Home Cinema VarunLav: ఏంటీ. పెళ్లికి ముందే లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ లకు గొడవలా.? కారణం...

VarunLav: ఏంటీ. పెళ్లికి ముందే లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ లకు గొడవలా.? కారణం ఆ హీరోనా.?

VarunLav: తెలుగు సినీ ప్రపంచంలోకి అందాల రాక్షసి సినిమాతో అడుగు పెట్టింది లావణ్య త్రిపాఠి. అచ్చం మన తెలుగు అమ్మాయిలా కనిపించి అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. ఆశించిన స్థాయిలో పలు చిత్రాలలో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ గా హోదా దక్కించుకోలేక పోయింది. ఇక మెగా హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ( Lavanya Tripathi – Varun Tej) మధ్య దాదాపు గత మూడేళ్లుగా ప్రేమాయణం సాగుతుందని ఎన్నో రకాల వార్తలు ఇటు సోషల్ మీడియాలోనూ అటు వెబ్ మీడియాలోనూ గుస గుసలు పెట్టాయి. ఎన్నో సార్లు వీళ్ళ ప్రేమ విషయం ఎదురవగా ఆ వార్తలను వీళ్ళు ఇద్దరు కొట్టి పడేసినప్పటికీ..

what-lavanya-tripathi-varun-tej-had-a-fight-before-the-wedding

ఎట్టకేలకు వాటిని నిజం చేస్తూ వీళ్లిద్దరూ అందరూ షాక్ కు గురయ్యేలా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది చివర్లో వీళ్లిద్దరి వివాహం అనే బంధం తో ఈ జంట ఒక్కటి అవ్వబోతున్నారు. ఇటీవలే జరిగిన వీళ్ళ నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా ఇరు కుటుంబ బంధు మిత్రుల సమక్షంలో జరిగింది. వీళ్లు చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారండోయ్.. ఎందుకంటే అందరిలా తొందరపడి కాకుండా.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకనే దాదాపు ఏడేళ్లుగా డేటింగ్ చేస్తూ.. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాతే వీళ్ళిద్దరూ ఒకటవ్వాలని నిశ్చయించుకున్నారట. అయితే అసలు ఇన్నేళ్ళుగా ప్రేమలో ఉన్న విల్లా మధ్య మరి గొడవలు ఎందుకు వచ్చాయి అంటే..

See also  Varun Tej - Lavanya Tripathi : వరుణ్ లావణ్యల ఎంగేజిమెంట్ ఆ స్పెషల్ డే లోనే ఫిక్స్.. ఎవరి ఆధ్వర్యంలోనో తెలుసా?

what-lavanya-tripathi-varun-tej-had-a-fight-before-the-wedding

గతంలో లావణ్య త్రిపాఠికి వరుణ్ తేజ్ ( Lavanya Tripathi – Varun Tej) మధ్యన ఒక హీరో విషయంలో చాలా పెద్ద గొడవ జరిగిందట. ఇక ఆ హీరో ఎవరో కాదు విజయ్ దేవరకొండ. విజయ్ నటిస్తున్న ఓ చిత్రంలో దర్శకుడు పరశురామ్ మొదట రష్మిక కాకుండా లావణ్య త్రిపాఠిను హీరోయిన్ గా తీసుకోవాలని ఆలోచించాడట.. అయితే కథ పరంగా బాగున్నప్పటికీ విజయ్ దేవరకొండ అంటే లిక్ లాక్ లు బాగానే ఉంటాయని భావించిన వరుణ్.. నువ్వు ఆ చిత్రంలో చేయడం నాకు అస్సలు ఇష్టం లేదని లావణ్య త్రిపాఠి కి చెప్పాడట. అయితే ఆ చిత్రం మొత్తం మీద ఉన్న లిప్ లాక్ ల సంఖ్య ఒకే ఒక్కటి. కేవలం ఒక్క లిప్ లాక్ సీన్ ఉండడంతో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు.

See also  Daggubati Rana: పెళ్ళయిన మూడేళ్లకే సంచలనమైన నిర్ణయం తీసుకున్న రానా దంపతులు.. షాక్ లో దగ్గుబాటి కుటుంబం.

what-lavanya-tripathi-varun-tej-had-a-fight-before-the-wedding

ఇది తన సినీ కెరీర్ కి బాగా ఉపయోగ పడుతుందని వరుణ్ తేజ్ ను లావణ్య ఎంత నచ్చ చెప్పినప్పటికీ.. దానికి అంగీకరించలేదట. దాంతో ఆ చిత్రం కారణంగా వీళ్లిద్దరి మధ్య పెద్ద గొడవలే తలెత్తినప్పటికీ.. చివరగా వరుణ్ తేజ్ మాటలనే లావణ్య త్రిపాఠి విని ఆ సినిమా చేయనని చెప్పేసిందట. ఇక ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. విజయ్ దేవరకొండ వల్ల వీళ్ళిద్దరి మధ్యల పెద్ద గొడవలే జరిగాయట. అయితే ఆ సినిమాలో నటించిన నటీనటులందరూ ప్రస్తుతం స్టార్ పొజిషన్ లో ఉన్నారని.. ఒక వేళ లావణ్య త్రిపాఠి కనుక ఆ సినిమాలో నటించి ఉంటే ఖచ్చితంగా తను కూడా స్టార్ హీరోయిన్ అయ్యేదని లావణ్య త్రిపాఠి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.