Home Cinema Sharwanand – Ram Charan : శర్వానంద్ పెళ్ళిలో రామ్ చరణ్ ఎంత పనిచేసాడంటే..

Sharwanand – Ram Charan : శర్వానంద్ పెళ్ళిలో రామ్ చరణ్ ఎంత పనిచేసాడంటే..

what-ram-charan-did-in-sharvanand-marriage

Sharwanand – Ram Charan : యంగ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ పెళ్లి ఎప్పుడు అని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో జూన్ మూడో తేదీ ఎంతో వైభవంగా జరిగింది. ఈ పెళ్లి రాజస్థాన్లోని జైపూర్ లో ఉన్న లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. శర్వానంద్ కి రక్షిత రెడ్డి అనే అమ్మాయితో జనవరి 26న నిశ్చితార్థం ( Ram Charan in Sharvanand marriage ) జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మొదట్లో శర్వానంద్ ఎంగేజ్మెంట్ అని వినగానే ఎవరిని చేసుకుంటున్నాడా అని ఎంతో ఆసక్తిగా అందరూ ఎదురు చూశారు. ఆ అమ్మాయి ని శర్వానంద్ ముందుగానే ప్రేమించాడా లేదా పెద్దలు కుదిరిచ్చిన వివాహమా? అని అనుమానంగా ఉండేవారు. మొదట్లో శర్వానంద్ ప్రేమించాడని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు హల్చల్ చేశాయి.

what-ram-charan-did-in-sharvanand-marriage

పైగా ఆ అమ్మాయి తన చిన్నప్పుడు క్లాస్మేట్ అని.. అప్పటినుంచి ప్రేమిస్తూ ఇప్పుడు కెరియర్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నాడని తెగ వార్తలు వచ్చాయి. కానీ వీటన్నిటిలో ఎలాంటి నిజం లేదు. శర్వానంద్ పెళ్లి పెద్దలు కుదిర్చిన సంబంధం. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి అమ్మాయి శర్వానంద్ ( Ram Charan in Sharvanand marriage ) భార్య రక్షిత రెడ్డి. పిల్లలన్నాక ఎన్నో ముచ్చట్లు, సరదాలు అన్నీ ఉంటాయి. ఈ రోజుల్లో పెళ్లిని సామాన్యుల సైతం ప్రతి సాంప్రదాయాన్ని ఎంతో వేడుకగా అందరూ కలిసి ఆనందంగా ప్లాన్డ్ గా చేసుకుంటున్నారు. ప్రతి ఫంక్షన్ కి అందరూ మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకొని.. ఎంతో వైభవంగా చేసుకుంటున్నారు. అలాగే శర్వానంద్ పెళ్లి లో కూడా ప్రతిదీ చాలా అందంగా చేసుకున్నారు.

See also  Vijay Antony daughter: విజయ్ ఆంటోనీ కూతురు మీరా సూసైడ్ పై భయంకరమైన నిజాలు బయటపెట్టిన టీచర్..

what-ram-charan-did-in-sharvanand-marriage

శర్వానంద్ నిశ్చితార్థం కూడా జనవరి 26వ తేదీన ఎంతో వైభవంగానే జరిగింది. అప్పుడు కూడా సినీ ప్రముఖులు ఎందరో హాజరయ్యారు. ఆ ఫోటోలను చూస్తూ చాలా రోజులు మళ్లీ శర్వానంద్ పెళ్లి ఎప్పుడు అని అభిమానులు ఎదురుచూస్తూ వచ్చారు. శర్వానంద్ నిశ్చితార్థం జనవరి 26నైతే.. పెళ్లి జూన్ మూడో తేదీన అయ్యే లోపు ఎన్నో మాటలు, ఎన్నో ప్రచారాలు, ఎన్నో అనుమానాలు కూడా తలెత్తాయి. శర్వానంద్ పెళ్లి అన్నిటికంటే ( Ram Charan in Sharvanand marriage ) వేడుకగా జరిగింది సంగీత్ అని అందరు అంటున్నారు. శర్వానంద్.. తన సంగీత్ లో వాల్తేరు వీరయ్య సినిమా నుంచి డోంట్ స్టాప్ మ్యూజిక్ పూణకాలు లోడింగ్ అనే పాట కి డాన్స్ చేశాడంట. వాల్తేరు వీరయ్య ఈ సినిమాలో డోంట్ స్టాప్ మ్యూజిక్ పూనకాల్ లోడింగ్ అనే పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇటీవల కాలంలో ఎక్కడ ఏ వేడుక జరిగినా ఈ పాట పెట్టుకొని అందరూ విపరీతంగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

See also  Pawan Kalyan : దరిద్రానికే దరిచేరుతానంటున్న పవన్ కళ్యాణ్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ !

what-ram-charan-did-in-sharvanand-marriage

అలాగే శర్వానంద్ సంగత్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అటెండ్ అయ్యాడు అంట. రామ్ చరణ్ కూడా సంగీత్ లో డాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నాడట. అయితే రామ్ చరణ్ స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో లీక్ అయిందంటూ వార్తలు వచ్చాయి. ఇక మెగా అభిమానులైతే మా హీరో శర్వానంద్ సంగీత్ లో డాన్స్ చేశాడా అంటూ గంతులు వేస్తున్నారు. ఇక శర్వానంద్ అభిమానులైతే మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డాన్స్ వేస్తే.. ఇంక మా హీరో వైపు ఎవరు చూస్తారు? పెళ్లి కొడుకుని కూడా రామ్ చరణ్ డామినేట్ చేసేసాడు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా.. రామ్ చరణ్, శర్వానంద్ తో ఫ్రెండ్షిప్ కి అంత వాల్యూ ఇచ్చి.. సగటు మనిషిగా ఎంతో ఆనందంగా తన ఆనందంలో పాలుపంచుకొని డాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది నిజంగా మెగా అభిమానులందరూ రామ్ చరణ్ మనస్తత్వానికి గర్వించదగ్గ విషయమని అందరూ అనుకుంటున్నారు.