Sri Reddy Comments: తెలుగు చిత్ర పరిశ్రమ లో హీరోయిన్ గా అడుగు పెట్టి ఆ తర్వాత అదృష్టం కలిసి రాక క్యారెక్టర్ ఆర్టిస్టు గా పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. ఆ తర్వాత అవకాశాలు కలిసి రాక సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యింది శ్రీ రెడ్డి . ఆ తర్వాత ఇండస్ట్రీ లో ఉన్న వాళ్లందరి పై తనకు జరిగిన అన్యాయం గురించి నిత్యం సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటూ వార్తల్లో నిలుస్తుంది శ్రీ రెడ్డి.
ఇక శ్రీ రెడ్డి ఏదైనా వ్యాఖ్యలు చేసినట్లయితే అవి ఖచ్చితంగా ఇటు వెబ్ మీడియాలో అటు సోషల్ మీడియాలో సైతం వివాదాస్పదంగా మారుతూ చర్చకు దారి తీస్తూ ఉంటాయి. అలా ఎల్లప్పుడూ అలా ఎప్పుడూ కాంట్రవర్సీ క్రియేట్ చేసే విధంగా కామెంట్ చేస్తూ ఉంటుంది. తనకు ఎదుటి వారు ఎంతటి వారైనా అతడు ఏ స్థాయిలో ఉన్నా అదంతా అనవసరం తనకు అన్యాయం జరిగిందా దాని గురించి కచ్చితంగా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది.
అయితే తాజాగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికైన విషయం మనందరికీ తెలిసిందే.. ఇక ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న కల అల్లు అర్జున్ రూపంలో మనకు ఎదురయ్యింది. పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీల నుండి సైతం అల్లు అర్జున్ కు విషెస్ రావడం జరిగాయి. ఇక అల్లు అర్జున్ అభిమానులకి ఆనందానికి కొలువ లేదని చెప్పాలి. సోషల్ మీడియా మొత్తం అల్లు అర్జున్ పోస్టులతో హ్యాష్ ట్యాగ్లతో దుమ్ము దుమారం చేసి రచ్చ లేపారనే చెప్పాలి. ఇందులో భాగంగానే శ్రీ రెడ్డి సైతం అల్లు అర్జున్ కీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.
మరి తన సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ ఒక సారి గమనించినట్లయితే కంగ్రాట్యులేషన్స్ అల్లు అర్జున్ ఆన్ విన్నింగ్ బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు అంటూ బన్నీకి శుభాకాంక్షలు తెలియజేసింది శ్రీ రెడ్డి. కేవలం ఇదే కాకుండా బన్నీలో నాకు నచ్చిన అసలు సిసలైన విషయం అదే అంటూ ట్విట్టర్ వేదికగా తన మనసులోని మాటను (Sri Reddy Comments) వెల్లడించింది. అల్లు అర్జున్ మెగా అనే ముసుగు లేకుండా కేవలం తన పని తానే చేసుకుంటున్నాడు అంటూ కామెంట్ చేసింది. దాంతో ఒక్క సారిగా నెట్టింట ఇక ఈ వార్త ఓరేంజ్ లో వైరల్ గా మారింది.
అల్లు అర్జున్ లో నాకు నచ్చిన విషయం ఏమిటంటే, మెగా అనే ముసుగులో లేకుండా, తన పని తాను చేసుకుంటున్నాడు 👌
Congratulations Allu Arjun on Winning Best Actor National Award 🙏#AlluArjun #NationalFilmAwards2023 pic.twitter.com/ALzNeqYFpG
— Sri Reddy (@MsSriReddy) August 27, 2023