Home Cinema Mrunal Thakur: ఏంటి హీరోయిన్ అవుతావా.? ఎప్పుడైనా అద్దంలో ముఖం చూసుకున్నవా అంటూ మృణాల్ పై...

Mrunal Thakur: ఏంటి హీరోయిన్ అవుతావా.? ఎప్పుడైనా అద్దంలో ముఖం చూసుకున్నవా అంటూ మృణాల్ పై దారుణంగా..

Heroine Mrunal: ఇండస్ట్రీలో కొందరు చాలా సినిమాలు నటించినప్పటికీ కూడా స్టార్టమ్ సంపాదించడానికి నాన తంటాలు పడుతుంటారు. కానీ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ గా మారిపోయిన భామలు కూడా లేకపోలేదు. మరి అలాంటి భామ ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీలలో ఒకరిగా కొనసాగుతున్న మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ఒకరు. అయితే ఈమెకి రాత్రికి రాత్రి స్టార్టమ్ అంత సులభంగా ఏమీ రాలేదు. చిన్నప్పటినుంచి నటనపై మక్కువ ఎక్కువ ఉండడంతో మొదట బుల్లి తెర పై అడుగు పెట్టి చాలా హిందీ సీరియల్లలో నటించిన తర్వాత తను నటించిన కుంకుమ భాగ్య సీరియల్ లో మంచి గుర్తింపు సాధించింది.

See also  NagaChaitanya Reacts: మొదటి సారి డివోర్స్ గురించి రియాక్ట్ అయిన నాగచైతన్య..సమంత చాలా మంచి మనిషి..

what-kind-of-heroine-will-you-be-mrunal-have-you-ever-looked-at-your-face-in-the-mirror

ఇక ఆ సీరియల్ లో గుర్తింపు తర్వాతే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలను మొదలు పెట్టింది కాగా.. ఆ సమయంలో ఎన్నో దుర్భరమైన పరిస్థితులను చెప్పుకోలేని సమస్యలను కూడా ఎదుర్కొన్నది. తొలుత ఆడిషన్ జరిగినప్పుడు అక్కడికి వెళ్తే ఆమెను ఓ దర్శకుడు ఏంటి నువ్వు హీరోయిన్ (Heroine Mrunal) అవుదామని వచ్చావా.? ముఖం అద్దంలో చూసుకున్నావా అంటూ దారుణంగా ఆమె ను అవమానకరంగా మాట్లాడాడట.. అయినప్పటికీ మృణాల్ ఠాకూర్ కి నటనపై ఉన్న ఆసక్తితో వెనుదిరిగి చూడకుండా అలాంటివన్నీ సినిమా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయని పట్టించుకోకుండా మొదటిసారిగా విట్టి దండు అనే మరాఠీ చిత్రంతో రంగ ప్రవేశం చేసింది.

what-kind-of-heroine-will-you-be-mrunal-have-you-ever-looked-at-your-face-in-the-mirror

ఇక ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి లవ్ సోనియా అనే చిత్రంలో నటించినప్పటికీ ఈ చిత్రం కమర్షియల్ గా హిట్ సాధించినప్పటికీ పాత్రకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. అలా మెల్ల మెల్లగా బాలీవుడ్ లో వరుస సినిమాలతో కాస్త బిజీ అవుతున్న తరుణంలోనే మృణాల్ ఠాకూర్ కి సీతారామం వంటి చిత్రం ఆమె జీవితంలో ఓ టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈ చిత్రం తెలుగులో భారీ విజయం సాధించడమే కాక తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాలలో విడుదల చేశారు.

See also  Meena: ఛీ ఛీ అలాంటి పనులు చేయ్యడానికి సిద్దమేనట మీనా.. భగ్గుమంటున్న ఫాన్స్..

what-kind-of-heroine-will-you-be-mrunal-have-you-ever-looked-at-your-face-in-the-mirror

దాంతో ఇంకేముంది అన్ని భాషల్లో సీతారామమ్ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో రాత్రికి రాత్రే మృణాల్ ఠాకూర్ ఓవర్ నైట్ స్టార్ గా పేరు కైవసం చేసుకుంది. ఎన్నో ఏళ్ల నుంచి తాను కష్టపడుతున్న ఫలితానికి నిదర్శనం సీతారామమ్. ఆ ఒక్క చిత్రంతో స్టార్టమ్ దక్కించుకుంది. అలా గతంలో విమర్శించిన వారే ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోను వరుస చిత్రాలతో తన సినీ కెరియర్ దూసుకుపోతుంది. ఒకప్పుడు ఆమెను ఆడిషన్స్ లో అవమానించిన దర్శకులే ప్రస్తుతం ఆడిషన్స్ అవసరం లేకుండా హీరోయిన్ గా రావాలంటూ ఆమె వెంటపడ సాగారు అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఆమె స్థాయి ఏ రేంజ్ లో ఉందో.. ఇక ఇటీవల ఆమె బర్త్ డే జరగడంతో ఆమె ఫోటోలు ట్రెండింగ్ లోకి రాసాగాయి. చాలా మంది అభిమానులు సెలబ్రిటీలు సైతం ఆమెకి శుభాకాంక్షలు తెలియజేశారు.