Home Devotional Sri Rama Navami : శ్రీ రామ నవమి రోజు ప్రతి హిందువు చేయవలసిన.. చేయకూడని...

Sri Rama Navami : శ్రీ రామ నవమి రోజు ప్రతి హిందువు చేయవలసిన.. చేయకూడని పనులు..

Sri Rama Navami : శ్రీరామనవమి పండుగ మన హిందువులకు ఎంతో ముఖ్యమైన రోజు. మానవజాతి ఎలా బ్రతకాలో తెలియజేయడానికే .. ఎటువంటి శక్తులు లేనివాడిగా రాముని అవతారం ఎత్తాడు ఆ భగవంతుడు. శ్రీరామనవమి రోజున ( What rules should we fallow in Sri Rama Navami  ) రాముడి పుట్టినరోజు, 14 సంవత్సరాల వనవాసం తరవాత పట్టాభిషేకం జరిగిన రోజు , శ్రీరాముని పెళ్లి రోజు కూడా ఈరోజునే అని మన పురాణాలు చెబుతున్నాయి. హిందువులు అందరూ ఈ పండుగను ఎంతో వేడుకతో చేసుకుంటారు. అసలు శ్రీరామనవమి రోజు ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో తెలుసుకుందాం..

See also  Hanuman Jayanthi 2023: నేడు హనుమాన్ జయంతి లో ఈ చిన్న పని చేస్తే.. కొన్ని రాసులవారి పై హనుమాన్ కృపతో ఈ యోగం కలుగుతుంది..

what-rules-should-we-fallow-in-sri-rama-navami

శ్రీరామనవమి ఈ ఏడాది మర్చి 30 వ తేదీ గురువారం వచ్చింది. ఈరోజు పొద్దుటే సూర్యోదయంతో లేచి, ఇంటిని శుభ్రం చేసుకుని, తలకు స్నానమాచరించి, ఇంటి బయట రంగుల ముగ్గు పెట్టుకోవాలి. శ్రీరామపట్టాభిషేకం చిత్రపటాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి. ఈరోజు ఆరోగ్య రీత్యా సమస్యలు లేనివారు ఉపవాసం ఉంటె మంచిది. పూజకు కావాల్సిన అన్ని వస్తువులను సిద్ధం చేసుకోవాలి. ప్రసాదాలలో వడపప్పు, పానకం చాల ముఖ్యం. వీటితో పాటు పులిహార, పరవన్నం, బూరెలు నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలి.

what-rules-should-we-fallow-in-sri-rama-navami

ఈ పండుగ రోజున ఇంట్లో శ్రీరాముని కళ్యాణం చేయించుకుంటే మంచిది. పూజారిని పిలిపించి కళ్యాణం చేయించుకునే శక్తి లేని వారు కనీసం ఎక్కడైనా గుడిలో కళ్యాణం ( What rules should we fallow in Sri Rama Navami ) జరుగుతుంటే చూడటం మంచిది. అలాగే కళ్యాణ అక్షింతలు తలపై వేసుకోవాలి. ముఖ్యంగా పెళ్లికానివారికి వేస్తే, కళ్యాణం తొందరగా జరుగుతాదని అంటారు. ఈరోజు అన్నదానం చేస్తే చాలా మంచిది. శ్రీ రామ పట్టాభిషేకం కథను చదవటం గాని, వినడం గాని చెయ్యాలి. శ్రీరామ అష్టోత్తరం చదువుకోవాలి. ఒకవేళ ఏమీ చదవలేకపోయినా కనీసం రామ రామ అని మనసులో అనుకుంటూ ఉండాలి.

See also  Navaratri : నవరాత్రులలో ఈ పనులు గాని చేస్తే అలాంటి దరిద్రం పట్టుకుంటాదట..

what-rules-should-we-fallow-in-sri-rama-navami

ఇక శ్రీరామనవమి రోజున మాంసాహారం తినకూడదు, అబద్ధం చెప్ప కూడదు, తల్లి తండ్రుల మాటకి విలువ ఇవ్వడం.. భార్యా , భర్తలు ఒకరి పట్ల ఒకరు నమ్మకం తో వుండడం.. సోదరుల పట్ల వాత్సల్యం ఉండాలి.. అలాగే మనకంటే చిన్న వాళ్ల పట్ల ప్రేమ, పెద్దవారి పట్ల గౌరవం కలిగి ఉండటం ఉత్తమ మానవ లక్షణం. ఈరోజుల్లో ప్రతి రోజు ఇలా ఉండటం కాస్త కష్టమే.. అందుకే కనీసం ఇలాంటి పర్వ దినాలలో అయినా రాముడు చూపిన ఆదర్శ మార్గంలో నడవడం మనకే మంచిది.