
Varun Tej – Lavanya Tripathi : మిస్టర్ సినిమాతో ఒకరికొకరు తొలిసారి పరిచయమై.. అక్కడ నుంచి వారి ప్రయాణం ప్రేమగా మారి.. ఈరోజు అందరి ముందు జంటగా నిలబడిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గురించి మనందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం గురించి అందరికీ తెలిసినప్పటికీ.. దాని గురించి ( Expensive item in Varun Tej engagement ) అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. నాగబాబుని కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో వరుణ్ తేజ్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అని అడిగితే.. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు.. వాళ్ల నిర్ణయాలు నేను గౌరవిస్తాను.. వాళ్లకి ఏం చేయాలనిపిస్తే అది చేస్తారు అని చెప్పారు. అప్పుడే అందరికీ వరుణ్ తేజ్ లవ్ లో పడ్డాడని డౌట్ అయితే వచ్చింది.
ఇదిలా ఉంటే జూన్ 9వ తేదీ ఎంతో వైభవంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ కి చిరంజీవి, సురేఖ.. రామ్ చరణ్, ఉపాసన.. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి.. ఇలా అందరూ ఫ్యామిలీతో అటెండ్ అయ్యి ఎంజాయ్ చేశారు. అలాగే ఇటు సినిమాల్లో.. అటు రాజకీయాల్లో కూడా పాల్గొంటూ విపరీతమైన బిజీగా ( Expensive item in Varun Tej engagement ) ఉన్న పవన్ కళ్యాణ్ కూడా రావడం పెద్ద విశేషం. మొదట్లో ఈ అకేషన్ కి పవన్ కళ్యాణ్ రాడని వార్తలు వచ్చాయి కానీ.. చివరకు వచ్చి తీరాడు. ఇలా మెగా కుటుంబం అన్నదమ్ములు.. ఒకరి కుటుంబం పై ఒకరికి ఉన్న ప్రేమని, గౌరవాన్ని, ఇష్టాన్ని ప్రదర్శించుకున్నారు. చూడముచ్చటైన ఈ కుటుంబాన్ని చూసి మెగా అభిమానులు అందరూ ఆనందంతో పరవశించిపోయారు.
అలాగే ఎంగేజ్మెంట్ అనగానే అందరికీ మొదట కన్ను వెళ్ళేది ఉంగరం పైన. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్లో ఒకరికి ఒకరు ఉంగరం తొడిగారు. అయితే ఈ ఉంగరం ఎవరు కొన్నారు దాని విలువెంత అని ఆరాతీస్తే.. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కి కొన్న ఉంగరం 25 లక్షలు కాగా.. అలాగే వరుణ్ తేజ్ కి కూడా ఉంగరం ( Expensive item in Varun Tej engagement ) పెట్టేందుకుగాను అంతే పెట్టి కొన్నది లావణ్య త్రిపాఠి కూడా.. ఇద్దరివి ఒకరికొకరు 25 లక్షలు చొప్పున ఉంగరాలు కొనుక్కొని.. ఎంతో ఆనందంగా ఈ సంబరాన్ని జరుపుకున్నారు. అలాగే వరుణ్ తేజ్ వేసుకున్న డ్రెస్ కూడా రెండు లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నాడంట. ఇక లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీర.. బెనారస్ సారి దీన్నీ మూడు లక్షల రూపాయలు విలువ పెట్టి కొన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇద్దరు కూడా చక్కని ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని.. ఎంతో అందంగా.. చాలా చూడముచ్చటైన జంటగా ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. మెగా హీరో ఎంగేజ్మెంట్లో తన కాబోయే భార్య చక్కటి తెలుగమ్మాయిలా చీర కట్టుకొని.. ముడి వేసుకొని.. దానికి పువ్వులు పెట్టుకొని.. తయారవ్వడం నిజంగా మెగా అభిమానులు అందరూ ఎంతో ఆనందంగా పొంగిపోతున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ టైం లో చిరంజీవి ఆయన భార్య సురేఖ దగ్గర నిలబడి వాళ్ళిద్దరి రింగులు మార్చుకునేటప్పుడు క్లాప్స్ కొడుతూ ఉండడం నిజంగా అందరినీ ఆనందింప చేసింది. నాగబాబు వాళ్ళ అన్న చిరంజీవికి ఇచ్చిన గౌరవం చూసి ప్రతి ఇంట్లోనే అన్నగారికి ఇలాంటి గౌరవం ఇవ్వాలని అర్ధమవుతుంది.