
Best Director : ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరి హవా సాగుతుంద. ఒక టైంలో దర్శకుడు, నిర్మాణ సంస్థ.. ఇలాంటి వాటిని బట్టి ఆ సినిమాకు విలువ ఉండేది. ఆ తర్వాత కొంతకాలం అందులో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అనే దాన్ని ( Who is your best director ) బట్టి సినిమాకి క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ముఖ్యంగా అన్నిటికంటే దర్శకుడికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. పలానా దర్శకుడు సినిమా అనగానే విపరీతంగా అంచనాలను పెంచుకుంటున్నారు. అలాంటి దర్శకుడితో వాళ్ళ హీరో సినిమా చేస్తే బాగుణ్ణు అని అనుకుంటున్నారు. ఇప్పుడు దర్శకులే హీరోలు.. అయితే ఇప్పటి దర్శకల్లో ఎవరిని ఎక్కువగా అందరూ ఇష్టపడుతున్నారు? ఏ దర్శకుడిని బెస్ట్ అంటున్నారు అంటే ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని బెస్ట్ అంటున్నారు. వాళ్ళ ఇష్టా ఇష్టాలను బట్టి, వాళ్ళ మనస్తత్వాలకు నచ్చేట్టుగా తీసిన దర్శకుడు ఎన్నుకుంటున్నారు.
ప్రజెంట్ సోషల్ మీడియాలో నలుగురు దర్శకుల మాటలు వినిపిస్తున్నాయి.1. రాజమౌళి, 2. సుకుమార్, 3. సందీప్ రెడ్డి వంగ, 4. ప్రశాంత్ నీల్.. ఈ నలుగురు దర్శకత్వంలో ఎవరు బెస్ట్ అంటూ చర్చలు జరుగుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. రాజమౌళి సినిమాలో పలానా హీరో మాత్రమే ఉండాలి, పలానా జోనర్ మాత్రమే చేయాలి, ఇంత బడ్జెట్ లోనే చేయాలి అని గాని ఎలాంటి రూల్స్ లేవు. ఆయన ( Who is your best director ) పెద్ద పెద్ద స్టార్ హీరో తోను సినిమా చేసి సక్సెస్ కొట్టగలడు. సునీల్, నాని లాంటి హీరోలతో కూడా సక్సెస్ కొట్టగలడు. హై బడ్జెట్ తో వందల కోట్లతో సినిమా తీయగలడు.. అలాగే లో బడ్జెట్ లో కూడా సినిమా తీయగలడు. చివరికి ఒక ఈగని కూడా హీరోయిజం తో చూపించగలడు. అతని సినిమాలో టెక్నాలజీ, ట్రెడిషన్, సెంటిమెంట్, ఒక ఎథిక్ అన్ని కూడా కనిపించేలా సినిమా తీయగల సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి. ఆ ఆ జోనర్ లను ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా రాజమౌళికే ఓటేస్తారు..
సుకుమార్.. సుకుమార్ అంటేనే లెక్కలు మాస్టారు. లాజికల్ మాస్టారు.. ఆయన సినిమాలో అందరికీ నచ్చేది లాజిక్. ఆయన సినిమాని అర్థం చేసుకోవాలంటే కాన్సన్ట్రేషన్ అంతా సినిమా మీద పెట్టాలి. ఏమాత్రం ఏదో ఆలోచిస్తూ చూస్తున్నా కూడా ఎక్కడో ఒకచోట లెక్క తప్పి.. లాజిక్ మిస్ అయిపోతాం.సుకుమార్ ఒక విభిన్న స్టైల్ లో హీరో ని చూపిస్తూ.. ఒక ప్లేస్ ని హీరోలో లుక్ ని మార్చి కథను ఎలా తీసినా కూడా ( Who is your best director ) ఆ కథ కొత్తదనం అనిపించేలా చేసి తన సక్సెస్ ని చాలా తెలివిగా , లాజికల్ గా ప్రేక్షకుల నుంచి లాక్కోగలిగేంత తెలివైన దర్శకుడు సుకుమార్. ఈ తెలివైన దర్శకుని ఇష్టపడే జోనర్లో ఉన్నవాళ్లు ఆయన్ని ఇష్టపడతారు. ఇకపోతే సందీప్ రెడ్డి వంగ ఈ దర్శకుడు రియాలిటీ కి చాలా దూరంగా ఉంటాడని, చాలా వైలెన్స్ అండ్ భయంకరంగా సినిమాలు తీస్తాడని పేరు పొందాడు. అయితే రియాల్టీకి దూరంగా ఉంటాడో లేదా అలాంటి భయంకరమైన రియాలిటీ మనకి కనిపించట్లేదో కానీ.. ప్రజంట్ ఇతను సక్సెస్ లో ఉన్నాడు.
సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే ఒక సంచలనం. అందరూ ఆశ్చర్యపోతూ చూడాల్సిన సినిమానే. అతను సినిమాని అలాంటి జోనర్ ని ఇష్టపడే ప్రేక్షకులు కచ్చితంగా సందీప్ రెడ్డివంగకే ఓటు వేస్తారు. కే జి ఎఫ్ సినిమాలు సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం చాలా బెస్ట్ గా చేస్తాడు. అలాగే హీరోని ఒక మంచి హీరోయిజం ఉన్న లుక్ లో బాగా కొత్తగా ప్రజెంట్ చేస్తాడు కూడా.. అయినా కూడా చూసిందే చూడాలంటే కొందరికి బోర్ కొడుతున్నట్టు అనిపిస్తుంది. మొత్తం మీద ఈసారి ప్రశాంత నీల్ దర్శకతంలో ప్రభాస్ హీరోగా మంచి సినిమా మనకి అందిస్తాడని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మీకు బెస్ట్ డిరెక్టర్ ఎవరు అనేది కామెంట్ చేయండి.