Anushka Real Name: అక్కినేని నాగార్జున అనుష్కల వ్యవహారం గురించి ఎప్పుడు ఏదో ఒక రకమైన వార్త నెట్టింట తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అసలు అనుష్క ఇండస్ట్రీకి పరిచయం చేసింది అక్కినేని నాగార్జున.. అందుకోసమే వీళ్ళ గురించి ఏదైనా చిన్న విషయం బయటకు వచ్చినా సరే అది నెట్టింట తెగ అల్లరి చేస్తుంది.. అలా వీళ్ళ గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. కేవలం ఇదే కాకుండా వీళ్ళిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుంది కూడా రకరకాల వార్తలు వచ్చాయి. దీనంతటికీ అసలు సిసలైన కారణమేంటంటే అనుష్క నాగార్జున జోడి కి మన ఇండస్ట్రీలో మంచి జంటగా గుర్తింపు ఉన్నది.
ఆ కారణం చేతనే వీళ్లిద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి.. అలా మొదటగా అనుష్క ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాగార్జుననే.. సూపర్ చిత్రం ద్వారా ఈ అమ్మడిని తెలుగు తెరకు పరిచయం చేయగా.. ఆ తర్వాత డాన్, డమరుకం, రగడ, ఓం నమో వెంకటేశాయ, ఊపిరి వంటి మొదలైన సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. ఇక వరుసగా ఓ స్టార్ హీరో సరసన స్టార్ హీరోయిన్ కలిసి సినిమాలో నటిస్తే ఖచ్చితంగా వీళ్లిద్దరి మధ్య సందులో సడే మీయా నడుస్తుంది అనుకోవడం అందరూ ఊహించే సహజమైన విషయమే. సేమ్ అందరూ ఊహించినట్లుగానే నాగార్జున అనుష్కల మధ్య కూడా ఏదో రకమైన ఎఫైర్ నడుస్తుందని వార్తలు వచ్చాయి. అలా విరిద్దరి మీద వార్తలు కామన్ గా రావడం సహజమయ్యింది..
అయితే ఇక్కడ అసలు సిసలైన విషయం.. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయం ఉన్నది అదేంటంటే.. అనుష్క అసలు పేరు అనుష్క కాదట అసలు ఆమె పేరు అనుష్క గా మారడానికి దాని వెనుక అక్కినేని నాగార్జున ఉన్నాడట. అనుష్క అసలు (Anushka Real Name) పేరు స్వీటీ.. ఇండస్ట్రీకి అడుగు పెట్టిన తొలినాళ్లలో సూపర్ చిత్రంలో నటిస్తున్న సమయంలో నాగార్జున నీ పేరేంటి అని అడిగితే స్వీటీ అని చెప్పిందట. దానికి నాగర్జున ఆ విషయాన్ని నమ్మక ఒకసారి నీ పాస్పోర్ట్ ఇవ్వమని అడిగితే అందులో కూడా స్వీటీ అనే ఉందట.
దాంతో స్వీటీ పేరు నీకు అస్సలు సూట్ అవ్వలేదు అని తనకు పేరు పెట్టాలని ఆలోచించాడట.. అలా ఆలోచిస్తున్నప్పుడు అదే సమయంలో షూటింగ్ సెట్లోకి అనుష్క అనే సింగర్ వచ్చిందట.. అరే ఇదేదో పేరు బాగుందని ఆమెకు అనుష్క అని పేరు పెట్టేసాడట.. దాంతో అనుష్క కూడా మీకు నచ్చితే ఇకనుంచి అనుష్కనే పిలవండి అలవాటయిన తర్వాత చూద్దాం అని అన్నదట.. అలా నాగార్జున వల్లే స్వీటీ అనే పేరుతో అనుష్క గా మారింది. పేరునే మార్చేంత బలమైన రిలేషన్ అనుష్క నాగార్జునల మధ్య ఉందా.? అంటూ ఈ విషయం నెట్టింట వైరల్ అవుతుంది.. మరి ఈ విషయం అనుష్క నీకు వచ్చి చెప్పిందా? అని మీరు కామెంట్లు చేయొచ్చు కానీ ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ గారి వెల్లడించారు.