Nani – Nithya Menen: తెలుగు చిత్ర పరిశ్రమంలో నాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ కొనసాగించగా.. అష్టా చమ్మా చిత్రంతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడుశ ఇక ఈ చిత్రంతో ఇండస్ట్రీలో హీరోగా తనెంటేసో నిలదొక్కుకున్నాడు. అలా ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా తన తొలి చిత్రం అలా మొదలైంది తో నిత్యామీనన్ పరిచయం అయ్యింది. కాగా నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం దసరా తో సూపర్ హిట్ అందుకొని పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇక ఇదే కాకుండా నాని చేతిలో హాయ్ నాన్న అనే చిత్రం కూడా ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మృనాల్ ఠాకూల్ నటిస్తుందన్న విషయం ప్రతి ఒక్క నాని అభిమానులకే కాక తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిందే..
అసలు ఈ విషయాలన్నీ పక్కన పెట్టి మన టాపిక్ విషయంలోకి అడుగు పెడితే.. నాచురల్ స్టార్ హీరో నానిని మరొక స్టార్ హీరోయిన్ నిత్యమీనన్ అందరి ముందు నీకు సిగ్గు లేదా అంటూ తిట్టిందట. మరి ఆ హీరోయిన్ మరెవరో కాదు అలా మొదలైంది చిత్రంలో నాని సరసన హీరోయిన్ గా నటించిన నిత్యామీనన్. అయితే మరి హీరో నానిని అంత పెద్ద మాట అనవలసిన అవసరం ఎందుకు వచ్చింది.? అన్న విషయం గురించి మనం ఎప్పుడు తెలుసుకుందాం. నిత్యా మీనన్ తొలి చిత్రం అలా మొదలైంది. ఇక ఈ చిత్రంతో న్యాచురల్ స్టార్ నాని మరియు నిత్యామీనన్ లు చాలా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఇదే కాకుండా ఈ చిత్రం యొక్క డైరెక్టర్ నందిని రెడ్డికి కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాయి.
తొలి చిత్రం కావడంతో హీరో నాని హీరోయిన్ నిత్యమీనన్ లకు ఈ చిత్రం ద్వారా చాలా మంచి స్నేహబంధం ఏర్పడిందట.. ఇక వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవడంతో షూటింగ్ సెట్లో నిత్యం తెగ అల్లరి చేస్తూ గొడవ పడుతుండే వాళ్ళటశ ఇక ఆ ఫ్రెండ్షిప్ కారణం చేత ఓ ఫంక్షన్ లో నిత్యామీనన్ భోజనం చేస్తున్న సమయంలో నేరుగా నాని నిత్యామీనన్ దగ్గరికి వచ్చి ఆమె తింటున్న ప్లేట్ లో ఉన్న ఐటమ్ తీసుకొని టక్కున తన ప్లేట్లో వేసుకున్నాడట.. అలా అల్లరి చేష్టలు చేస్తున్న నానిని పట్టుకుని కోపంతో నిత్యామీనన్ నలుగురు ఏమనుకుంటారు అని నీకు కొంచమైన సిగ్గు అనేది ఉండదా అంటూ తెగ తిట్టుకుందట..
నిత్యామీనన్ అన్న మాటలకు అస్సలు పట్టించుకోకుండా కొంచెం కూడా ఫీలవ్వకుండా నాని మనమిద్దరం ఫ్రెండ్స్ అలాంటప్పుడు ప్లేట్లో నుండి తీసుకుంటే అందులో పెద్ద తప్పేముంది దానికి నువ్వు ఇంతలా ఫీల్ అవ్వడం నాకు పెద్దగా నచ్చడం లేదు. అయినా నాకు అలాంటి ఫీల్ ఏం ఉండదు అంటూ తేల్చి చెప్పేసాడు. అయినప్పటికీ నిత్యమీనన్ అందరి ముందు నాని అలా చేసేసరికి కాస్త రూడ్ గా కోపంగా మాట్లాడిందట. కానీ నేచురల్ స్టార్ నాని (Nani – Nithya Menen)ఊరుకుంటాడా ఎప్పటిలాగే తన చేసే అల్లరితో నిత్యామీనన్ ని కూల్ చేసి మళ్ళీ తన స్నేహ బంధాన్ని కొనసాగించాడట. దీంతో నిత్యామీనన్ కూడా ఆ తర్వాత కూల్ గా ఉంటూ ఎప్పటిలాగే తన స్నేహాన్ని కొనసాగించిందట.