రవర్తించిన ఆడవాళ్ళ ప్రైవేట్ బాడీ పార్ట్స్ గురించి ఏదైనా చీప్ గా దారుణమైన కామెంట్స్ చేస్తే తారక అస్సలు ఊరుకునేవాడు కాదట. ఇక అతను ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే చెంప చెల్లుమనిపిస్తాడట. లేదంటే వాళ్లతో జీవితంలో కూడా మాట్లాడే వాడు కాదట ఇదేఖ మనం మొదటి నుండి గమనిస్తూనే ఉన్నాం.. తారక్ తను నటించే చిత్రాలలో ఉండే ఏ చిన్న క్యారెక్టర్ లో ఉన్న స్త్రీ లను ఐనా చాలా గౌరవిస్తూ ఉంటాడట. అలాంటి స్త్రీలను ఎప్పుడు కించపరిచే విధంగా అసలు మాట్లాడడు. ఎవరైనా ఒక వేళ తన ముందు మాట్లాడితే మాత్రం కచ్చితంగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేవాడట. ఇలాంటి హీరో మన ఇండస్ట్రీలో ఉండడం మనకు గర్వకారణం..